• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పవన్ పాలిటిక్స్.....

పవన్ పాలిటిక్స్.. రంగంలోకి మరో ఐకానిక్ ప్రొడ్యూసర్..

| ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. పిఠాపురం నియోజకవర్గం నుంచి బరిలో దిగిన విషయం తెలిసిందే

By - Tupaki Desk
Update: 2024-05-10 10:44 GMT

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. పిఠాపురం నియోజకవర్గం నుంచి బరిలో దిగిన విషయం తెలిసిందే. గత ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయిన పవన్.. ఈ సారి ఎలా అయినా గెలవాలని ఫిక్స్ అయ్యారు. అందుకు తగ్గట్లే పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. పిఠాపురంతో పాటు రాష్ట్రమంతా తిరుగుతున్నారు. టీడీపీ- జనసేన- బీజేపీ కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను కోరుతున్నారు.

అయితే పవన్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతూ సినీ రంగానికి చెందిన అనేక మంది ప్రచారం నిర్వహిస్తున్నారు. మెగా ఫ్యామిలీ నుంచి వరుణ్ తేజ్, సాయి దుర్గ తేజ్, వైష్ణవ్ తేజ్ పిఠాపురంలో ప్రచారం చేశారు. రోడ్ షోల్లో పాల్గొన్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవి కూడా తన తమ్ముడు పవన్‌ ను గెలిపించాలని పిఠాపురం ప్రజలను కోరుతూ రీసెంట్ గా సోషల్ మీడియాలో ప్రత్యేక వీడియోను రిలీజ్ చేశారు.

జబర్దస్త్ ఆర్టిస్టులు గెటప్ శీను, సుడిగాలి సుధీర్, ఆటో రాంప్రసాద్, హైపర్ ఆది సహా పలువురు పవన్ మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. ఇటీవల యంగ్ ప్రొడ్యూసర్ నాగవంశీ కూడా పిఠాపురం వెళ్లారు. పవన్ ను గెలిపించాలని ఇంటింటికీ తిరుగుతూ పాంప్లెట్స్ పంచి పెడుతూ ప్రజలను కోరారు. నాగవంశీతో పాటు ఆయన టీమ్ కూడా ప్రచారంలో పాల్గొంది. ఇప్పుడు ఈ లిస్ట్ లోకి మరో నిర్మాత శ్రీనివాస కుమార్- SKN చేరారు.

పిఠాపురంలో నేడు పవన్ మద్దతుగా ప్రచారం చేశారు ఎస్కేఎన్. ఇంటింటికి వెళ్లి జనసేనానిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కరపత్రాలు పంచుతూ ప్రచారం చేశారు. స్థానికంగా ఉన్న ఆలయంలో ప్రత్యేక పూజలు కూడా చేశారు. 'దాచుకోవడం రాదు.. దోచుకోవడం తెలియదు.. నిజమైన నాయకుడు పవన్' అంటూ బేబీ నిర్మాత ఎస్కేఎన్ నినదించారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి.

ఇక పవన్ కు సినీ రంగం నుంచి మద్దతు క్రమంగా పెరుగుతోంది. కొందరు సెలబ్రిటీలు ప్రత్యక్షంగా ప్రచారం చేస్తుంటే.. మరి కొందరు సోషల్ మీడియాలో పవన్ కు సపోర్ట్ గా పోస్టులు పెడుతున్నారు. ప్రచారానికి మరికొద్ది గంటలే సమయం ఉండటంతో పిఠాపురంలో కూటమి నాయకులు బిజీబిజీగా గడుపుతున్నారు. మరి ఈ ఎన్నికల్లో పవన్ ఎంతటి మెజార్టీతో గెలుస్తారో తెలియాలంటే జూన్ 4వ తేదీ వరకు వేచి చూడాల్సిందే.

Tags:    
  • Tollywoodproducer 
  • SKN 
  • Nagavamsi 
  • Pawankalyan 
  • Janasen 
  • Appolitics 
  • Apelections 
  • Electioncampaign 
  • Varuntej 
  • Saidharamtej 
  • Chiranjeevi 
  • Pithapuram 

Similar News

ఎన్టీఆర్ సినిమా కోసం అతన్ని దూరం చేసుకోక తప్పదా!

2026-11-03 08:27 GMT

బాలీవుడ్ హీరో అని పిలవకండి..రణ్‌బీర్ కపూర్ మాస్ స్టేట్‌మెంట్!

2026-11-03 08:23 GMT

బ్రేకప్ రూమర్స్‌కు స్టార్ హీరోయిన్ చెక్..ఆ ఫొటోలు షేర్ చేస్తూ క్లారిటీ!

2026-11-03 08:21 GMT

Tupaki Exclusive: రుద్రవరం-పీఎస్ కథలో ఎన్నో ఆసక్తికర మలుపులు.. టీమ్ ఏమంటోంది?

2026-11-03 08:04 GMT

ఇండియన్ టాలెంట్‌పై హైబ్ కన్ను!

2026-11-03 07:52 GMT

Tupaki Exclusive: సమ్మర్ హాలిడేస్ మూవీ టీమ్‌తో స్పెషల్ ఇంటర్వ్యూ

2026-11-03 07:26 GMT

పదేళ్ల వయసులోనే గొప్పగా ఊహించుకున్నా.. కానీ!

2026-11-03 07:22 GMT

‘రామాయణ’కు బాంబే హైకోర్టు రక్షణ!

2026-11-03 07:15 GMT

ఇన్నాళ్లకు సెట్ లో అడుగుపెట్టిన నివేదా థామస్!

2026-11-03 07:05 GMT

రాజమౌళి మొదటి సారి యాక్షన్ చెప్పిన తర్వాత ఏం చేశాడో తెలుసా?

2026-11-03 06:58 GMT

ఇత‌ర న‌టుల‌ను వ‌దిలేసి దియా వీడియోనే ఎందుకు తొల‌గించారు? ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు!

2026-11-03 06:58 GMT

తెలుగు సినిమాలకు ఇప్పుడు ఈ మంత్రం ఒక్కటే అసలైన ప్రమోషన్!

2026-11-03 06:56 GMT

Copyright @2026

Powered by Blink CMS