• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అతడు తప్పించుకున్నాడు,...

అతడు తప్పించుకున్నాడు, ఇతడు బలి అయ్యాడు!

| యూనివర్శల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ విక్రమ్‌ తో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు.

By - Tupaki Desk
Update: 2024-08-12 08:30 GMT

యూనివర్శల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ విక్రమ్‌ తో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. చాలా ఏళ్ల తర్వాత కమల్‌ కి ఓ హిట్‌ పడటంతో ఆయన కెరీర్‌ తిరిగి పుంజుకుంది అంటూ ఫ్యాన్స్ తో పాటు మీడియా వర్గాల వారు అనుకున్నారు. విక్రమ్‌ హిట్ నేపథ్యంలో ఆగిపోయిన ఇండియన్ 2 ను తిరిగి ప్రారంభించారు. కమల్‌ చేస్తే హిట్‌ ఖాయం అంటూ నిర్మాతలు కూడా భావించి భారీగా ఖర్చు చేసి ఇండియన్‌ 2 ను ముగించి ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. భారీ అంచనాల నడుమ పాన్ ఇండియా రేంజ్ లో విడుదల అయిన ఇండియన్ 2 డిజాస్టర్ గా నిలిచిన విషయం తెల్సిందే.


థియేటర్‌ లో విడుదల అయిన సమయంలో సోషల్‌ మీడియా తీవ్రమైన విమర్శలు ఎదుర్కొన్న ఇండియన్‌ 2 ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్‌ మొదలు అయిన తర్వాత అంతకు మించి అన్నట్లుగా ట్రోల్స్ ను ఎదుర్కొంటుంది. ఓటీటీ స్ట్రీమింగ్ మొదలు అయినప్పటి నుంచి సోషల్‌ మీడియాలో నెగటివ్‌ ట్రోల్స్ తో నెటిజన్స్ రెచ్చి పోతున్నారు. ముఖ్యంగా సినిమాలో కీలక పాత్రలో నటించిన సిద్దార్థ్‌ తో పాటు దర్శకుడు శంకర్‌ ఇంకా కమల్‌ హాసన్‌ మేకప్‌ గురించి ప్రధానంగా చర్చ జరుగుతోంది. ఇండియన్‌ 2 ఇలా ఉంటుందని మేము ఊహించలేదు అంటూ కమల్‌ ఫ్యాన్స్ స్వయంగా అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ఇదే సమయంలో హీరో సిద్దార్థ్‌ ప్రమోషన్ సమయంలో చేసిన కొన్ని వ్యాఖ్యలను షేర్‌ చేస్తూ ట్రోల్‌ చేస్తున్నారు. ఆ సమయంలో చేసిన అతికి ఇండియన్ 2 ఫలితానికి ఏమైనా సంబంధం ఉందా అంటూ ప్రశ్నిస్తున్నారు. మరో ఆసక్తికర విషయం ఏంటంటే ఈ సినిమాలో సిద్దార్థ్‌ పోషించిన పాత్ర కోసం మొదట యంగ్‌ తమిళ హీరో శివ కార్తికేయన్‌ ను సంప్రదించడం జరిగింది. ఆయన శంకర్ తో సినిమా అనగానే ఆసక్తి కనబర్చాడట. కానీ డేట్ల విషయంలో సర్ధుబాటు అయ్యే పరిస్థితి లేకపోవడంతో ఇండియన్ 2 నుంచి షూటింగ్ ప్రారంభం కాకుండానే తప్పుకున్నాడు అంటూ ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

డిజాస్టర్ అయిన ఇండియన్ 2 సినిమా లో సిద్దార్థ్‌ పాత్ర ప్రధానంగా ఉంటుంది. కనుక సినిమా ఫ్లాప్‌ బాధ్యత అతడిపై పడింది. శివ కార్తికేయన్‌ ఆ సినిమా చేసి ఉంటే కచ్చితంగా ఆ ట్రోల్స్ ని ఎదుర్కోవాల్సి వచ్చింది. డిజస్టర్‌ నుంచి శివ కార్తికేయన్‌ తప్పించుకోగా సిద్దార్థ్‌ మాత్రం బలి అయ్యాడు. హీరోగా ఈ మధ్య కాలంలో సక్సెస్‌ కోసం పరితపిస్తున్న సిద్దార్థ్‌ కి ఇండియన్ 2 ఫ్లాప్‌ మరింతగా ఇబ్బందిగా మారే అవకాశాలు ఉన్నాయి. ఆయన కెరీర్‌ మరింత ఇబ్బందుల్లో పడ్డట్లు అయ్యిందని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు శివ కార్తికేయన్‌ మాత్రం బ్యాక్ టు బ్యాక్‌ సినిమాలతో, హిట్స్ తో కెరీర్ లో దూసుకు పోతున్నాడు.

Tags:    
  • Sivakarthikeyan 
  • Indian2 
  • Kamalhaasan 
  • Shankar 
  • Kollywood 
  • Indian3 
  • Sidharth 

Similar News

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

ఇదేమి కన్ఫ్యూజన్ నాని.. అది ఇది కాదు.. అదే ఇది..!

2026-11-05 07:53 GMT

'రామాయణం' మూవీ రివ్యూ

2026-11-05 07:40 GMT

బాకీలు ఎగ్గొట్టిన మ్యూజిక్ డైరెక్టర్.. దేవుడికి కంప్లైంట్!

2026-11-05 07:36 GMT

మళ్లీ వోగ్ కవర్‌పై కత్రినా.. ఫ్యాన్స్‌కు స్పెషల్ ట్రీట్!

2026-11-05 07:35 GMT

ఈ దీపావళికి పెద్దగా సౌండ్ చేయలేకపోయిన టాలీవుడ్!

2026-11-05 07:27 GMT

కీర్తి సురేష్.. మరోసారి లెక్క తప్పిందా..

2026-11-05 07:23 GMT

సంక్రాంతి బాక్సాఫీస్ రేసు - 1000 కోట్ల బిజినెస్ అంచనా!

2026-11-05 07:21 GMT

తరుణ్ భాస్కర్.. నెక్స్ట్ ఆ హీరో దగ్గరికేనా!

2026-11-05 07:17 GMT

రహస్యం బయటపెట్టిన భాగ్యశ్రీ.. ఆ టాలెంట్ కూడా ఉందా?

2026-11-05 07:03 GMT

Copyright @2026

Powered by Blink CMS