అనిరుధ్ మొద‌టిసారి ఆ డైరెక్ట‌ర్‌తో..

వెంక‌ట్ ప్ర‌భు సినిమాలు చాలా స్పెష‌ల్ గా ఉంటాయ‌నే సంగ‌తి తెలిసిందే. కానీ ఈ మ‌ధ్య ఆయ‌న అనుకున్న ఫాంలో లేరు.;

Update: 2025-07-18 06:28 GMT

ఇండ‌స్ట్రీలో ఎవ‌రి త‌ల‌రాత‌నైనా ఒక ఫ్రైడే డిసైడ్ చేసేస్తుంది. అలా ఓ ఫ్రైడే బాగా క‌లిసిరావ‌డంతో ఆ హీరో క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. అత‌నెవ‌రో కాదు, కోలీవుడ్ హీరో శివ కార్తికేయ‌న్. అమ‌రన్ సినిమా త‌ర్వాత శివ కార్తికేయ‌న్ మార్కెట్, క్రేజ్ బాగా పెరిగిపోయాయి. అమ‌ర‌న్ మూవీ రూ.100 కోట్ల క్ల‌బ్ లో చేర‌డంతో ఆయ‌నకు వ‌రుస సినిమా ఆఫ‌ర్లొస్తున్నాయి.

ప్ర‌స్తుతం సుధ కొంగ‌ర ద‌ర్శ‌క‌త్వంలో త‌న 25వ సినిమాగా ప‌రాశ‌క్తి చేస్తున్న శివ కార్తికేయ‌న్ ఆ సినిమాను వేగంగా పూర్తి చేస్తున్నారు. దీంతో పాటూ మ‌రో రెండు ప్రాజెక్టులు కూడా లైన్ లో ఉన్నాయి. గుడ్ నైట్ సినిమాతో స‌త్తా చాటిన వినాయ‌క్ చంద్ర‌శేఖ‌ర‌న్ ద‌ర్శ‌క‌త్వంలో శివ కార్తికేయ‌న్ ఓ మూవీకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. ఈ సినిమాలో మోహ‌న్ లాల్ కూడా ఓ కీల‌క పాత్ర చేస్తున్నారు. వాస్త‌వానికి ఈ సినిమా ముందు మొద‌లుపెట్టాల‌ని అనుకున్న‌ప్ప‌టికీ మోహ‌న్ లాల్ డేట్స్ కుద‌ర‌క ఈ సినిమా కాస్త లేట‌య్యేట్టు ఉంది.

వినాయ‌క్ సినిమా లేట‌వ‌డంతో ఆ గ్యాప్ లో వెంక‌ట్ ప్ర‌భు ద‌ర్శ‌క‌త్వంలో సినిమాను ఓకే చేసుకున్నార‌ట శివ కార్తికేయ‌న్. వెంక‌ట్ ప్ర‌భు సినిమాలు చాలా స్పెష‌ల్ గా ఉంటాయ‌నే సంగ‌తి తెలిసిందే. కానీ ఈ మ‌ధ్య ఆయ‌న అనుకున్న ఫాంలో లేరు. అయితే శివ కార్తికేయ‌న్ మంచి ఫాంలో ఉన్నారు కాబ‌ట్టి ఈ సినిమా వ‌ర్క‌వుట్ అవుతుంద‌ని అంద‌రూ భావిస్తున్నారు.

కాగా వెంక‌ట్ ప్ర‌భు, శివ కార్తికేయ‌న్ కాంబినేష‌న్ లో వ‌చ్చే మూవీ గురించి ఇప్పుడో ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తోంది. సైన్స్ ఫిక్ష‌న్ జాన‌ర్ లో తెర‌కెక్క‌బోతున్న ఈ సినిమాకు సౌత్ సెన్సేష‌న్ అనిరుధ్ ర‌విచంద‌ర్ సంగీతం అందించ‌నున్న‌ట్టు వార్త‌లొస్తున్నాయి. అస‌లే వెంక‌ట్ ప్ర‌భు, శివ కార్తికేయ‌న్‌ది క్రేజీ కాంబినేష‌న్ కాగా అనిరుధ్ రాక‌తో అది ఇంకాస్త పెరిగింది. అక్టోబ‌ర్ నుంచి ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ మొద‌ల‌య్యే అవ‌కాశాలున్నాయ‌ని అంటున్నారు. కాగా ఈ సినిమాలో ఇద్ద‌రు హీరోయిన్లు న‌టించ‌నున్నార‌ని, అందులో ఒక‌రు క‌యాదు లోహ‌ర్ కాగా, మ‌రొక‌రు క‌ళ్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్ అని టాక్. మ‌రి ఇందులో నిజ‌మెంత‌న్న‌ది తెలియాల్సి ఉంది. త్వ‌ర‌లోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చే అవ‌కాశ‌ముంది.

Tags:    

Similar News