• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సూపర్‌ స్టార్‌ లెగస్సీ...

సూపర్‌ స్టార్‌ లెగస్సీ శివ కార్తికేయన్‌ కొనసాగిస్తాడా..?

| ఆ పాత్ర చేయడం ద్వారా విజయ్ కి శివ కార్తికేయన్ ఎంతటి ఆప్తుడో క్లారిటీ వచ్చింది

By - Tupaki Desk
Update: 2024-11-08 10:30 GMT

కోలీవుడ్‌ సూపర్ స్టార్ విజయ్‌ పూర్తిగా రాజకీయ నాయకుడిగా మారబోతున్న నేపథ్యంలో ఆయన సినీ వారసత్వం ను కొనసాగించేది ఎవరు, తమిళ సినిమా ఇండస్ట్రీలో విజయ్ తర్వాత ఆ స్థానంను దక్కించుకునేది ఎవురు, సూపర్‌ స్టార్‌ లెగస్సీని కంటిన్యూ చేసేది ఎవరు అంటూ గత కొన్ని రోజులుగా ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఈ సమయంలో శివ కార్తికేయన్‌ గురించిన చర్చ ఒకటి సాగుతోంది. విజయ్ గత చిత్రం ది గోట్‌ లో శివ కార్తికేయన్‌ చిన్న పాత్రలో కనిపించారు. ఆ పాత్ర చేయడం ద్వారా విజయ్ కి శివ కార్తికేయన్ ఎంతటి ఆప్తుడో క్లారిటీ వచ్చింది. అందుకే విజయ్ తన లెగసీని శివ కార్తికేయన్‌ తో కంటిన్యూ చేసే ఆలోచనలో ఉన్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది.

శివ కార్తికేయన్‌ తాజాగా 'అమరన్‌' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సాయి పల్లవి హీరోయిన్‌గా రూపొందిన అమరన్‌ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అన్ని భాషల్లోనూ బ్రేక్ ఈవెన్‌ వసూళ్లు సొంతం చేసుకుంది. సినిమా సక్సెస్ నేపథ్యంలో శివ కార్తికేయన్‌ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ విజయ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ సమయంలోనే మీరు విజయ్‌ గారి సినిమా లెగసీని కంటిన్యూ చేయబోతున్నారా అంటూ ప్రశ్నించిన సమయంలో శివ కార్తికేయన్‌ స్పందిస్తూ అది సాధ్యం అయ్యేది కాదని, ఆ లెగసీని ఎవరూ కంటిన్యూ చేయడం సాధ్యం కాదని పేర్కొన్నారు.

ఆ ఇంటర్వ్యూలో శివ కార్తికేయన్‌ మాట్లాడుతూ... విజయ్ సర్ గొప్ప నటుడు. ఆయన 30 ఏళ్ల సినీ కెరీర్‌ లో ఎన్నో ఎత్తు పల్లాలను చూశారు. ఆయన ఈ స్థాయికి రావడం అంత ఈజీగా జరగలేదు. ఎంతగానో పోరాటం చేసి ఆయన ఈ స్థాయికి చేరుకున్నారు. ఆయనతో కలిసి నటించడం గొప్ప అనుభవం. ఆయన సినిమాలు చూసి స్ఫూర్తి పొంది ఇండస్ట్రీలో అడుగు పెట్టిన నేను ఆయన లెగసీని కంటిన్యూ చేయడం అనేది సాధ్యం కాని విషయం అన్నాడు. ఆయన కంటూ సొంతంగా లెగసీ ఉంది. ఆయన గొప్పతనం, ఆయన స్టార్‌డంను మ్యాచ్ చేయడం అంత సులభమైన విషయం కానే కాదని శివ కార్తికేయన్‌ అన్నారు.

విజయ్ హీరోగా నటించిన ది గోట్‌ సినిమాలో ఒక సన్నివేశంలో విజయ్ తన బాధ్యతలను శివ కార్తికేయన్‌ కి అప్పగిస్తున్నట్లుగా చూపించారు. అందుకే విజయ్ తదుపరి ఆయన లెగసీని శివ కార్తికేయన్‌ కంటిన్యూ చేస్తారు అంటూ ఫ్యాన్స్‌ తో పాటు చాలా మంది ఆ సన్నివేశం ఆధారంగా ప్రచారం చేయడం మొదలు పెట్టారు. అయితే శివ కార్తికేయన్ మాత్రం అది సినిమా సన్నివేశం వరకు మాత్రమే, విజయ్ సర్‌ లెగసీ కంటిన్యూ చేయడం అనేది చిన్న విషయం కాదని, అది సాధ్యం అయ్యేది కానే కాదు అంటూ ఇంటర్వ్యూలో బదులు ఇచ్చారు. విజయ్‌ ఫ్యాన్స్ ఇప్పుడు మొత్తం శివ కార్తికేయన్‌ వైపు మొగ్గు చూపుతున్నారని, అందుకే అమరన్‌ సినిమాకు మంచి వసూళ్లు వచ్చాయి అంటూ తమిళ మీడియా వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

Tags:    
  • Kollywood 
  • Tollywood 
  • Filmindustry 
  • Thegoat 
  • Vijaythalapathy 
  • Amaran 
  • Sivakarthikeyan 
  • Comments 
  • Interview 
  • Legacy 

Similar News

విజయేంద్ర ప్రసాద్.. ఏం చేస్తున్నారు?

2026-11-04 01:30 GMT

ఆప‌రేష‌న్ సింధూర్‌పై పాన్ ఇండియ‌న్ సినిమా.. యువ‌హీరో జాక్‌పాట్!

2026-11-04 00:30 GMT

డిసెంబర్‌లో తెలుగు సినిమాలకు హాలీవుడ్ టెన్షన్!

2026-11-03 23:30 GMT

హాలీవుడ్‌లో ఆర్నాల్డ్- కోలీవుడ్‌లో మ్యాడీ ఇద్ద‌రిదీ ఒకటే బాట‌!

2026-11-03 22:30 GMT

పాన్ ఇండియా సినిమాలకు.. ప్రస్తుత కాలం పనికిరాదా?

2026-11-03 19:30 GMT

ఆ అలవాటే 50 ఏళ్లలో కూడా వచ్చింది..జయసుధ కామెంట్స్ వైరల్

2026-11-03 18:30 GMT

Bigg Boss Telugu 10: ఈ వారం ఎలిమినేట్ అవ్వబోయేది వర్షిణినా?

2026-11-03 18:23 GMT

Bigg Boss Telugu 10: ముకేశ్ హీరో అవుతాడా, లేక జీరో అవుతాడా?

2026-11-03 18:23 GMT

వారణాసి: RRR కంటే 40 రోజులు తక్కువ!

2026-11-03 18:18 GMT

పాన్ ఇండియాను దాటి పాన్ వరల్డ్‌కు.. అన్ని భాషల స్టార్ట్స్ తో కలిసి రాజమౌళి సినిమా!

2026-11-03 18:16 GMT

రామాయ‌ణ (X) కింగ్: ప్రీరిలీజ్ బిజినెస్‌లో ఎవ‌రు ది బెస్ట్?

2026-11-03 18:10 GMT

న్యూజిలాండ్లో వెకేషన్ మోడ్‌లో నవదీప్‌ గ్యాంగ్ సందడి!

2026-11-03 18:09 GMT

Copyright @2026

Powered by Blink CMS