సుధామూర్తి రివ్యూతో పైకి లేచిన స్టార్ హీరో చిత్రం !
'దంగల్' ,' సీక్రెట్ సూపర్ స్టార్' లాంటి భారీ విజయాల తర్వాత అమీర్ ఖాన్ కు సరైన హిట్ పడలేదు.;
'దంగల్' ,' సీక్రెట్ సూపర్ స్టార్' లాంటి భారీ విజయాల తర్వాత అమీర్ ఖాన్ కు సరైన హిట్ పడలేదు. థగ్స్ ఆఫ్ హిందుస్తాన్`, `లాల్ సింగ్ చడ్డా` లాంటి చిత్రాలు భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన బాక్సా ఫీస్ వద్ద ఆశించిన ఫలితాలు సాధించలేదు. పైగా లాల్ సింగ్ చడ్డా సమయంలో బ్యాన్ వివాదాన్ని ఎదుర్కో వడం వసూళ్లపై తీవ్ర ప్రభావాన్ని చూపించింది. నిర్మాతగా పని చేసిన `లాపట్టా లేడీస్` కూడా సరిగ్గా ఆడలేదు.
దీంతో అమీర్ ఇమేజ్ పై కొంత ప్రభావం పడినట్లు కనిపించింది. ఈ నేపథ్యంలోనే 'తారే జమీన్ పర్` సినిమాకు సీక్వెల్ గా 'సితారే జమీన్ పర్' పట్టాలెక్కినా? మార్కెట్ లో పెద్దగా బజ్ కనిపించలేదు. ఈచిత్రాన్ని అమీర్ ఖాన్ సొంత నిర్మాణ సంస్థపైనే నిర్మించారు. పైగా ఈ చిత్రాన్ని థియేట్రికల్ రిలీజ్ అనంతరం పేపర్ వ్యూ ద్వారా నేరుగాయూట్యూబ్ లో రిలీజ్ అవుతుంది. థియేటర్ కు ప్రేక్షకుడు దూరమవుతున్న కారణంగా ఎలాంటి ఓటీటీ డీల్స్ చేసుకోకుండా నష్టాన్ని కూడా భరించారు.
ఆ రకంగా ఓటీటీ ప్రచారానికి కూడా దూరమైందీ సినిమా. ఈ సినిమా అన్ని పనులు పూర్తిచేసుకుని ఈనెల 20న రిలీజ్ అవుతుంది. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలు కొన్ని పెద్దగా బజ్ తీసుకురాలేదు. తాజాగా ప్రీమియర్ వీక్షించిన అనంతరం ఇన్పోసిస్ పౌండర్, పద్మ శ్రీ గ్రహీత, ఫిలాంతరపిస్ట్, లైఫ్ కోచ్ రాజ్యసభ ఎంపీ సుధామూర్తి రివ్యూతో ఒక్కసారిగా సినిమా రేంజ్ మారిపోయింది. `సితారే జమీన్ పర్` కనువిప్పు కలిగించే గొప్ప చిత్రంగా అభివర్ణించారు. సినిమా చూసొచ్చి ఆమె ఎంతో భావోద్వేగానికి గురయ్యారు.
`చాలా మంది మానసిక ఒత్తిళ్లను ఎదుర్కునే పిల్లలను అర్దం చేసుకోరు. వారి సున్నితమైన మనస్తత్వాన్ని అర్దం చేసుకుని ఎలా మద్దతివ్వాలో సినిమాలో గొప్పగా చూపించారు. ఇలాంటి పిల్లల మనసు స్వచ్ఛంగా ఉంటుంది. వాళ్లు ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు. ఎదుట వారు ఏదైనా సాధిస్తే వారితో పాటు వీళ్లు సంతో షిస్తారు. ఇలాంటి వారి నుంచి మనం జీవిత పాఠాలు నేర్చుకోవాలి. ఈ సినిమా సమాజంలో మార్పు తీసు కురాగలదు. దివ్యాంగ బాలలను తక్కువగా చూడకూడదు అనే గొప్ప సందేశాన్ని`చ్చారని తెలిపారు.