సితారకు నా కూతురికి మధ్య బాండింగ్ అదే!
ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తున్న సినిమా ఎస్ఎస్ఎంబి 29. ఈ సినిమాకి సంబంధించిన భారీ ఈవెంట్ నవంబర్ 15న రామోజీ ఫిలిం సిటీలో జరగనుంది.;
ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తున్న సినిమా ఎస్ఎస్ఎంబి 29. ఈ సినిమాకి సంబంధించిన భారీ ఈవెంట్ నవంబర్ 15న రామోజీ ఫిలిం సిటీలో జరగనుంది. ఈ ఈవెంట్ మీద సర్వత్రా ఆసక్తి నెలకొంది. అలానే ఈవెంట్ కి సంబంధించి పలు జాగ్రత్తలు తీసుకోవాలి అని రాజమౌళి కూడా స్వయంగా ఒక వీడియో బైట్ విడుదల చేశారు.
ఈ సినిమా నుంచి అప్డేట్స్ రావట్లేదు అని ఫ్యాన్స్ కంప్లీట్ నిరాశలో ఉండేవాళ్ళు. అయితే ఊహించని విధంగా ఇప్పుడు ఒకదాని తర్వాత ఒక అప్డేట్ ఇస్తూనే ఉన్నారు. ఈ సినిమా నుంచి మొదటగా పృథ్వీరాజ్ సుకుమారన్ కుంభ లుక్ విడుదల చేశారు. ఈ లుక్ పైన చాలా విమర్శలు కూడా వినిపించాయి. కొంతమంది మాత్రం రాజమౌళి ఒక పవర్ఫుల్ విలన్ ను సెట్ చేశాడు అని పాజిటివ్ కామెంట్స్ పెట్టారు. ఈ సినిమాలో ప్రియాంక చోప్రా నటిస్తున్న సంగతి తెలిసిందే. మందాకిని అనే పాత్రలో ప్రియాంక ఈ సినిమాలో నటిస్తోంది.
సితారతో నా కూతురు బాండింగ్
మహేష్ బాబు కూతురు సితార గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వకముందే ఇంస్టాగ్రామ్ లో చాలామంది ఫాలోవర్స్ ను సాధించుకుంది. అలానే బ్రాండ్ అంబాసిడర్ గా కూడా తను మంచి పేరు సాధించుకుంది.
అప్పుడప్పుడు కొన్ని ఈవెంట్స్ లో సితార కనిపిస్తూ ఉంటుంది. ప్రెస్ మీట్ లలో సితార మాట్లాడిన విధానానికి చాలామంది ఫిదా అయిపోయారు. తండ్రి మహేష్ బాబు లాగానే తనకి కూడా సేవా దృక్పథం ఎక్కువ.
మరోవైపు ప్రియాంక చోప్రా తన కుమార్తె మాల్తీ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు బయటపెట్టింది. మహేష్ బాబు – నమ్రత శిరోద్కర్ కుమార్తె సితారా తో ప్రియాంక చోప్రా కుమార్తె మాల్తీ కు ఏర్పడిన బంధాన్ని గురించి చెప్పింది.
రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూలో, మీరు మాల్తీ ని షూటింగ్ కి తీసుకెళ్తారా అని అడగగా, నేను తీసుకెళ్తాను హైదరాబాద్ మాల్తికి ఫేవరెట్ స్టాప్ అయిపోయింది అని చెప్పింది ప్రియాంక. అంతేకాకుండా తను మహేష్ బాబు కూతురు సితారతో అద్భుతమైన సమయాన్ని గడిపింది అంటూ చెప్పుకొచ్చింది.
ఆకట్టుకున్న మందాకిని
ప్రియాంక చోప్రా మందాకిని అనే పాత్రలో కనిపిస్తున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన లుక్ నిన్ననే విడుదల చేశారు. ఈ లుక్ లో పసుపు కలర్ శారీ కట్టుకొని గన్ ఫైర్ చేస్తూ ఉంటుంది. ఈ లుక్ చూసిన వెంటనే డ్రెస్సెస్ ను రాజమౌళి ఒక స్టైలిష్ జేమ్స్ బాండ్ రోల్ ప్రియాంక చోప్రా కోసం క్రియేట్ చేశారు అనే ఫీలింగ్ వచ్చింది.
అయితే అప్డేట్స్ లేవు అనుకుంటున్న తరుణంలో ఎవరు ఊహించని విధంగా సడన్గా ఒక్కొక్క పోస్టర్ ను వదలడం అనేది ఆసక్తిని రేకెత్తించింది. ఈ సినిమాకి సంబంధించిన ఈవెంట్లో సినిమా కథ గురించి రాజమౌళి ఏమైనా రివీల్ చేస్తాడేమో అని చాలామంది ఆతృతగా ఎదురుచూస్తున్నారు.