94 ఏళ్ల సింగీతం.. అసలు అలా ఎలా ఆలోచించారో..
అయాన్, అహల్య, శాలిని కొండేపూడి లీడ్ రోల్స్ పోషించిన ఆ సినిమాపై మొదటి నుంచే ఆసక్తి నెలకొంది. అందుకు ప్రధాన కారణం సింగీతం శ్రీనివాసరావు.
సినీ ఇండస్ట్రీలో ప్రయోగాలు కొత్తేమీ కాదు. కానీ కొన్ని ప్రయోగాలు జెనరేషన్లు మారినా గుర్తుండిపోతాయి. అలాంటి అరుదైన ప్రయత్నమే సింగ్ గీతం మూవీ. 94 ఏళ్ల వయసులోనూ దర్శక దిగ్గజం సింగీతం శ్రీనివాసరావు క్రియేటివిటీ ఇప్పుడు సినీ ప్రియులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. వైజయంతి మూవీస్, స్వప్న సినిమాస్ బ్యానర్లపై నాగ్ అశ్విన్ నిర్మించిన ఆ చిత్రం జూన్ 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
అయాన్, అహల్య, శాలిని కొండేపూడి లీడ్ రోల్స్ పోషించిన ఆ సినిమాపై మొదటి నుంచే ఆసక్తి నెలకొంది. అందుకు ప్రధాన కారణం సింగీతం శ్రీనివాసరావు. ఈ వయసులోనూ కొత్త ఆలోచనతో ప్రేక్షకులను పలకరించాలనే ఆయన కోరిక అందరినీ ఆకట్టుకుంది. సాధారణంగా సినిమాల్లో కథను కన్వర్జేషన్ ద్వారా ముందుకు తీసుకెళ్తారు. కానీ సింగ్ గీతంలో అదే సంప్రదాయాన్ని పూర్తిగా పక్కన పెట్టారు. పాత్రలు మాట్లాడుకోవడం కంటే ఎక్కువగా పాడుకుంటూ తమ ఫీలింగ్స్ ను వ్యక్తపరుస్తాయి.
కథ, ఎమోషన్స్, రోల్స్ మధ్య కన్వర్జేషన్లు అన్నీ పాటల రూపంలో ప్రేక్షకుల ముందుకు వస్తాయి. అలా మ్యూజికల్ ఫాంటసీని సింగీతం ఎంతో వినూత్నంగా చూపించారు. సినిమా చూస్తున్నంతసేపు కొన్ని సన్నివేశాలు ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తాయి. "ఈ వయసులో కూడా ఇలా ఆలోచించడం ఎలా సాధ్యమైంది?" అనే ప్రశ్న నేచురల్ గానే కలుగుతుంది. రెగ్యులర్ కథను కూడా తనదైన శైలిలో కొత్తగా చెప్పే ప్రయత్నం చేశారు సింగీతం.
ఆయన రైటింగ్ లో కనిపించే సింప్లిసిటీ, మెసేజెస్ ప్రేక్షకులను ఆలోచింపజేస్తాయి. అదే సమయంలో సినిమాకు మరో ప్రధాన బలం దేవిశ్రీ ప్రసాద్ సంగీతం. మూవీలో ఎక్కువ భాగం పాటల ద్వారా సాగడంతో సంగీత దర్శకుడిపై భారీ బాధ్యత పడింది. ప్రతి రోల్ ఎమోషన్ కు తగ్గట్టుగా సంగీతాన్ని అందించడం, డైలాగ్స్ పాటల రూపంలో వినిపించడం చిన్న విషయం కాదు. ఆ కష్టాన్ని దేవిశ్రీ సక్సెస్ ఫుల్ గా మోసినట్లు అనిపిస్తుంది.
సింగీతం శ్రీనివాసరావు కథ, ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసి, నాగ్ అశ్విన్ కు బాధ్యతలు అప్పగించినట్లు మూవీ టీమ్ ఇప్పటికే తెలిపింది. వీడియో కాల్స్ ద్వారా పర్యవేక్షిస్తూ తన విజన్ ను సిల్వర్ స్క్రీన్ పై చూపించేలా గైడ్ చేశారని చెప్పింది. ఆ ఎఫెక్ట్ క్లియర్ గా కనిపిస్తుంది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా సినిమాకు మరింత బలం చేకూర్చాయి. ఏదేమైనా సింగ్ గీతం కేవలం ఓ సినిమా కాదు. మ్యూజికల్ కామెడీ తరహాలో చెప్పిన వినూత్న ప్రయత్నం.
ఫ్యామిలీతో, ముఖ్యంగా పిల్లలతో కలిసి చూసేలా రూపొందిన ఆ చిత్రం కొత్త ఎక్స్పీరియన్స్ అందిస్తుంది. ప్రయోగాత్మక సినిమాలను ఇష్టపడే వారికి, మ్యూజిక్ లవర్స్ కు ఇది తప్పక చూడాల్సిన సినిమా. ముఖ్యంగా 94 ఏళ్ల వయసులోనూ క్రియేటివిటీకి వయసు అడ్డు కాదని సింగీతం శ్రీనివాసరావు మరోసారి ప్రూవ్ చేసిన తీరు ఇన్స్పిరేషన్ గా నిలుస్తుంది. మూవీ అయ్యాక ఆడియన్స్ లో మనసులో నిలిచిపోయింది కథ కాకుండా ఆయన ఆలోచన అనే చెప్పాలి. అదే సింగ్ గీతం స్పెషాలిటీ.