శింబుని కమల్ హాసన్ కి రీప్లేస్ అన్నారా?
అలాంటి లెజెండ్ కే నేను రీప్లేస్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు శింబు. చెన్నైలో జరిగిన 'థగ్ లైఫ్' ఆడియో రిలీజ్ సందర్భంగా శింబు ఈ వ్యాఖ్యలు చేసాడు.;
విశ్వనటుడు కమల్ హాసన్ భారతీయ చలన చిత్ర పరిశ్రమలో ఓ లెజెండ్. నటుడిగా వెండి తెరపై ఆయన చేయని ప్రయోగం లేదు. వైవిథ్యమైన పాత్రలకు పెట్టింది పేరు. ఎలాంటి పాత్రలోనైనా పరకాయ ప్రవేశం చేయగల నటుడు. పాత్రకే వన్నే తేగల నటుడు. నటుడిగా ఆరు దశాబ్దాల చరిత్ర సొంతం. దేశం గర్వించదగ్గ నటుడు. చలన చిత్ర రంగంలో ఆయనో ఎన్ సైక్లోపీడియా. ఆయన స్పూర్తితో ఎంతో మంది నటనా రంగంలో స్థిరపడ్డారు.
అలాంటి లెజెండ్ కే నేను రీప్లేస్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు శింబు. చెన్నైలో జరిగిన 'థగ్ లైఫ్' ఆడియో రిలీజ్ సందర్భంగా శింబు ఈ వ్యాఖ్యలు చేసాడు. చిత్ర రంగంలో శింబు కు ఎదురైన చేదు అనుభవాలు గుర్తు చేసుకుంటోన్న క్రమంలో తన ప్రతిభ గురించి తానే చెప్పుకున్నాడు. 'నటుడిగా నాలో స్పూర్తి ని నింపింది కమల్ హాసన్. చిన్న నాటి నుంచి ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను.
నటుడిగా నన్ను నేను మలుచుకున్నాను. నాకే కాదు నాలాంటి ఎందరికో ఆయన స్పూర్తి. నేను వరుసగా సినిమాలు చేస్తున్నప్పుడు కమల్ హాసన్ ని రీప్లేస్ చేసే నటుడు వచ్చాడంటూ చాలా మంది కామెంట్లు చేసారు. నిజానికి ఆయన్ని ఎవరూ రీప్లేస్ చేయరు. నా దృష్టిలో ఆయనో గొప్ప నాయకుడుగా కీర్తించాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. కమల్ హాసన్ రీప్లేస్ చేసాడన్న మాట మాత్రం విశ్వ నటుడి అభిమానులకు మింగుడు పడనివ్వడం లేదు.
దీనికి సంబంధించి సోషల్ మీడియాలో రకరకాల కామెంట్లు వైరల్ అవుతున్నాయి. అంతా బాగానే ఉంది. కానీ రీప్లేస్ మెంట్ అన్నదే కష్టంగా ఉంది శింబు అంటూ పోస్టులు పెడుతున్నారు. 'థగ్ లైఫ్' లో శింబు అమరన్ అనే పాత్ర పోషిస్తున్నాడు. కమల్ పాత్రకు ధీటుగా ఉంటుందీ రోల్. ఈ చిత్రాన్ని జూన్ లో రిలీజ్ చేస్తోన్న సంగతి తెలిసిందే.