కమెడియన్స్ బిగ్ బాస్ టైటిల్ కి అర్హులు కారా..?
బిగ్ బాస్ రియాలిటీ షోలో ఎంటర్టైనర్స్ గా షోలో ఉన్నంతవరకు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటున్న స్మాల్ స్క్రీన్ కమెడియన్స్ టైటిల్ రేసుకి వచ్చే సరికి ఆమడ దూరం వెళ్తున్నారు.;
బిగ్ బాస్ రియాలిటీ షోలో ఎంటర్టైనర్స్ గా షోలో ఉన్నంతవరకు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటున్న స్మాల్ స్క్రీన్ కమెడియన్స్ టైటిల్ రేసుకి వచ్చే సరికి ఆమడ దూరం వెళ్తున్నారు. జబర్దస్త్ ఇంకా ఇతర ఫ్లాట్ ఫార్మ్ ల నుంచి వచ్చిన కమెడియన్స్ ని బిగ్ బాస్ ప్రతి సీజన్ లో ఒకరిని తీసుకుంటున్నాడు. వాళ్లు కూడా వాళ్ల కామెడీ టైమింగ్ తో మిగతా కంటెస్టెంట్స్ సపోర్ట్ తో హౌస్ లో అదరగొట్టేస్తున్నారు. ఐతే స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ఉన్న వాళ్లు టైటిల్ ని మాత్రం గెలవలేకపోతున్నారు. దానికి కారణం కమెడియన్స్ ని కేవలం కమెడియన్స్ గా చూడటమే అనిపిస్తుంది.
సీజన్ 4లో అవినాష..
బిగ్ బాస్ షోలో సీజన్ 4లో అవినాష్ కూడా ఆకట్టుకున్నాడు. అతను కనీసం టాప్ 5కి కూడా ఛాన్స్ లేకుండా చేశారు. అతన్ని మళ్లీ సీజన్ 8లో వైల్డ్ కార్డ్ గా తీసుకొచ్చారు కానీ అతను అప్పుడు కూడా టైటిల్ విన్నర్ కాలేకపోయాడు. ఇక బిగ్ బాస్ సీజన్ 9 విషయానికి వస్తే ఈ సీజన్ లో ఇమ్మాన్యుయెల్ హౌస్ మెట్స్ ని ఎంటర్టైన్ చేయడమే కాకుండా టాస్క్ లల్లో అదరగొట్టాడు. ఇమ్మాన్యుయెల్ టాస్క్ ఆడితే కచ్చితంగా గెలవాల్సిందే అనేలా చేశాడు.
సీజన్ 9 మధ్యలో ఇమ్మాన్యుయెల్ విన్నర్ మెటీరియల్ గా క్రేజ్ తెచ్చుకున్నాడు. కానీ చివరకు సీజన్ ఎండింగ్ కి వచ్చే సరికి అతను జస్ట్ టాప్ 4 కంటెస్టెంట్ గా మిగిలిపోయాడు. ఇమ్మాన్యుయెల్ ఈ సీజన్ లో కేవలం కమెడియన్ గానే కాదు ఆల్ రౌండర్ ప్రదర్శన చేశాడు. ఒక కంటెస్టెంట్ ఇంతకన్నా ఏమి చేయలేడు అన్నట్టుగా చేశాడు. మధ్యలో ప్రతి హౌస్ మేట్ కి ఉన్నట్టుగా కొన్ని అప్ అండ్ డౌన్స్ ఉన్నా ఇమ్మాన్యుయెల్ టాప్ 2 పక్కా అనుకున్నారు. ఒకదశలో అసలు సీజన్ విన్నర్ అయిన కళ్యాణ్ టాప్ లో లేడు టైటిల్ ఫైట్ తనూజ, ఇమ్మాన్యుయెల్ మధ్యలోనే అనుకున్నారు.
ఇమ్మాన్యుయెల్ ఆల్ రౌండర్ ప్రదర్శన..
కానీ సీన్ మొత్తం తారుమారైంది. ఐతే కేవలం కమెడియన్ కాబట్టే ఇమ్మాన్యుయెల్ ని టైటిల్ విన్నర్ ని చేయలేదు కమెడియన్ అవ్వడం అతని దురదృష్టం అని కొందరు ఇమ్మాన్యుయెల్ ఫ్యాన్స్ అంటున్నారు. ఒకవిధంగా చెప్పాలంటే ఈ సీజన్ లో ఇమ్మాన్యుయెల్ చూపించిన ఆల్ రౌండర్ ప్రదర్శన నిజంగానే సీజన్ విన్నర్ అయ్యేంత స్టఫ్ అనిపించింది. కానీ ఎందుకో ఓటింగ్ లో వెనకపడ్డాడు. తనూజతో తనే టాప్ 2లో ఉంటానన్న కాన్ఫిడెన్స్ ఇమ్మాన్యుయెల్ కి ఉంది. కానీ మధ్యలో కళ్యాణ్ తనకు గట్టి పోటీ అయ్యాడు.
ఫైనల్ గా డీమాన్ పవన్ కూడా ఇమ్మాన్యుయెల్ ని క్రాస్ చేసి టాప్ 3కి వెళ్లాడు. సో కమెడియన్ అవ్వబట్టే ఇమ్మాన్యుయెల్ ని ఆడియన్స్ టైటిల్ విన్నర్ గా యాక్సెప్ట్ చేయలేకపోయారన్న ఇమ్మాన్యుయెల్ ఫ్యాన్స్ కామెంట్స్ ఒక వైపు వస్తున్నా.. ఆడియన్స్ ఫైనల్ డెసిషన్ అది అయినప్పుడు ఎవరు ఏమి చేయలేరు. సో ఇమ్మాన్యుయెల్ వల్ల కూడా టైటిల్ విన్నర్ అవ్వడం కుదరలేదు మరి మరో కమెడియన్ ఎవరైనా వచ్చి బిగ్ బాస్ ట్రోఫీ లిఫ్ట్ చేస్తాడా.. ఫ్యూచర్ లో అయినా అది జరుగుతుందా అని డిస్కషన్ చేస్తున్నారు.