ఛాంపియన్ నుంచి సరైన పార్టీ సాంగ్.. రోషన్ చించేశాడుగా!

టాలీవుడ్ సీనియర్ హీరో శ్రీకాంత్ కొడుకు రోషన్ మేక.. ఇప్పుడు ఛాంపియన్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే.;

Update: 2025-12-22 05:09 GMT

టాలీవుడ్ సీనియర్ హీరో శ్రీకాంత్ కొడుకు రోషన్ మేక.. ఇప్పుడు ఛాంపియన్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమాను జీ స్టూడియోస్ సమర్పణ లో ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిల్మ్స్‌ తో కలిసి స్వప్న దత్ నిర్మిస్తున్నారు.




సినిమాలో రోషన్ సరసన అనస్వర రాజన్ హీరోయిన్ గా నటిస్తుండగా.. మరికొద్ది రోజుల్లో సినిమా విడుదల అవ్వనుంది. డిసెంబర్ 25వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఇప్పటికే సినిమా నుంచి రిలీజైన సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. మూవీపై ఆడియన్స్ లో మంచి బజ్ కూడా క్రియేట్ చేశాయి.

రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో సినిమాలోని లిరికల్ సాంగ్స్ ను వరుసగా రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. ఛాంపియన్ నుంచి ఇప్పటివరకు విడుదలైన గిర గిర సాంగ్ అన్ని సోషల్ మీడియాలో ప్లాట్‌ ఫామ్స్ లో ఫుల్ ట్రెండింగ్ లో ఉంది. మనసును కదిలించే సెకండ్ సింగిల్ సల్లంగుడాలే కూడా అద్భుతమైన స్పందన అందుకుంటోంది.

తాజాగా మూడో సాంగ్ ను మేకర్స్ విడుదల చేశారు. ఐ యామ్ ఆ ఛాంపియన్ అంటూ సాగే సాంగ్ ను స్టార్ హీరోయిన్ సమంతతో రిలీజ్ చేయించారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుల్ చక్కర్లు కొడుతున్న ఆ సాంగ్ లో 1948 బ్యాక్ డ్రాప్ లో డ్యాన్స్ ను చూపించారు. రాక్ అండ్ రోల్ అంటూ రోషన్ అదరగొట్టేశారని చెప్పాలి.

బ్రహ్మోత్సవం సినిమాలో బాలనటిగా మెప్పించి.. హాలీవుడ్ లో హీరోయిన్ గా మెరిసిన తెలుగమ్మాయి అవంతిక.. రోషన్ తో కలిసి స్టెప్పులు వేశారు. నిజానికి ఇప్పటి డ్యాన్స్ ఎవరైనా చేయగలుగుతారు. కానీ, అప్పట్లో డ్యాన్స్ ను అంత గ్రేస్ గా ఆడిపాడడం అన్నది మామూలు విషయం కాదు. రోషన్, అవంతిక ఇద్దరూ చించేశారు.

రోషన్ లో ఆ గ్రేస్.. ఎనర్జీ నెక్స్ట్ లెవెల్ అని నెటిజన్లు, సినీ ప్రియులు కామెంట్లు పెడుతున్నారు. ఆ లుక్ కూడా చాలా అద్భుతంగా ఉందని అంటున్నారు. ఇక.. ముఖ్యంగా సాంగ్ గురించి చెప్పాలంటే మ్యూజిక్ అదిరిపోయింది. మిక్కీ జే మేయర్ సూపర్ గా కంపోజ్ చేశారు. ఫ్రెష్ మ్యూజిక్ ఇచ్చారు. కేకే లిరిక్స్ చాలా క్యాచీగా ఉన్నాయని చెప్పాలి.

పి. జయరామ్, రమ్య బెహరా తమ ఎనర్జిటిక్ వోకల్స్‌ తో ఉత్సాహాన్ని రెట్టింపు చేశారు. పోనీ వర్మ కొరియోగ్రఫీ పాటకు ప్రధాన హైలైట్‌ గా నిలుస్తూ.. స్టైలిష్ హుక్ స్టెప్‌ తో పాటు డైనమిక్ డాన్స్ మూవ్స్‌ తో సాంగ్ ను మరో లెవల్‌ కు తీసూకెళ్లారు. ఏదేమైనా.. ఛాంపియన్ మూవీ నుంచి వచ్చిన మూడో సింగిల్.. ప్రత్యేకమైన, పూర్తి స్థాయి డాన్స్ నంబర్‌ గా అలరించింది. ఓవరాల్ గా ఐ యామ్ ఆ ఛాంపియన్ సరైన పార్టీ సాంగ్ అనే చెప్పాలి.


Full View


Tags:    

Similar News