సైమా2025 అవార్డుల విజేత‌లు వీళ్లే

దుబాయ్ లో సౌత్ ఇండియ‌న్ ఇంట‌ర్నేష‌న‌ల్ మూవీ అవార్డ్స్(సైమా)2025 వేడుక ఘ‌నంగా మొద‌లైంది. ద‌క్ష‌ణాదిలో ఈ అవార్డుల‌కు ఎంతో ప్ర‌తిష్టాత్మ‌క గుర్తింపు ఉంది.;

Update: 2025-09-06 05:00 GMT

దుబాయ్ లో సౌత్ ఇండియ‌న్ ఇంట‌ర్నేష‌న‌ల్ మూవీ అవార్డ్స్(సైమా)2025 వేడుక ఘ‌నంగా మొద‌లైంది. ద‌క్ష‌ణాదిలో ఈ అవార్డుల‌కు ఎంతో ప్ర‌తిష్టాత్మ‌క గుర్తింపు ఉంది. ప్ర‌తీ ఏటా సౌత్ సినీ ఇండ‌స్ట్రీకి చెందిన సినిమాలు, న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల‌ను టాలెంట్ ను గుర్తింపు వారిని అవార్డుల‌తో స‌త్క‌రిస్తూ ఉంటుంది సైమా. ప్ర‌తీ ఏడాది లానే ఈ ఏడాది కూడా సైమా అవార్డుల కార్య‌క్ర‌మం జ‌రుగుతుండ‌గా మొద‌టి రోజు క‌న్న‌డ‌, తెలుగు సినిమాల‌తో ఆడియ‌న్స్ ను ఆక‌ట్టుకున్న న‌టీనటులు, సాంకేతిక నిపుణులు అవార్డులు అందుకున్నారు.

2024లో సెన్సార్ అయిన సినిమాల‌కు సంబంధించిన అవార్డ్స్ విన్న‌ర్ల లిస్ట్ ను సైమా తాజాగా రిలీజ్ చేయ‌గా అందులో క‌ల్కి2898ఏడీ, పుష్ప2 సినిమాల‌కు ఎక్కువ అవార్డులు వ‌రించాయి. సైమా అవార్డుల 13వ ఎడిష‌న్ లో తెలుగులో ఎక్కువ‌గా పుష్ప‌2 నాలుగు అవార్డులు గెలుచుకోగా క‌ల్కి సినిమాకు కూడా ఎక్కువ అవార్డులే ద‌క్కాయి. మ‌రి ఈ సారి ఏ కేట‌గిరీలో ఎవ‌రికి అవార్డులు ద‌క్కాయో చూద్దాం.

పుష్ప‌2 సినిమాకు అవార్డుల పంట‌

ఉత్త‌మ న‌టుడిగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అవార్డు ద‌క్కించుకోగా, ఉత్త‌మ న‌టిగా ర‌ష్మిక మంద‌న్నా, ఉత్త‌మ ద‌ర్శ‌కుడిగా సుకుమార్, ఉత్తమ సంగీత ద‌ర్శ‌కుడిగా దేవీ శ్రీ ప్ర‌సాద్ అవార్డులు ద‌క్కించుకోవ‌డంతో పుష్ప‌2కు ఈ ఏడాది సైమాలో మొత్తం నాలుగు అవార్డులు ద‌క్కిన‌ట్లైంది.

బెస్ట్ ఫిల్మ్ గా క‌ల్కి

ఉత్త‌మ చిత్రంగా అవార్డు ద‌క్కించుకున్న క‌ల్కి, ఉత్త‌మ స‌హాయ న‌టుడు కేట‌గిరీలో అమితాబ్ బ‌చ్చ‌న్ కు మ‌రో అవార్డు ద‌క్కింది. ఉత్త‌మ స‌హాయన‌టిగా అన్నా బెన్, ఉత్త‌మ విల‌న్ గా క‌మ‌ల్ హాస‌న్ కు అవార్డులు వ‌రించాయి.

సైమా2025 విజేత‌లు వీరే..

ఉత్త‌మ చిత్రం: క‌ల్కి2898ఏడీ

ఉత్త‌మ డైరెక్ట‌ర్: సుకుమార్ (పుష్ప‌2)

ఉత్త‌మ డైరెక్ట‌ర్(క్రిటిక్స్‌): ప్ర‌శాంత్ వ‌ర్మ (హ‌ను మాన్)

ఉత్త‌మ న‌టుడు: అల్లు అర్జున్ (పుష్ప‌2)

ఉత్త‌మ న‌టి: ర‌ష్మిక మంద‌న్నా (పుష్ప‌2)

ఉత్త‌మ న‌టుడు(క్రిటిక్స్): తేజా స‌జ్జ (హ‌ను మాన్)

ఉత్త‌మ న‌టి(క్రిటిక్స్): మీనాక్షి చౌద‌రి (ల‌క్కీ భాస్క‌ర్)

ఉత్త‌మ స‌హాయ‌న‌టుడు: అమితాబ్ బ‌చ్చ‌న్ (క‌ల్కి)

ఉత్తమ స‌హాయ‌న‌టి: అన్నా బెన్ (క‌ల్కి)

ఉత్త‌మ నూత‌న న‌టి: భాగ్యశ్రీ బోర్సే (మిస్ట‌ర్ బ‌చ్చ‌న్)

ఉత్త‌మ సంగీత ద‌ర్శ‌కుడు: దేవీ శ్రీ ప్ర‌సాద్ (పుష్ప‌2)

ఉత్త‌మ గేయ ర‌చ‌యిత‌: రామ‌జోగ‌య్య శాస్త్రి (దేవ‌ర‌- చుట్ట‌మ‌ల్లే)

ఉత్త‌మ ప్లే బ్యాక్ సింగ‌ర్: శిల్పా రావ్ (దేవ‌ర‌- చుట్ట‌మ‌ల్లే)

ఉత్త‌మ గాయ‌కుడు: శంకర్ బాబు కందుకూరి (పుష్ప‌2-పీలింగ్స్)

ఉత్త‌మ విల‌న్: క‌మ‌ల్ హాస‌న్ (క‌ల్కి)

ఉత్త‌మ సినిమాటోగ్రాఫ‌ర్: ర‌త్న‌వేలు (దేవ‌ర‌)

ఉత్త‌మ హాస్య‌న‌టుడు: స‌త్య (మ‌త్తు వ‌ద‌ల‌రా2)

ఉత్త‌మ నూత‌న నిర్మాత‌: నిహారిక కొణిదెల (క‌మిటీ కుర్రోళ్లు)

ఉత్త‌మ నూత‌న న‌టుడు: సందీప్ స‌రోజ్ (క‌మిటీ కుర్రోళ్లు)

ఉత్త‌మ నూత‌న ద‌ర్శ‌కుడు: నంద‌కిషోర్ ఇమాని (35 చిన్న కథ కాదు)

ప్రైడ్ ఆఫ్ తెలుగు సినిమా: అశ్వినీద‌త్ (వైజ‌యంతీ మూవీస్ 50 ఏళ్లు పూర్తి చేసుకున్నందుకు)

Tags:    

Similar News