• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  DJ టిల్లుతో నితిన్ మాస్...

DJ టిల్లుతో నితిన్ మాస్ రచ్చ

| నితిన్ నుంచి రాబోతున్న క్రేజీ మూవీ ఎక్స్ ట్రా ఆర్డినరి మ్యాన్. ఈ సినిమాపై నితిన్ ఐతే చాలా కాన్ఫిడెంట్ గా కనిపిస్తూ ఉన్నాడు

By - Tupaki Desk
Update: 2023-12-05 09:35 GMT

నితిన్ నుంచి రాబోతున్న క్రేజీ మూవీ ఎక్స్ ట్రా ఆర్డినరి మ్యాన్. ఈ సినిమాపై నితిన్ ఐతే చాలా కాన్ఫిడెంట్ గా కనిపిస్తూ ఉన్నాడు. వక్కంతం వంశీ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ట్రైలర్ కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేశాయి. అలాగే సాంగ్స్ తో కూడా మంచి హైప్ క్రియేట్ చేస్తున్నారు. ఇక నితిన్ ఎప్పటిలానే ప్రమోషన్స్ లో చాలా కాన్ఫిడెంట్ గా కూడా కనిపిస్తూ ఉన్నాడు.

రెగ్యులర్ గా కాకుండా ఆడియన్స్ ను ఆకట్టుకునే విధంగా విభిన్న తరహాలో ప్రమోషనల్ ఇంటర్వ్యూలు కూడా చేస్తూ ఉండడం విశేషం. ఇక ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమా కోసం నితిన్ డీజే టిల్లు ఫేమ్ సిద్దు జొన్నలగడ్డతో కలవడం కూడా వైరల్ అవుతుంది. ఇద్దరి కలయికలో ఒక ఇంటర్వ్యూ రాబోతోంది. ఇక స్పెషల్గా ఒక ప్రోమో కూడా విడుదల చేశారు. అందులో నితిన్ సిద్దు ఇద్దరు కూడా తెలంగాణ యాసలో లోకల్ బాయ్స్ తరహాలో మాట్లాడుకోవడం హైలైట్ గా నిలుస్తుంది.

ఇక డీజే టిల్లు క్యారెక్టర్తో పర్ఫెక్ట్ గా సిద్ధూ నితిన్ తో మాట్లాడుతూ ఉండడం కూడా ఎంతగానో ఎట్రాక్ట్ చేస్తోంది. ఈ సినిమాలో జూనియర్ ఆర్టిస్ట్ గా చేస్తున్నాను అని నితిన్ చెప్పగా ఇంత పెద్ద సినిమా నీ సొంత బ్యానర్ లో చేస్తూ నువ్వు జూనియర్ ఆర్టిస్ట్ గా చేయడం ఏమిటి అని సిద్దు చాలా ఫన్నీగా సెటైర్ వేశాడు. ఇక ఈ విధంగా ఇంటర్వ్యూలో చాలా సరదా డైలాగ్స్ కూడా ఉండబోతున్నట్లుగా అర్థమవుతుంది.

ఏది ఏమైనాప్పటికీ ఈ తరహాలో నేటితరం యువ హీరోలు చాలా స్నేహభావంతో కలిసి సినిమాలను ప్రమోట్ చేసుకుంటున్నారు. నితిన్ ఎక్స్ ట్రా సినిమా డిసెంబర్ 8వ తేదీన విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా లో సీనియర్ నటుడు రాజశేఖర్ కూడా ఒక ప్రత్యేకమైన పాత్రలో కనిపించనున్నాడు. తప్పకుండా ఈ సినిమాతో ఎలాగైనా సక్సెస్ అందుకొని ఇదే తరహాలో బిజీ అవ్వాలి అని రాజశేఖర్ కోరుకుంటున్నాడు.

ఇక దర్శకుడు వక్కంతం వంశీకి కూడా ఈ సినిమా సక్సెస్ కావడం చాలా ముఖ్యం. ఎందుకంటే అతను మొదటి డైరెక్ట్ చేసిన నా పేరు సూర్య డిజాస్టర్ అయిన విషయం తెలిసిందే. దీంతో ఈ సినిమా పైన అతను ఎక్కువ స్థాయిలో నమ్మకం పెట్టుకున్నాడు. మరి కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ ఫార్మాట్లో రాబోతున్న ఎక్స్ ట్రా ఇలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి.

Here's a promo of #ExtraOrdinaryMan x #Tillu seated for an #ExtraDJ Fun-filled laughter ride 🤩

Full video out today .❤️‍🔥#ExtraOrdinaryManOnDec8th@actor_nithiin #SiddhuJonnalagadda @ActorRajasekhar @sreeleela14 @vamsivakkantham @Jharrisjayaraj #SudhakarReddy #NikhithaReddy pic.twitter.com/HB8hZZC6XK

— Sreshth Movies (@SreshthMovies) December 5, 2023
Tags:    
  • Djtillu 
  • Extraordinaryman 
  • Nithiin 
  • Siddujonnalagadda 
  • Sreeleela 
  • Filmindustry 
  • Vakkanthamvamsi 

Similar News

ఆదిపురుష్, రామాయణం.. తేడా అక్కడే కనిపించింది!

2026-11-06 04:06 GMT

స్టార్ హీరో బిగ్ మిస్టేక్.. అందుకే ర‌చ‌యిత‌లు అల‌క‌బూనారా?

2026-11-06 03:57 GMT

సౌత్ సినిమాలో చ‌రిత్ర సృష్టించిన‌ టాప్ -4 సౌండ్ ఇంజినీర్లు

2026-11-06 03:56 GMT

'రాప్తాడు ఘటన'కు సినిమాలను నిందించడం సరికాదు!

2026-11-06 03:55 GMT

నేను అంత అందంగా లేను.. ఈ స్వ‌చ్ఛ‌తే సీత పాత్ర‌కు ఔచిత్యం!

2026-11-06 03:53 GMT

మేనల్లుడి ఎంగేజ్‌మెంట్‌కు పవన్ ఎందుకు రాలేదు?

2026-11-06 03:49 GMT

Bigg Boss Telugu 10: టాప్ వోటింగుతో దూసుకుపోతున్న ముఖేష్!

2026-11-06 03:47 GMT

Vijay Sethupathi: ఎంత గొప్పవారు మీరు..!

2026-11-06 01:49 GMT

బెబో స్పూర్తితో సైజ్ జీరోకి మారిన 'అర్జున్ రెడ్డి' బ్యూటీ

2026-11-06 01:46 GMT

తమిళ సినిమాలకు తెలుగులో తగ్గుతున్న క్రేజ్..!

2026-11-06 01:45 GMT

భార్య 10PM అల‌వాటుకు అగ్ర హీరోలో కంగారు!

2026-11-06 01:44 GMT

మరి ఇంతలా అవసరమా విజయ్, త్రిష..!

2026-11-06 01:43 GMT

Copyright @2026

Powered by Blink CMS