క్లాస్, మాస్ మధ్య ఇంట్రెస్టింగ్ ఫైట్..!

ఆడియన్స్ నచ్చే సినిమా అది క్లాసైనా, మాసైనా సరే సక్సెస్ అవుతుంది. ఇలాంటి సినిమాలే ప్రేక్షకులు చూస్తారన్న పాత పంథాకి ఎండ్ కార్డ్ పడింది;

Update: 2025-10-05 08:49 GMT

ఆడియన్స్ నచ్చే సినిమా అది క్లాసైనా, మాసైనా సరే సక్సెస్ అవుతుంది. ఇలాంటి సినిమాలే ప్రేక్షకులు చూస్తారన్న పాత పంథాకి ఎండ్ కార్డ్ పడింది. కొన్ని సినిమాలు రెగ్యులర్ రొటీన్ అనిపించినా ఆ టైంలో ఆడియన్స్ కి నచ్చితే సూపర్ హిట్ చేస్తారు. కొన్ని సినిమాలు డిఫరెంట్ కంటెంట్ తో వచ్చి సత్తా చాటుతాయి. ఐతే ఈసారి దివాళి కానుకగా ఒక మూడు రోజుల ముందే సినిమాల పండగ రాబోతుంది. ఆ వీకెండ్ ని టార్గెట్ చేసుకుని రెండు సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. అందులో ఒకటి క్లాస్ సినిమాగా వస్తుంటే.. మరొకటి మాస్ అటెంప్ట్ తో వస్తుంది.

సిద్ధు జొన్నలగడ్డ ట్రయాంగిల్ లవ్ స్టోరీ..

క్లాస్ సినిమా అంటే ఇద్దరు హీరోయిన్స్, ఒక హీరో ట్రయాంగిల్ లవ్ స్టోరీ. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా శ్రీనిధి శెట్టి, రాశి ఖన్నా హీరోయిన్స్ గా నటించారు. నీరజ కోన డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా సాంగ్స్, టీజర్ ఇంప్రెస్ చేశాయి. సినిమాతో సిద్ధు ఒక మంచి ఫీల్ గుడ్ సక్సెస్ అందుకుంటాడని అనిపిస్తుంది. ఈ సినిమాకు పోటీగా మరో సినిమా వస్తుంది. అది కూడా మాస్ అటెంప్ట్ తో వస్తుంది.

దీపావళికి మాస్ ఆడియన్స్ ని టార్గెట్ చేసుకుని వస్తున్న సినిమా కిరణ్ అబ్బవరం కె ర్యాంప్. ఈ సినిమా టైటిలే అదోలా ఉంది. ఆ టైటిల్ కి తగినట్టుగానే టీజర్, ట్రైలర్ లో యూత్ కి కావాల్సిన కంటెంట్ బాగుంది. ఐతే ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం మాస్ క్యారెక్టరైజేషన్ ఆడియన్స్ కు బాగా నచ్చేలా ఉంది. సో కిరణ్ కె ర్యాంప్ కూడా మంచి బజ్ తోనే వస్తుంది.

కె ర్యాంప్ మాస్ ఆడియన్స్ కి నచ్చే అంశాలతో..

కిరణ్ కె ర్యాంప్, సిద్ధు తెలుసు కదా ఈ రెండు సినిమాలు కూడా ఇంట్రెస్టింగ్ క్లాష్ కాబోతున్నాయి. రెండు డిఫరెంట్ స్టోరీ, స్క్రీన్ ప్లేతో వస్తున్నాయి కాబట్టి రెండు సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంది. కె ర్యాంప్ సినిమా కాస్త మాస్ ఆడియన్స్ కి నచ్చే అంశాలతో హీరోయిన్ తో లిప్ లాక్ సీన్స్ తో అదరగొట్టబోతుంది. తెలుసు కదా ఒక మంచి లవ్ స్టోరీగా వస్తుంది. ఈ సినిమా యూనిట్ ఎవరి సినిమా మీద వాళ్లు చాలా నమ్మకంతో ఉన్నారు. తెలుసు కదా సినిమా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించగా.. కె ర్యాంప్ సినిమా హాస్య మూవీస్ బ్యానర్ లో రాజేష్ దండ నిర్మించారు.

ఈ రెండు సినిమాలు యూత్ ఆడియన్స్ టార్గెట్ తోనే వస్తున్నాయి. జాక్ తర్వాత సిద్ధు, దిల్ రూబా తర్వాత కిరణ్ అబ్బవరం ఇద్దరు కంపల్సరీ హిట్ కొట్టాల్సిన పరిస్థితుల్లో రిలీజ్ అవుతున్న వారి సినిమాలు ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాయన్నది చూడాలి.

Tags:    

Similar News