• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సిద్ధు కూడా అంత డిమాండ్...

సిద్ధు కూడా అంత డిమాండ్ చేస్తున్నాడా..?

| ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుంది. సిద్ధు జొన్నలగడ్డ కొత్త సినిమా తెలుసు కదా కూడా సెట్స్ మీద ఉంది. దీనితో పాటు బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడు.

By - Tupaki Desk
Update: 2024-03-01 15:30 GMT

ప్రయత్న లోపం అంటూ లేకుండా చేస్తూ వెళ్తే ఎప్పుడో ఒకప్పుడు కచ్చితంగా మనదైన రోజు వస్తుందని పెద్దలు చెబుతుంటారు. సినీ పరిశ్రమలో ఇలాంటి వాటిని ఇంకాస్త ఎక్కువ నమ్ముతుంటారు. స్వయంకృషితో పైకి వచ్చే వారికి పరిశ్రమ ఎప్పుడు అండగా ఉంటుంది. వెలుగులోకి రావడం కాస్త లేట్ అవుతుందేమో కానీ వచ్చాక వారు ఆకాశమే హద్దు అనే రేంజ్ కి వెళ్తారని చెప్పొచ్చు. తెలుగు సినీ పరిశ్రమలో పరిచయం కూడా ఎవరు లేకుండానే అడుగు పెట్టే వారు చాలామంది ఉంటారు. అలాంటి వారిలో ఒకడే స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ.

ముందు సినిమాల్లో ఛాన్స్ ల కోసం చిన్న చిన్న పాత్రలు చేయగా ఆ తర్వాత లీడ్ రోల్ లో అవకాశాలు అందుకున్నాడు. అందరిలా చేస్తే తను ఎలా అనుకున్నాడు తనకు తానుగా కొత్త పంథా కొనసాగిస్తున్నాడు. అప్పట్లో గుంటూరు టాకీస్ తో పర్వాలేదు అనిపించుకున్న సిద్ధు జొన్నలగడ్డ ఆ తర్వాత ఒక టీం ని ఏర్పరచుకుని కృష్ణ అండ్ హిజ్ లీలా సినిమా చేశాడు. ఆ సినిమాలో తన పాత్ర ప్రేక్షకులకు బాగా నచ్చేసింది.

ఇక డీజే టిల్లుతో సిద్ధు చేసిన హంగామా అందరికీ తెలిసిందే. సిద్ధు జొన్నలగడ్డ రేంజ్ పెంచుతూ డీజే టిల్లు సెన్సేషనల్ హిట్ అయ్యింది. ఆ సినిమా సెన్సేషనల్ హిట్ అవ్వడంతో డీజే టిల్లు సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ ని చేశారు. మల్లిక్ రామ్ డైరెక్షన్ లో టిల్లు స్క్వేర్ మార్చి 29న రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుంది. సిద్ధు జొన్నలగడ్డ కొత్త సినిమా తెలుసు కదా కూడా సెట్స్ మీద ఉంది. దీనితో పాటు బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడు.

యూత్ లో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న సిద్ధు జొన్నలగడ్డ సినిమా సినిమాకు తన రేంజ్ పెంచుకుంటూ వెళ్తున్నాడు. మొన్నటిదాకా సినిమాకు 2 కోట్ల దాకా తీసుకున్న సిద్ధు ప్రస్తుతం సినిమాకు 5 కోట్ల దాకా కోట్ చేస్తున్నాడని తెలుస్తుంది. టిల్లు స్క్వేర్ హిట్ అయితే మాత్రం సిద్ధు తో సినిమా మినిమం గ్యారెంటీ హిట్ అనే టాక్ వచ్చేస్తుంది. దాంతో అతను అడిగినంత రెమ్యునరేషన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. మరి ఈ లేటెస్ట్ సెన్సేషన్ సిద్ధు జొన్నలగడ్డ ఫ్యూచర్ లో ఎలాంటి సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తుందో చూడాలి.

Tags:    
  • Tollywood 
  • Starboy 
  • Siddhujonnalagadda 
  • Tillusquare 
  • Remuneration 
  • Jack 
  • Telusukada 
  • Filmindustry 

Similar News

హాలీవుడ్‌లో ఆర్నాల్డ్- కోలీవుడ్‌లో మ్యాడీ ఇద్ద‌రిదీ ఒకటే బాట‌!

2026-11-03 22:30 GMT

పాన్ ఇండియా సినిమాలకు.. ప్రస్తుత కాలం పనికిరాదా?

2026-11-03 19:30 GMT

ఆ అలవాటే 50 ఏళ్లలో కూడా వచ్చింది..జయసుధ కామెంట్స్ వైరల్

2026-11-03 18:30 GMT

Bigg Boss Telugu 10: ఈ వారం ఎలిమినేట్ అవ్వబోయేది వర్షిణినా?

2026-11-03 18:23 GMT

Bigg Boss Telugu 10: ముకేశ్ హీరో అవుతాడా, లేక జీరో అవుతాడా?

2026-11-03 18:23 GMT

వారణాసి: RRR కంటే 40 రోజులు తక్కువ!

2026-11-03 18:18 GMT

పాన్ ఇండియాను దాటి పాన్ వరల్డ్‌కు.. అన్ని భాషల స్టార్ట్స్ తో కలిసి రాజమౌళి సినిమా!

2026-11-03 18:16 GMT

రామాయ‌ణ (X) కింగ్: ప్రీరిలీజ్ బిజినెస్‌లో ఎవ‌రు ది బెస్ట్?

2026-11-03 18:10 GMT

న్యూజిలాండ్లో వెకేషన్ మోడ్‌లో నవదీప్‌ గ్యాంగ్ సందడి!

2026-11-03 18:09 GMT

నవంబర్.. హిట్ కొట్టినా లాంగ్ రన్ కష్టమేనా..

2026-11-03 18:09 GMT

మహేష్.. అసలు 'గేమ్' ప్లాన్ ఏంటీ?

2026-11-03 18:07 GMT

పాకెట్ రాకెట్స్ టీజర్.. డబ్బు చుట్టూ ఓ కొత్త ఆట!

2026-11-03 18:01 GMT

Copyright @2026

Powered by Blink CMS