క్లైమాక్స్ షూటింగ్ ఆపేసిన రాశి ఖన్నా.. సిద్ధూ ఏమన్నారంటే?
అయితే ఈ సినిమా క్లైమాక్స్ లో రాశి ఖన్నా షూట్ చేయనని కోపంతో వెళ్లిపోయిందట. మరి అలా ఎందుకు చేసిందో సిద్దు జొన్నలగడ్డ చెప్పిన ఆ ఇంట్రెస్టింగ్ విషయాలు ఇప్పుడు చూద్దాం..;
రాశి ఖన్నా, సిద్దు జొన్నలగడ్డ, శ్రీనిధి శెట్టి ముగ్గురి కాంబోలో వస్తున్న తాజా మూవీ 'తెలుసు కదా'..ఈ సినిమా మరో మూడు రోజుల్లో విడుదలకు సిద్ధంగా ఉండడంతో తాజాగా తెలుసు కదా మూవీ ట్రైలర్ ని గ్రాండ్ గా రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. అయితే ఈ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ కి సంబంధించి ఓ ప్రెస్ మీట్ కూడా పెట్టారు. ఇందులో భాగంగా సిద్దు జొన్నలగడ్డ ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు.. అంతేకాదు ఈ సినిమాలో ఉండే ముద్దు సన్నివేశాలు, అందరి మహిళల మధ్యలో తాను ఒక్కడే అబ్బాయిగా ఉండడం.. క్లైమాక్స్ ఇలా ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నారు. అయితే ఈ సినిమా క్లైమాక్స్ లో రాశి ఖన్నా షూట్ చేయనని కోపంతో వెళ్లిపోయిందట. మరి అలా ఎందుకు చేసిందో సిద్దు జొన్నలగడ్డ చెప్పిన ఆ ఇంట్రెస్టింగ్ విషయాలు ఇప్పుడు చూద్దాం..
సిద్దు జొన్నలగడ్డ తాజాగా తెలుసు కదా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో పాల్గొన్నారు. అయితే ఈ ఈవెంట్లో మీ గత సినిమాల లాగే తెలుసు కదా మూవీలో కూడా ముద్దు సన్నివేశాలు ఉంటాయా? అనే ప్రశ్న ఎదురవగా.." నో నో ఈ సినిమాలో ముద్దు సన్నివేశాలు ఒక్కటి కూడా లేవు. సినిమా కథ చెప్పినప్పుడే డైరెక్టర్ నీరజ గారు ఇందులో ఒక్క ముద్దు సన్నివేశం కూడా ఉండకూడదని కండిషన్ పెట్టారు. అయితే ముద్దు సన్నివేశాలు లేకపోయినప్పటికీ అందర్నీ ఆకట్టుకునే అద్భుతమైన అనుభూతిని ఇచ్చే సన్నివేశాలు మాత్రం ఉంటాయి. ఇది ఓ పర్ఫెక్ట్ ఫ్యామిలీ మూవీ.. ఫ్యామిలీ అందరూ కలిసి చూడవచ్చు. అలాగే నేను ఈ సినిమాలో రాడికల్ పాత్రలో నటించాను.
అయితే ఈ సినిమా క్లైమాక్స్ లో రాశి ఖన్నా నేను నటించను అని దాదాపు 40 నిమిషాలు కోపంతో పక్కకు వెళ్ళిపోయింది. ఇలాంటి వాడు నా బాయ్ ఫ్రెండ్ అయితే నేను అస్సలు ఒప్పుకోను అంటూ అరిచేసింది. దాంతో ఇది నేను అక్కా ఇది రియల్ లైఫ్ కాదు.. నువ్వు రాశిఖన్నావి కాదు..అంజలి పాత్రలో నటిస్తున్నావు అని చెప్పి, ఒప్పించి ఆమెను మళ్లీ షూట్ కి తీసుకురావాల్సి వచ్చింది.". అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశారు సిద్దు జొన్నలగడ్డ..అలాగే ఈ సినిమా షూటింగ్లో 16 మంది అమ్మాయిలే ఉండేవారు. నేనొక్కడినే అబ్బాయిని ఉండేవాడిని.వారందరి మధ్యలో షూట్ సరదాగా అనిపించేది అంటూ సిద్దు జొన్నలగడ్డ చెప్పుకొచ్చారు.
మాస్ మహారాజ రవితేజతో మల్టీస్టారర్ సినిమా చేస్తారా? అనే ప్రశ్న ఎదురవగా.. గతంలో రవితేజ అన్నతో సినిమా చేయాలని అనుకున్నాం. స్టోరీ కూడా దాదాపు సెట్ అయినప్పటికీ కొన్ని కారణాల వల్ల అది మధ్యలోనే ఆగిపోయింది. ఏమో భవిష్యత్తులో మా ఇద్దరికీ సెట్ అయ్యే కథ వస్తే కచ్చితంగా చేస్తా అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు సిద్దు జొన్నలగడ్డ.
సిద్దు జొన్నలగడ్డ డిజె టిల్లు, టిల్లు స్క్వేర్ రెండు సినిమాలతో అలరించినప్పటికీ జాక్ మూవీతో బొక్క బోర్లా పడ్డారు. డి జె టిల్లు, టిల్లు స్క్వేర్ సినిమా లాగే జాక్ మూవీ చేసినప్పటికీ అది వర్కౌట్ అవ్వలేదు.దాంతో ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది. కానీ డీజే టిల్లు,టిల్లు స్క్వేర్ రెండు సినిమాల కంటే తెలుసు కదా మూవీ మరింత అద్భుతంగా ఉంటుందని ఈ సినిమా చూసే ప్రేక్షకులకు ఫుల్ ఫన్ అంటూ సినిమాపై భారీ అంచనాలు పెంచేశారు సిద్దు జొన్నలగడ్డ.. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 17న విడుదల కాబోతోంది.