ఏజెంట్‌ అవతారం ఎత్తబోతున్న టిల్లు భాయ్‌..!

సిద్దు జొన్నలగడ్డ తెలుసు కదా సినిమా తర్వాత గ్యాప్‌ తీసుకుని కొత్త కథతో రెడీ అవుతున్నాడు.;

Update: 2026-02-19 10:45 GMT

గత సంవత్సరం జాక్‌, తెలుసు కదా సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సిద్దు జొన్నలగడ్డ ప్రేక్షకులను నిరాశ పరిచాడు. తెలుసు కదా కాస్త విభిన్నంగా అనిపించినా కూడా ఓవరాల్‌గా సినిమా కమర్షియల్‌గా ఫ్లాప్‌గానే మిగిలింది. జాక్ సినిమా విషయంలో సిద్దు అంచనాలు పూర్తిగా తారు మారు అయ్యాయి. ఒకే ఏడాది రెండు ఫ్లాప్స్ ను చవిచూడటంతో సిద్దు చేయబోతున్న తదుపరి సినిమా విషయమై ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. సిద్దు మళ్లీ గాడిలో పడేనా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సుదీర్ఘ కాలం పాటు కెరీర్‌లో స్ట్రగుల్‌ అయిన సిద్దు డీజే టిల్లు సినిమాతో లైన్‌ లో పడ్డాడు అనుకుంటూ ఉండగా మళ్లీ ఫ్లాప్స్ హ్యాట్రిక్‌ ముందు నిలవడంతో ఆయనను అభిమానించే వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సిద్దు నుంచి ప్రేక్షకులు ఇది కాదు ఆశించేది అంటూ సోషల్‌ మీడియా ద్వారా పలు కామెంట్స్ చేస్తూ ఉన్నారు.

తెలుసు కదా సినిమా తర్వాత బ్రేక్‌...

సిద్దు జొన్నలగడ్డ తెలుసు కదా సినిమా తర్వాత గ్యాప్‌ తీసుకుని కొత్త కథతో రెడీ అవుతున్నాడు. నవీన్ పొలిశెట్టి కి మంచి గుర్తింపు తెచ్చి పెట్టిన ఏజెంట్‌ సాయి శ్రీనివాస్‌ ఆత్రేయ సినిమా దర్శకుడు స్వరూప్‌ దర్శకత్వంలో సిద్దు సినిమాకు లైన్ క్లీయర్ అయింది. ప్రముఖ నిర్మాణ సంస్థ వీరి కాంబినేషన్‌ను ముందుకు తీసుకు వెళ్లేందుకు కూడా రెడీ అయిందని తెలుస్తోంది. ఇప్పటికే స్వరూప్‌ రెడీ చేసుకున్న థ్రిల్లర్‌ జోనర్‌ స్క్రిప్ట్‌ కి తనదైన హంగులు అద్దుతూ సిద్దు దాన్ని తీర్చి దిద్దుతున్నాడని తెలుస్తోంది. డీజే టిల్లు, టిల్లు స్వేర్‌ సినిమాల స్క్రిప్ట్‌ విషయంలో సిద్దు ఇన్వాల్వ్‌మెంట్‌ ఉంటుందని అంటారు. అందుకే ఈ సినిమా స్క్రిప్ట్‌ విషయంలో ఆయన ఇన్వాల్వ్‌ అయ్యాడని తెలుస్తోంది. ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ చర్చలు తుది దశలో ఉన్నట్లు సమాచారం అందుతోంది.

సిద్దు జొన్నలగడ్డ హీరోగా స్వరూప్‌ దర్శకత్వంలో.....

కామెడీ టచ్‌ తో థ్రిల్లర్‌ మూవీని దర్శకుడు స్వరూప్‌ ప్లాన్‌ చేస్తున్నాడని, ఈ సినిమాకు ఇప్పటికే 'రాంబో' అనే టైటిల్‌ ను అనుకుంటున్నారు అంటూ ఇండస్ట్రీ వర్గాల వారి ద్వారా సమాచారం అందుతోంది. ఈ విభిన్నమైన టైటిల్‌ వెనుక పెద్ద కథనే రాసుకున్నారనే సమాచారం అందుతోంది. ఈ సినిమాలో సిద్దులోని కామెడీ యాంగిల్‌ మాత్రమే కాకుండా ఎమోషనల్‌ యాంగిల్‌ను కూడా చూస్తారట. ఏజెంట్‌ సాయి శ్రీనివాస్‌ ఆత్రేయ సినిమాలో దర్శకుడు స్వరూప్‌ ఇన్వెస్టిగేషన్‌ విధానం విభిన్నంగా సాగింది. అందుకే ఆ సినిమాకు మంచి పేరు వచ్చింది. అందుకే ఈ సినిమాలోనూ ఇన్వెస్టిగేషన్‌ విభిన్నంగా ఉండే విధంగా ప్లాన్‌ చేసే అవకాశాలు ఉన్నాయి. క్రైమ్‌ థ్రిల్లర్ లు ఇప్పటికే చాలా వచ్చాయి. అయితే స్క్రీన్‌ ప్లే విభిన్నంగా సాగితే తప్పకుండా సినిమాకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్‌ రెస్పాన్స్‌ దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

రాంబో టైటిల్‌తో సిద్దు సినిమా..

సిద్దు జొన్నలగడ్డ ట్యాలెంట్‌కి తగ్గ స్క్రిప్ట్‌ పడితే మరోసారి టిల్లు రేంజ్‌ హిట్‌ ఖాయం. మరి స్వరూప్‌ తో సిద్దు చేయబోతున్న రాంబో మూవీ ఆ స్థాయి విజయాన్ని సొంతం చేసుకుంటుందా అనేది చూడాలి. కాస్త అటు ఇటుగా ఈ సినిమాలో సిద్దు జొన్నలగడ్డ ఏజెంట్‌ అవతార్‌ లో కనిపించే అవకాశాలు ఉన్నాయి. నవీన్‌ పొలిశెట్టికి కలిసి వచ్చిన ఏజెంట్‌ అవతారం సిద్దుకు ఏ స్థాయిలో ఉపయోగపడుతుందో చూడాలి. సిద్దు జొన్నలగడ్డ ఇప్పటికే స్క్రిప్ట్‌ వర్క్‌ మొదలు పెట్టాడు, కనుక ఇదే ఏడాదిలో సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. గత ఏడాది రెండు సినిమాలతో నిరాశ పరిచిన సిద్దు జొన్నలగడ్డ ఈ ఏడాదిలో ఒక్క సినిమాతో వచ్చి, ఆ ఒక్క సినిమాతో హిట్‌ కొట్టాలనే పట్టుదలతో ఉన్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. మరి ఆయన ఈ ఏడాది ఏజెంట్‌గా హిట్‌ కొట్టేనా చూడాలి.

Tags:    

Similar News