అన్నయ్యకు తమ్మడు ఇప్పుడైనా లిప్ట్ ఇస్తాడా?
యంగ్ హీరో సిద్దు జొన్నల గడ్డకు ఓ అన్నయ్య ఉన్నాడని ఈ మధ్యనే బయట పడింది. `రాజు వెడ్స్ రాంబాయి` సినిమాలో సిద్దు అన్నయ్య చైతన్య జొన్నల గడ్డ పోషించిన పాత్రతో వెలుగులో రావడంతో విషయం బయటకు వచ్చింది.;
యంగ్ హీరో సిద్దు జొన్నల గడ్డకు ఓ అన్నయ్య ఉన్నాడని ఈ మధ్యనే బయట పడింది. `రాజు వెడ్స్ రాంబాయి` సినిమాలో సిద్దు అన్నయ్య చైతన్య జొన్నల గడ్డ పోషించిన పాత్రతో వెలుగులో రావడంతో విషయం బయటకు వచ్చింది. సినిమాలో చైతన్య పాత్రకు మంచి పేరొచ్చింది. నటుడిగా ఇండస్ట్రీకి పనికొస్తాడు? అనే గుర్తింపును తొలి సినిమాతోనే దక్కించుకున్నాడు. ఈ సినిమా కోసం చైతన్య ఎంతగా కష్టపడ్డాడో తెలిసిందే. వెంకన్న పాత్రలో అలరించాడు. ఆ పాత్ర కోసం అమెరికా నుంచి హైదరాబాద్ కు పదే పదే రావడం. వర్క్ షాప్స్ లో పాల్గొనడం వంటి సన్నివేశాలతో సినిమాలంటే తనకెంత ఆసక్తి అన్నది బయట పడుతుంది.
తమ్ముడు రికమండీషన్ లేకుండా:
కానీ బ్యాక్ బోన్ గా తమ్ముడు సిద్దు ఉన్నా చైతన్య హైడ్ అవ్వడం అన్నదే అంతు చిక్కని సందేహం. `డిజే టిల్లు`తో సిద్దు జొన్నలగడ్డ స్టార్ అయిన సంగతి తెలిసిందే. అంతకు ముందు ఎన్నో సినిమాలు చేసినా? డిజేటిల్లు తో మంచి గుర్తింపు దక్కింది. అక్కడ నంచి సిద్దు ప్రయాణం గురించి చెప్పాల్సిన పనిలేదు. బిజీగా ఉండే యువ హీరోల్లో సిద్దు ఒకడనిపించాడు. కానీ అన్నయ్య కోసం మాత్రం సిద్దు ఇంత వరకూ ఏం చేయలేదు. `రాజు వెడ్స్ రాంబాయి` లో నాగన్న పాత్ర కూడా అనుకోకుండా వచ్చిందే. ఇందులో సిద్దు రికమండీషన్ ఎక్కడా లేదు.
ట్యాలెంట్ బయటకొచ్చిన మరో నటుడు:
ఓ మేనేజర్ చైతన్య పేరును సూచించడం డైరెక్టర్ సాయిలు అతడిని ఆడీషన్ చేయడం పాత్రకు సెట్ అవ్వడంతో ఎంపికయ్యాడు. ఇదంతా సహజంగా జరిగిన ప్రక్రియ మాత్రమే. నటుడిగా చైతన్య ప్రూవ్ చేసుకున్న తరుణంలో తమ్ముడు కూడా ఇలాంటి సమయంలో లిప్ట్ ఇస్తే త్వరగా ఎదగడానికి అవకాశం ఉంటుంది. తాను హీరోగా నటించే సినిమాల్లో ఛాన్స్ ఇచ్చినా మరింత షైన్ అవుతాడు. వీటన్నింటిని మించి డీజేటిల్లు ప్రాంచైజీలో చైతన్యను భాగం చేస్తే బాగుంటుం టుందనే ఆలోచన కూడా సిద్దు అభిమానుల నుంచి వ్యక్తమవుతోంది.
యూనివర్శ్ లో ఛాన్సెస్:
అన్నదమ్ములిద్దరు అలాంటి హిలేరియస్ ఎంటర్ టైన్ స్క్రిప్ట్ లో భాగమైతే కథ మరింత పండుతుంది. ఈ ప్రాంచైజీ నిర్మాత నాగవంశీ డీజే టిల్లు నుంచి చాలా భాగాలు చేస్తామని వెల్లడించిన సంగతి తెలిసిందే. `మ్యాడ్` కథల్ని కూడా `డీజేటిల్లు` లోకి మిక్స్ చేసి వాటన్నింటి ఆధరంగా ఓ యూనివర్శ్ ని క్రియేట్ చేయాలనే ఆలోచనలో నూ ఉన్నారు. అలాంటప్పుడు చైతన్య లాంటి నటుల అవసరం మరింతగా ఉంటుంది. అదే జరిగితే చైతన్యకు మంచి అవకాశాలు వస్తాయి.