• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సిద్ధు పాత సినిమాను మళ్ళీ...

సిద్ధు పాత సినిమాను మళ్ళీ ఇలా..

| ఇక సినిమా పేరు కూడా మార్చేశారు. ‘ఇట్స్ కాంప్లికేటెడ్’ అనే టైటిల్ ని ఈ సినిమాకి ఫిక్స్ చేశారు.

By - Tupaki Desk
Update: 2025-02-03 07:23 GMT

‘డీజే టిల్లు’, ‘టిల్లు స్క్వేర్’ సినిమాలు యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ ఇమేజ్ ని అమాంతం పెంచేసాయి. ఒక్కసారిగా సిద్దుకి యూత్ ఫాలోయింగ్ కూడా ఈ చిత్రాలతో పెరిగిపోయింది. వీటి కంటే ముందు సిద్దు రొమాంటిక్ ఎంటెర్టైనెర్స్ చేశాడు. వాటిలో ఒకటి ‘కృష్ణ అండ్ హిజ్ లీల’. ఈ మూవీ కరోనా లాక్ డౌన్ టైంలో డైరెక్ట్ నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అయ్యింది.

 

ఈ సినిమాకి ఓటీటీలో మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. అయితే కరోనా సమయంలో రిలీజ్ కావడంతో ఎక్కువ యూత్ కి రీచ్ కాలేదు. రవికాంత్ పేరెపు దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కింది. ఇందులో సిద్దుకి జోడీగా శ్రద్ధా శ్రీనాథ్, సీరత్ కపూర్, షాలిని వడ్నికట్టి హీరోయిన్స్ గా నటించారు. అయితే ప్రస్తుతం సిద్దుకి ఉన్న క్రేజ్ నేపథ్యంలో ఈ చిత్రాన్ని థియేటర్స్ లో రిలీజ్ చేయబోతున్నారు.

ఫిబ్రవరి 14న వేలంటైన్స్ డే స్పెషల్ గా ఈ మూవీని రిలీజ్ చేస్తున్నారు. రానా సమర్పణలో ఈ మూవీ థియేటర్స్ లోకి వస్తోంది. మూవీ ప్రమోషన్స్ ని కూడా రానా దగ్గరుండి చూసుకుంటున్నారు. యూత్ ఆడియన్స్ కి ఈ మూవీ బాగా కనెక్ట్ అయ్యే అవకాశం ఉందని అనుకుంటున్నారు. ఇక సినిమా పేరు కూడా మార్చేశారు. ‘ఇట్స్ కాంప్లికేటెడ్’ అనే టైటిల్ ని ఈ సినిమాకి ఫిక్స్ చేశారు.

ఈ కొత్త టైటిల్ తో న్యూ రిలీజ్ పోస్టర్ కూడా విడుదల చేశారు. శ్రీచరణ్ పాకాల ఈ సినిమాకి మ్యూజిక్ అందించారు. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా ఈ మూవీ ఉండబోతోంది. ఫిబ్రవరి 14న విశ్వక్ సేన్ ‘లైలా’, కిరణ్ అబ్బవరం ‘దిల్ రుబా’ సినిమాలు రిలీజ్ కావాల్సి ఉంది. అయితే ఈ సినిమాలు వాయిదా పడే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో వాలంటైన్స్ డే స్పేస్ ని ‘ఇట్స్ కాంప్లికేటెడ్’ భర్తీ చేస్తుందని అనుకుంటున్నారు.

మరోవైపు రామ్ చరణ్ ‘ఆరెంజ్’ సినిమాని మరోసారి రీరిలీజ్ చేయబోతున్నారు. అయితే ‘ఆరెంజ్’ కంటే సిద్దు సినిమాకి ఎక్కువ ఆదరణ రావొచ్చని అనుకుంటున్నారు. ఓటీటీలో ఈ చిత్రాన్ని చాలా మంది చూడలేదు. చూసిన వాళ్ళు కూడా బిగ్ స్క్రీన్ ఎక్స్ పీరియన్స్ కోసం థియేటర్స్ కి వెళ్లే ఛాన్స్ ఉందని అనుకుంటున్నారు. మరి రానా ఐడియా ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.

Tags:    
  • ItsComplicatedMovie 
  • SiddhuJonnalagadda 
  • ValentinesDayRelease 
  • YouthRomanticComedy 
  • ItsComplicated 
  • RanaDaggubati 
  • RomanticEntertainer 

Similar News

బాడీ బిల్డ‌ర్‌ని పెళ్లాడుతున్న‌ గాయ‌ని.. ఫ్యాన్స్ విషెస్

2026-11-04 08:19 GMT

అజ్ఞాతవాసినే తట్టుకున్న గురుజీకి ఇదొక లెక్క..

2026-11-04 08:15 GMT

800 కోట్ల బ్లాక్‌బస్టర్ తర్వాత ఆఫర్ల వర్షం..అయినా రిజెక్ట్ చేసిన హీరోయిన్!

2026-11-04 08:12 GMT

అవకాశాలు అందుకుని విమర్శలా.. ఎస్కేఎన్ ఘాటైన కౌంటర్!

2026-11-04 08:12 GMT

బెల్లంకొండ శ్రీనివాస్.. మళ్లీ ఆ బలాన్నే నమ్ముకున్నారా!

2026-11-04 08:03 GMT

రెండో పెళ్లి కూడా విఫలం..నాలుగేళ్లకే భర్తకు విడాకులు!

2026-11-04 08:02 GMT

అజిత్‌తో జతకట్టనున్న శ్రీలీల.. పూజా వేడుకలో లుక్ వైరల్!

2026-11-04 08:01 GMT

హీరోయిన్ల విషయంలో అదే వివక్ష.. కోట్లు కుమ్మరించే ధైర్యం చేయండి!

2026-11-04 08:01 GMT

ధర్మన్ శ్రీలీల.. ఈ కాంబినేషన్ వెనుక ప్లాన్ ఏంటి!

2026-11-04 07:05 GMT

భార‌తీయ న‌టులంతా జ‌క్క‌న్న ప్రేమ్ లో అది ఎందులో అంటే?

2026-11-04 07:05 GMT

హీరోయిన్ అంటే ఇలా ఉండాలి.. తెలుగు ఇండస్ట్రీని ఇప్పటికీ మర్చిపోలేదు!

2026-11-04 06:03 GMT

స్టార్ హీరోలకు ఫస్ట్ డే మేజిక్.. హీరోయిన్ సినిమాలకు ఆ క్రేజ్ రావాలంటే?

2026-11-04 06:01 GMT

Copyright @2026

Powered by Blink CMS