• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  తెలంగాణ అల్లుడిగా వచ్చా.....

తెలంగాణ అల్లుడిగా వచ్చా.. ఆమె నా దేవత: సిద్ధార్థ్

| సినీ హీరో సిద్ధార్థ్ ఇటీవలే హీరోయిన్ అదితి రావు హైదరీని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.

By - Tupaki Desk
Update: 2024-11-26 03:42 GMT

సినీ హీరో సిద్ధార్థ్ ఇటీవలే హీరోయిన్ అదితి రావు హైదరీని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. 'మహా సముద్రం' సినిమాలో కలిసి నటించిన ఈ జంట.. కొన్నాళ్ళపాటు డేటింగ్ చేసి, చివరకు పెద్దల అంగీకారంతో వైవాహిక బంధంలో అడుగుపెట్టారు. తెలంగాణలోని వనపర్తిలోని ఒక ఆలయంలో వీరి పెళ్ళి జరిగింది. అయితే 'మిస్ యు' ప్రమోషన్స్ కోసం తాజాగా హైదరాబాద్ వచ్చిన సిద్దార్థ్.. ఈసారి తెలంగాణ అల్లుడిగా తెలుగు ఆడియన్స్ ముందుకు వచ్చానని అన్నారు.

"వచ్చే సంక్రాంతి నాకు చాలా ముఖ్యమైంది. 20 ఏళ్ల క్రితం ఎంఎస్ రాజు నిర్మాణంలో వచ్చిన ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ సినిమాతో సంక్రాంతి హీరోగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాను. ఆ సినిమాతో మీరు నాకు కొత్త లైఫ్ ఇచ్చారు. ఆ తర్వాత హైదరాబాద్ లో ఇల్లు తీసుకొని, చాలా కాలం ఇక్కడే తెలంగాణా బిడ్డగా పెరిగా. ఇప్పుడు తెలంగాణా అల్లుడిగా మీ ముందు నిల్చున్నా. అందుకే ఈ సంక్రాంతి నాకు చాలా ఇంపార్టెంట్" అని సిద్ధార్థ్ తెలిపారు.

అదితిరావ్‌ హైదరీ తల్లితండ్రులు తెలంగాణా ప్రాంతానికి చెందినవారు. వనపర్తి సంస్థానాధీశుల ఆఖరి రాజు రామేశ్వరరావుకు ఆమె మనువరాలు అవుతుంది. అందుకే ఆమెను ప్రేమ వివాహం చేసుకున్న బొమ్మరిల్లు సిద్దార్థ్.. తనని తాను తెలంగాణా అల్లుడిగా చెప్పుకున్నారు. ఈ సందర్భంగా అదితితో మ్యారేజ్ లైఫ్ గురించి కూడా మాట్లాడారు. పెళ్ళి తర్వాత ఎలాంటి బాధలు లేకుండా చాలా హ్యాపీగా, కామ్ గా ఉన్నానని తెలిపారు. అదితి రూపంలో తన జీవితంలోకి దేవత వచ్చిందని అన్నారు.

"ఎక్కడో తేలుతున్నట్లు వుంది. ఇలాంటి గొప్ప వరం దొరకడం నా అదృష్టం. నా లైఫ్ లోకి నా దేవత వచ్చింది. నా ఇంటికి మహాలక్ష్మి వచ్చింది. నేను చాలా చాలా గ్రేట్ ఫుల్ గా ఉన్నాను. 2024లో నాకు జరిగిన మంచి విషయం ఇదే. మంచి జరిగిందా అని నేను కూడా సర్ప్రైజ్ అయ్యాను. హమ్మయ్య, దేవుడి దయతో మంచి జరిగిందని రిలీఫ్ అయ్యాను. నాకైతే నా జీవితంలోనే ఎంతో సంతోషకరమైన మూమెంట్ ఇది" ను సిద్దార్థ్ చెప్పారు.

"తెలుగులో సినిమాలు ఎందుకు చేయట్లేదని అడుగుతున్నారు. ఆ విషయం మీరు సినిమాలు తీసే వాళ్లను అడగాలి. ఒకప్పుడు బెస్ట్ యాక్టర్ అన్నవారే ఇప్పుడు మంచి స్క్రిప్ట్స్ ఎందుకు తీసుకురావడం లేదో వాళ్ళనే అడగాలి. లవ్‌ స్టోరీల్లో ఎందుకు నటించడం లేదని అడుగుతున్నారు. 'బొమ్మరిల్లు', 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా', 'ఓయ్' లాంటి గొప్ప సినిమాల్లో నటించా. మళ్ళీ అలాంటి సినిమాలు రావడం కష్టం. అన్నీ లవ్ స్టోరీలే చేస్తుంటే, చాక్లెట్ బాయ్ అంటూ మనకి వేరే సినిమాల్లో పని ఇవ్వరు" అని అన్నారు. స్టార్‌ అవ్వడం తన డ్రీమ్‌ కాదని, చనిపోపోయిన తర్వాత ఒక మంచి నటుడు లేడని అనిపించుకోవాలని సిద్ధూ పేర్కొన్నారు.

సిద్ధార్థ్, ఆషికా రంగనాథ్‌ హీరో హీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం ‘మిస్‌ యు’. ఎన్‌.రాజశేఖర్ దర్శకత్వంలో ఈ రొమాంటిక్ లవ్‌ డ్రామా తెరకెక్కుతోంది. నవంబరు 29న తమిళ, తెలుగు భాషల్లో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రపంచంలో నచ్చని అమ్మాయికి ఐ లవ్‌ వ్యూ చెప్పడం అనే పాయింట్ ఈ మూవీలో హైలైట్‌ అని మేకర్స్ చెబుతున్నారు. ఇందులో నెగెటివిటీ, హింస, విలన్లు ఏవీ ఉండవని అంటున్నారు. మరి సిద్ధూ ఎన్నో ఏళ్ళ తర్వాత చేస్తున్న ఈ లవ్ స్టోరీ.. ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూద్దాం.

ఇండియన్ సినిమా చరిత్రలో #Bommarillu, #NuvvostananteNenoddantana, #Oye లాంటి లవ్ స్టోరీ సినిమాలు చాలా తక్కువగా వచ్చాయి. అలాంటి గొప్ప సినిమాలలో ఉండటం నా అదృష్టం.

ఇలాంటి లవ్ స్టోరీస్ తీయాలంటే భయం వేస్తుంది. అలాంటి ఒక Standards ను టచ్ చేయగలమా అని..

- #Siddharth #MissYou… pic.twitter.com/GTOmzaIbBL

— Tupaki (@tupaki_official) November 25, 2024
Tags:    
  • Siddharth 
  • Tollywood 
  • Filmindustry 
  • Ashikaranganath 
  • Missyoumovie 
  • Aditiraohydari 
  • Movies 

Similar News

బాడీ బిల్డ‌ర్‌ని పెళ్లాడుతున్న‌ గాయ‌ని.. ఫ్యాన్స్ విషెస్

2026-11-04 08:19 GMT

అజ్ఞాతవాసినే తట్టుకున్న గురుజీకి ఇదొక లెక్క..

2026-11-04 08:15 GMT

800 కోట్ల బ్లాక్‌బస్టర్ తర్వాత ఆఫర్ల వర్షం..అయినా రిజెక్ట్ చేసిన హీరోయిన్!

2026-11-04 08:12 GMT

అవకాశాలు అందుకుని విమర్శలా.. ఎస్కేఎన్ ఘాటైన కౌంటర్!

2026-11-04 08:12 GMT

బెల్లంకొండ శ్రీనివాస్.. మళ్లీ ఆ బలాన్నే నమ్ముకున్నారా!

2026-11-04 08:03 GMT

రెండో పెళ్లి కూడా విఫలం..నాలుగేళ్లకే భర్తకు విడాకులు!

2026-11-04 08:02 GMT

అజిత్‌తో జతకట్టనున్న శ్రీలీల.. పూజా వేడుకలో లుక్ వైరల్!

2026-11-04 08:01 GMT

హీరోయిన్ల విషయంలో అదే వివక్ష.. కోట్లు కుమ్మరించే ధైర్యం చేయండి!

2026-11-04 08:01 GMT

ధర్మన్ శ్రీలీల.. ఈ కాంబినేషన్ వెనుక ప్లాన్ ఏంటి!

2026-11-04 07:05 GMT

భార‌తీయ న‌టులంతా జ‌క్క‌న్న ప్రేమ్ లో అది ఎందులో అంటే?

2026-11-04 07:05 GMT

హీరోయిన్ అంటే ఇలా ఉండాలి.. తెలుగు ఇండస్ట్రీని ఇప్పటికీ మర్చిపోలేదు!

2026-11-04 06:03 GMT

స్టార్ హీరోలకు ఫస్ట్ డే మేజిక్.. హీరోయిన్ సినిమాలకు ఆ క్రేజ్ రావాలంటే?

2026-11-04 06:01 GMT

Copyright @2026

Powered by Blink CMS