• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  స‌ర‌సాలు చాలు శ్రీ‌వారూ...

స‌ర‌సాలు చాలు శ్రీ‌వారూ వేళ కాదు.. అదితీతో సిధ్ వేషాలు!

| అదితి రావ్ హైదరీ - సిద్ధార్థ్ జంట రొమాంటిక్ ల‌వ్ స్టోరి గురించి తెలిసిన‌దే. మ‌హా స‌ముద్రం సెట్స్‌లో క‌లిసారు.

By - Tupaki Desk
Update: 2024-09-18 07:20 GMT

అదితి రావ్ హైదరీ - సిద్ధార్థ్ జంట రొమాంటిక్ ల‌వ్ స్టోరి గురించి తెలిసిన‌దే. మ‌హా స‌ముద్రం సెట్స్‌లో క‌లిసారు. త‌ర్వాత ప్రేమ‌లో ప‌డ్డారు. ఇటీవ‌ల‌ పెళ్లి ప్ర‌క‌ట‌న, ఇంత‌లోనే స్వీట్ న్యూస్ చెబుతాం అంటూ.. వనపర్తిలోని 400 ఏళ్ల నాటి ఆలయంలో ఈ జంట వివాహం చేసుకోవ‌డం ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. ముంద‌స్తు స‌మాచారం ఏదీ లేకుండా సైలెంటుగా ఒక‌టైంది ఈ జంట‌. అందుకు సంబంధించిన ఫోటోలు ఇప్ప‌టికే ఇంట‌ర్నెట్ లో వైర‌ల్ అయ్యాయి.

పెళ్లికి ముందు సిద్ధార్థ్ -అదితి వోగ్ తో సరదా ముచ్చ‌ట్ల‌లో త‌మ ల‌వ్ లైఫ్‌లోని రొమాంటిక్ విష‌యాల‌ను షేర్ చేసారు. వోగ్ కోసం వారు ప్రత్యేక వెడ్డింగ్ ఫోటోషూట్ లో పాల్గొన్నారు. ``చూడకుండా వదిలేస్తే, సిద్ రెడీ...`` అని అదితి అడగడంతో ఈ వీడియో ప్రారంభమవుతుంది. ఉదయాన్నే అదితి రావు హైదరి చేసే మొదటి పని గురించి ప్ర‌శ్నించ‌గా.. సిద్ధార్థ్ ఇలా అన్నాడు. నా సమ్మతి లేకుండా నా ఇష్టానికి విరుద్ధంగా వేకువ‌ఝామున‌ నన్ను నిద్రలేపుతుంది! అని ఉద‌యాన్నే త‌మ జీవితం ఎలా మొద‌ల‌వుతుందో చెప్పాడు. ``డే ప్రారంభంలో అయిష్టంగా కన్నీళ్లతో మేల్కొంటాను. ఇప్పుడు ఈ క్షణాన్ని ఆస్వాధించే ప్రపంచంలో ఒక వ్యక్తిని... దాదాపు శిశువు నుండి మిఠాయి తీసుకున్నట్లుగా లాక్కుంటుంది నా నిద్ర‌ను!`` అంటూ స‌ర‌దాగా వ్యాఖ్యానించాడు సిధ్.

అదితీ మాత్రం సిధ్ ని క్యాజువ‌ల్ దుస్తుల్లో చాలా ఇష్ట‌ప‌డుతాన‌ని తెలిపింది. డిజైన‌ర్ దుస్తుల్లో అత‌డు స్టైలిష్ గా క‌నిపిస్తాడు. మా మ‌ధ్య గొడ‌వ జ‌రిగితే నేనే ముందు సారీ చెబుతాను.. అని కూడా తెలిపింది. అదితి - సిద్ధార్థ్ పెళ్లిలోను చాలా సింపుల్ గా రొమాంటిక్ గా క‌నిపించారు. అదితి సాంప్రదాయ దక్షిణ-భారత విధానంలో గోల్డ్ క‌ల‌ర్ చీరను ధరించింది. త‌ల‌లో పూల‌ను తురిమింది. సిద్ధార్థ్ తెల్లటి ధోతీ-కుర్తా లో సాంప్ర‌దాయ బ‌ద్ధంగా క‌నిపించాడు.

అదితి - సిద్ధార్థ్ ఈ ఏడాది మార్చిలో తమ నిశ్చితార్థాన్ని ఇన్‌స్టా పోస్ట్‌తో అధికారికంగా ప్రకటించారు. అతడు అవును! E. N. G. A. G. E. D. అనే క్యాప్షన్‌తో అదితి అస‌లు సంగ‌తి చెప్పింది. అయితే సిద్ధార్థ్ ``ఆమె అవును అని చెప్పింది`` అంటూ రొమాంటిగ్గా స్పందించాడు. అవును.. అవును .. ఇప్పుడు ఆ ఇద్ద‌రూ ఒక‌టిగా.. పెళ్లి బంధంతో ముందుకు సాగుతున్నారు.

Full View
Tags:    
  • Aditiraohydari 
  • Siddharth 
  • Vogue 
  • Siddharthaditirao 
  • Vogueweddingphotoshoot 
  • Siddharthaditiraorelation 

Similar News

వారణాసి మహేష్ బాబు రాముడిగా ఎంత సేపు కనిపిస్తాడు...

2026-11-05 16:32 GMT

స్టెప్-మదర్ కాదు అంతకుమించి!

2026-11-05 16:30 GMT

అంగరంగ వైభవంగా సాయి దుర్గ తేజ్, కిరణ్ నిశ్చితార్థం.. అమ్మాయి వివరాలు ఇవే!

2026-11-05 16:16 GMT

రెడ్ అవుట్‌ఫిట్‌లో స్టన్నింగ్ లుక్‌తో మెరిసిన పాలక్!

2026-11-05 16:16 GMT

'రామాయణ' సెట్స్‌లో సీతగా సాయి పల్లవి.. BTS ఫొటోలు వైరల్!

2026-11-05 16:15 GMT

RC17: హీరో.. హీరోయిన్..విలన్.. ఎవరెవరంటే..!

2026-11-05 16:15 GMT

హై బడ్జెట్ ఫిల్మ్‌లో దళపతి విజయ్.. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో!

2026-11-05 16:12 GMT

అనిల్ రావిపూడి.. ఈసారి యాక్షన్ కూడా గట్టిగానే..

2026-11-05 16:12 GMT

ఒకప్పుడు ఏలిన టాప్-5 హీరోయిన్‌లు నేడు ఊహించ‌ని స్థితిలో!

2026-11-05 15:30 GMT

డస్టీ రోజ్ శారీలో షాలిని అందాల సందడి!

2026-11-05 14:30 GMT

కమల్ హాసన్ బ్యానర్‌లో రజనీకాంత్-శ్రీలీల!

2026-11-05 13:30 GMT

ఆ పాన్ ఇండియా విషయంలో మాత్రం తెలుగు వాళ్ళ కన్నా తమిళ వాళ్లే మిన్న..!

2026-11-05 12:30 GMT

Copyright @2026

Powered by Blink CMS