రాజ్ మాజీ భార్య.. ఆ జ్ఞాపకాలు ఇంకా అలానే..

ఈ డిజిటల్ యుగంలో బంధం తెగిపోతే సోషల్ మీడియాలో కూడా వెంటనే దూరం పెరిగిపోతుంది.;

Update: 2025-12-02 05:10 GMT

ఈ డిజిటల్ యుగంలో బంధం తెగిపోతే సోషల్ మీడియాలో కూడా వెంటనే దూరం పెరిగిపోతుంది. ప్రొఫైల్ పిక్స్ మారుతాయి, పేర్లు మారుతాయి, పాత జ్ఞాపకాలు చెత్తబుట్టలోకి వెళ్తాయి. ఇది ఇప్పుడు రొటీన్ విషయమే. కానీ ఇక్కడ ఒక ఇన్ స్టాగ్రామ్ ప్రొఫైల్ చూస్తుంటే మాత్రం అందుకు భిన్నంగా కనిపిస్తోంది. గతం తాలూకు గుర్తులు ఇంకా అలాగే పదిలంగా ఉన్నాయి. ఇది చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

సమంతతో రాజ్ నిడమూరు వివాహం జరిగిన తర్వాత, సహజంగానే అందరి చూపు రాజ్ గత జీవితం వైపు మళ్లింది. రాజ్ మాజీ భార్య శ్యామలీ దే సోషల్ మీడియా ఖాతాలను నెటిజన్లు ఆసక్తిగా గమనించారు. అయితే అక్కడ కనిపించిన ఫొటోలు చూసి చాలామంది షాక్ అవుతున్నారు. విడిపోయి చాలా కాలం అయినా, రాజ్ ఇంకా ఆ ప్రొఫైల్ లోని పోస్టుల్లో కనిపిస్తూనే ఉన్నారు. ఆమె వాటిని డిలీట్ చేయలేదు.

నార్మల్ గా సెలబ్రిటీల మధ్య విబేధాలు వస్తే, మొదట జరిగే పని సోషల్ మీడియా క్లీనింగ్. కలిసి దిగిన ఫోటోలు తొలగించడం, అన్ ఫాలో చేయడం ద్వారానే ప్రపంచానికి బ్రేకప్ హింట్ ఇస్తుంటారు. గతంలో ఎంతోమంది స్టార్ల విషయంలో మనం ఇదే చూశాం. కానీ శ్యామలీ మాత్రం ఆ దారిలో వెళ్లలేదు. రాజ్ తో కలిసి దిగిన పెళ్లి ఫోటోలు, వాలెంటైన్స్ డే పోస్టులు ఇంకా ఆమె టైమ్ లైన్ లో అలాగే దర్శనమిస్తున్నాయి.

ముఖ్యంగా నవంబర్ 2022లో పెట్టిన పెళ్లి రోజు శుభాకాంక్షలు, ఫిబ్రవరి 2023 నాటి వాలెంటైన్స్ డే పోస్టులు ఇప్పటికీ ఉన్నాయి. అందులో రాజ్ గురించి ఆమె రాసిన ఎమోషనల్ మాటలు చూస్తుంటే, వారి మధ్య అప్పట్లో ఎంతటి సాన్నిహిత్యం ఉండేదో అర్థమవుతుంది. "నీ చేతిని పట్టుకోవడం ఇష్టం" అంటూ రాసిన క్యాప్షన్లు ఆ బంధానికి సాక్ష్యంగా నిలిచాయి. ఇప్పుడు రాజ్ మరో పెళ్లి చేసుకున్నా, ఆమె మాత్రం ఈ ఫోటోలను ఉంచడం విశేషం.

దీన్ని బట్టి చూస్తుంటే శ్యామలీ ఎంత పరిణితితో ఆలోచిస్తారో అర్థం చేసుకోవచ్చు. బంధం ముగిసినంత మాత్రాన, జ్ఞాపకాలను తుడిచేయాల్సిన అవసరం లేదని ఆమె భావించి ఉండవచ్చు. విడిపోవడం అంటే ద్వేషించుకోవడం కాదని, గతాన్ని గౌరవించడం అని ఆమె నిరూపించారు. విడాకులు తీసుకున్నా కూడా, ఒకప్పుడు తన జీవితంలో ముఖ్యమైన వ్యక్తిగా రాజ్ కు ఆమె ఇస్తున్న గౌరవం ఇది అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

ఎలాంటి నెగిటివ్ పోస్టులు పెట్టకుండా, గతం గురించి తప్పుగా మాట్లాడకుండా హుందాగా వ్యవహరించడం నిజంగా గొప్ప విషయం. ఇక ఆమె పాత పోస్టుల విషయం గురించి ఆలోచించారో లేదో గాని నెటిజన్లు మాత్రం రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇంతటి పెద్ద మూమెంట్ లో పాత పేజీలను చింపేయకుండా, వాటిని అలానే ఉంచుకోవడం అందరికీ సాధ్యం కాదని అంటున్నారు. శ్యామలీ వ్యవహరిస్తున్న తీరు సోషల్ మీడియాలో ఒక హెల్దీ డిస్కషన్ కు దారితీసింది. ఇక ఆమె భవిష్యత్తులో వాటిని మెల్లగా తీసేయవచ్చని మరికొందరు చెబుతున్నారు.




Tags:    

Similar News