శృతి అప్పుడే మొదలెట్టేసిందిగా!
సుమారు రెండేళ్ల పాటూ వెండితెరకు దూరంగా ఉన్న శృతి హాసన్ ఇప్పుడు తిరిగి కంబ్యాక్ ఇవ్వాలని చూస్తోంది.;
సుమారు రెండేళ్ల పాటూ వెండితెరకు దూరంగా ఉన్న శృతి హాసన్ ఇప్పుడు తిరిగి కంబ్యాక్ ఇవ్వాలని చూస్తోంది. ఆమె అభిమానులు కూడా ఆమెకు వెల్‌కమ్ చెప్పేందుకు రెడీగా ఉన్నారు. 2023లో సలార్: పార్ట్1 సీజ్‌ఫైర్ లో ఆఖరిగా కనిపించిన శృతి హాసన్, ఇప్పుడు రెండేళ్ల తర్వాత కూలీ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటిస్తున్న కూలీ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వహిస్తున్నాడు. పాన్ ఇండియా ప్రాజెక్టుగా రూపొందుతున్న ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ను జరుపుకుంటుంది.
అయితే కూలీ సినిమాకు విపరీతమైన బజ్ నెలకొంది. దానికి కారణం లేకపోలేదు. రజినీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాగార్జున, ఉపేంద్ర, అమీర్ ఖాన్ లాంటి భారీ తారాగణం కీలక పాత్రలు చేస్తుండగా శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. సత్యరాజ్ సపోర్టింగ్ రోల్ లో నటిస్తున్నారు. పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ లో సందడి చేయనుంది.
ఈ నేపథ్యంలోనే కూలీపై విపరీతమైన అంచనాలున్నాయి. ఆగస్ట్ 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ కూడా చేశారు. ఇదిలా ఉంటే శృతి హాసన్ కూలీ సినిమాలో తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్ ను చెప్తున్నట్టు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. శృతి చేసిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుండగా, కూలీలో శృతి ఎలాంటి క్యారెక్టర్ లో కనిపిస్తుందో చూడ్డానికి ఆమె ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
అయితే కూలీలో శృతి క్యారెక్టర్ చాలా స్పెషల్ గా ఉండనుందని, కొంత కాలం పాటూ ఆ పాత్ర గుర్తుండిపోతుందని ఇప్పటికే చిత్ర యూనిట్ పలుసార్లు తెలిపింది. ఇప్పటికే తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తనదైన ముద్ర వేసిన శృతి హాసన్ సినిమాలతో పాటూ సింగింగ్ పరంగా పలు ఇంటర్నేషనల్ ప్రాజెక్టుల్లో భాగమవుతూ అందులోనూ తన సత్తా చాటుతోంది.