శృతి హాసన్ ఇక కష్టమేనా..?
కమల్ గారాల పట్టి శృతి హాసన్ మ్యూజిక్ మీద ఇంట్రెస్ట్ ఉన్నా కూడా హీరోయిన్ గానే కొనసాగింది.;
కమల్ గారాల పట్టి శృతి హాసన్ మ్యూజిక్ మీద ఇంట్రెస్ట్ ఉన్నా కూడా హీరోయిన్ గానే కొనసాగింది. ఐతే కెరీర్ మొదలు పెట్టిన మొదట్లో అమ్మడికి వరుస ఫ్లాపులు వచ్చాయి. తమిళ్, తెలుగు భాషల్లో మొదట సినిమాలు అన్నీ నిరాశపరిచాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో చేసిన గబ్బర్ సింగ్ సినిమా శృతి హాసన్ కి మొదటి కమర్షియల్ హిట్ ఇచ్చింది. అందుకే ఆ సినిమా ఆమె కెరీర్ లో ప్రత్యేకమైన సినిమాగా చెబుతుంది.
తెలుగులో హిట్ కొట్టగానే వరుస స్టార్ ఛాన్స్ లు వచ్చాయి. ఈ క్రేజ్ తో కోలీవుడ్ లో కూడా సూపర్ సినిమాలు చేసింది. అక్కడ ఇక్కడ తీరిక లేకుండా సినిమాలు చేస్తూ వచ్చిన శృతి హాసన్ సినిమాలంటే బోర్ కొట్టినట్టు ఫీలైంది కాబోలు కొన్నాళ్లు బ్రేక్ తీసుకుంది. తెలుగులో సినిమాలకు సైన్ చేసి ఆమె చివరి నిమిషంలో చేయలేనని చెప్పడం లాంటివి చేస్తూ వచ్చింది. దాని వల్ల మన మేకర్స్ శృతి హాసన్ ని పక్కన పెట్టారు.
ఐతే మళ్లీ తమిళ్ లో వరుస సినిమాలు చేస్తున్న శృతి హాసన్ కి మళ్లీ తెలుగులో ఛాన్స్ లు ఇచ్చారు. ఐతే సినిమాలు తనకు సెకండ్ ఆప్షన్ అన్నట్టుగా శృతి హాసన్ ప్రవర్తన ఉండేది. తెలుగులో చివరగా హాయ్ నాన్న లో స్పెషల్ సాంగ్ చేసిన శృతి హాసన్ ఆ తర్వాత ప్రభాస్ తో సలార్ 1లో కూడా నటించింది. ప్రస్తుతం సూపర్ స్టార్ రజినికాంత్ నటిస్తున్న కూలీ, తమిళ్ లో వస్తున్న ట్రైన్ సినిమాల్లో నటిస్తుంది.
తెలుగు నుంచి పలు ఆఫర్లు వస్తున్నా కూడా ఆసక్తి చూపించట్లేదట శృతి హాసన్. ఐతే సలార్ 1 లో ఉంది కాబట్టి సలార్ 2 లో కచ్చితంగా చేయాల్సి ఉంటుంది. సో శృతి హాసన్ కెరీర్ ని కొనసాగించాలనే ఇంట్రెస్ట్ లేకపోవడం వల్లే ఇలా వచ్చిన అవకాశాలను కూడా కాదంటుందని తెలుస్తుంది. అడివి శేష్ తో డెకాయిట్ సినిమాకు ముందు సైన్ చేసిన శృతి హాసన్ ఆ తర్వాత ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఇలా ఒకసారి కాదు చాలా సినిమాలకు హ్యాండ్ ఇచ్చిన శృతి హాసన్ ని ఇక టాలీవుడ్ లైట్ తీసుకోబోతుందని చెప్పుకుంటున్నారు. తెలుగులో ఛాన్స్ లు లేకపోయినా శృతి హాసన్ సొంత భాషలో సినిమాలు చేస్తుందా అక్కడ కూడా సినిమాలు ఆపేస్తుందా అన్నది చూడాలి.