తరగని అందంతో ఆకట్టుకుంటున్న శ్రియా శరన్!
అయితే అలాంటి శ్రియా శరన్ కి సంబంధించి తాజాగా బీచ్ లో నెట్టెడ్ దుస్తుల్లో ఉన్న ఫోటోలు ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతున్నాయి.;
సినిమా హీరోయిన్స్ ఏం తింటారో ఏమో కానీ ఎంత ఏజ్ వచ్చినా కూడా తమ ఏజ్ అస్సలు మొహం మీద కనిపించనివ్వరు. 50 ఏళ్లు ఉన్నా కూడా పాతికేళ్ళ అమ్మాయి లాగే కనిపిస్తారు.. అలా వయసు పెరిగినా కూడా చెక్కుచెదరని అందంతో పాతికేళ్ల అమ్మాయి లాగే ఉండే హీరోయిన్ల లో సీనియర్ నటి శ్రియా శరన్ ఒకరు..ఈమె ఏజ్ 40 దాటింది. కానీ ఇంకా అందంలో కుర్ర హీరోయిన్లకు గట్టి పోటీ ఇస్తుంది. ఈమె అందం ముందు కుర్ర హీరోయిన్లు కూడా జుజూబి.. తేలిపోతారంతే.. అలాంటి పర్ఫెక్ట్ ఫిజిక్ ని మెయింటైన్ చేస్తూ.. తల్లయినా అందాన్ని కాపాడుకుంటూ వస్తుంది శ్రియా శరణ్. అయితే అలాంటి శ్రియా శరన్ కి సంబంధించి తాజాగా బీచ్ లో నెట్టెడ్ దుస్తుల్లో ఉన్న ఫోటోలు ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతున్నాయి.
తాజాగా శ్రియా శరణ్ తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో వైట్ కలర్ మెష్ బీచ్ డ్రెస్ లో ఉన్న ఫోటోలను అభిమానులతో పంచుకుంది.. ఈ ఫోటోలలో శ్రియా శరన్ గ్లామర్ తో పాటు ఆమె ఆత్మ విశ్వాసం కూడా కనిపిస్తోంది.. అలా శ్రియా శరన్ అద్భుతమైన షీర్ బీచ్ లుక్ లో ఉన్న ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయడంతో ఈ ఫొటోస్ అభిమానుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా లో దుస్తులు కనిపించేలా ఈమె నెట్ డ్రెస్ ని స్టైల్ చేసిన విధానం ఆమెలో ఉన్న ఆత్మవిశ్వాసాన్ని బయట పెడుతుంది. అయితే అలాంటి శ్రియా శరన్ కి సంబంధించిన ఈ హాట్ ఫొటోస్ కి అభిమానులు ఆకర్షితులవ్వడమే కాదు హాట్ కామెంట్లు కూడా పెడుతున్నారు..
ఏజ్ పెరిగినా మీలో ఉన్న అందం మాత్రం తగ్గలేదు. రోజురోజుకీ మరీ ఇంత యంగ్ గా మారిపోతున్నారు ఏంటో అని కొంతమంది కామెంట్స్ పెడుతుంటే.. మరికొంత మందేమో అన్నం తింటున్నారా.. ? అందాన్ని తింటున్నారా? అర్థం అవడం లేదు అంటూ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. ఇక శ్రియా శరన్ సినీ కెరియర్ చూసుకుంటే.. ఒకప్పుడు వరుస సినిమాలతో ఇండస్ట్రీని షేక్ చేసిన శ్రియా శరన్ అప్పటి స్టార్ హీరోలందరితో కలిసి నటించింది.
కొత్త హీరోయిన్ల రాకతో ఈమె హవా తగ్గడంతో స్పెషల్ సాంగ్ లలో కూడా మెరిసింది. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటిస్తూ ఇండస్ట్రీలో ముందుకు వెళ్తోంది. అలా రీసెంట్గా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అయినా తేజ సజ్జా మిరాయ్ మూవీలో హీరో తల్లి అంబికా అనే కీ రోల్ పోషించింది. ఈ కథ మొత్తం అంబికా చుట్టే తిరుగుతుంది.. అలా ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటూ సినిమాల్లో ముందుకు వెళుతున్న శ్రియా శరన్ అప్పుడప్పుడు ఇలాంటి హాట్ ఫోటోలతో సోషల్ మీడియా లో హీట్ పుట్టిస్తోంది అని చెప్పవచ్చు.