అది సెన్సార్ వాళ్ల సెన్సె లేని పని.. ఆ కిస్ సీన్ డిలీట్ చేయడం ఏంటి?

అయితే తాజాగా సినిమాలోని ఓ సన్నివేశాన్ని డిలీట్ చేయడంపై బాలీవుడ్‌ నటి శ్రేయా ధన్వంతరి ఆగ్రహం వ్యక్తం చేశారు.;

Update: 2025-07-12 11:29 GMT

డీసీ యూనివర్స్‌ లో సూపర్‌ మ్యాన్‌ సిరీస్ సినిమాలకు ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్నో ఎళ్లుగా ప్రేక్షకులను అలరిస్తూ బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించిన ఈ సిరీస్ లో తాజాగా సూపర్‌ మ్యాన్ మూవీ వచ్చింది. ఈ యూనివర్స్‌లోని సినిమా ఫ్రాంచైజీలకు కొత్త వెర్షన్‌ గా ఈ సినిమా రూపొందింది.

ఇక ఈ సూపర్ హీరో మూవీ సూపర్‌ మ్యాన్‌ సినిమా శుక్రవారం థియేటర్లలో రిలీజైంది. డేవిడ్‌ కొరెన్స్‌ వెట్‌- రెచెల్‌ ప్రధాన కీలక పాత్రలో నటించిన ఈ సినిమా థియేటర్లలో ప్రేక్షకులను అలరిస్తుంది. అయితే తాజాగా సినిమాలోని ఓ సన్నివేశాన్ని డిలీట్ చేయడంపై బాలీవుడ్‌ నటి శ్రేయా ధన్వంతరి ఆగ్రహం వ్యక్తం చేశారు. సెన్సార్ బోర్డు ఈ సినిమాలో 33 సెకన్ల కిస్ సీన్ ను తొలగించడాన్ని ఆమె తప్పు బట్టారు.

ఇది అర్థం పర్థం లేని చర్య అని శ్రేయా అన్నారు. ఇలాంటి చర్యల వల్ల ప్రేక్షకులకు సినిమాలు చూడాలనే ఆసక్తి తగ్గిపోతుంది అని తెలిపారు. సూపర్‌ మ్యాన్‌ లో 33 సెకన్ల ముద్దు సీన్ ను సెన్సార్‌ తీసేసింది. ఇదేం చర్య. ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లి సినిమాలు చూడాలనే సెన్సార్‌ వాళ్లు కోరుకుంటారు. అలాగే పైరసీలను ప్రోత్సహించకండి అని చెబుతారు.

కానీ బోర్డు వాళ్లు మాత్రం ఇలాంటి అర్ధం లేని పనులు చేస్తారు. అసలు వాళ్ల ఉద్దేశ్యం ఏంటో నాకు అస్సలు అర్థం అవ్వడం లేదు. ఇలాంటి చేస్తూనే థియేటర్‌ లో సినిమా చూడాల్సిన అనుభూతిని దెబ్బతీస్తున్నారు. సినిమా చూసే ఆడియెన్స్ కు స్వేచ్ఛనివ్వాలి. మా డబ్బులు, సమయం వెచ్చించి మేం ఏం చూడాలి అనుకుంటున్నామో మమ్మల్ని డిసైడ్ చేసుకోనివ్వండి.

ఇదొక హాస్యాస్పదమైన చర్య. మూవీ చూసేందుకు థియేటర్‌ అనేది ఉత్తమమైన మార్గం. ఆడియెన్స్ ను చిన్న పిల్లల్లాగా భావించి, థియేటర్‌ లో చూసామన్న ఫీలింగ్ కలగకుండా చేస్తున్నారు. అని శ్రేయా ధన్వంతరి ఆమె ఇన్‌ స్టాగ్రామ్ స్టోరీ లో పోస్ట్‌ షేర్ చేశారు. కాగా శ్రేయా ధన్వంతరి ది ఫ్యామిలీ మ్యాన్, గన్స్ అండ్ గులాబ్స్ లాంటి వెబ్ సిరీస్ ల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

Tags:    

Similar News