తెలుగమ్మాయి గ్లామర్ షో తగ్గేదేలే!
శ్రేయా ధన్వంతరి గ్లామర్ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపుతో ఎదగాలనుకుంటున్న తెలుగమ్మాయి. మధురా శ్రీధర్ `స్నేహగీతం` చిత్రంతో నటిగా కెరీర్ ప్రారంభించింది.;
రాజ్ అండ్ డీకే చాలామంది జీవితాలను మార్చారు. ఈ ట్యాలెంటెడ్ దర్శకరచయితలు చాలామంది తెలుగు నటులు, నటీమణులకు తమ సినిమాలు, వెబ్ సిరీస్ లలో అవకాశాల్ని కల్పించారు. అలా అవకాశం అందుకున్న ఒక తెలుగమ్మాయి శ్రేయా ధన్వంతరి. సమంత రూత్ ప్రభు కంటే ముందే రాజ్ అండ్ డీకే శ్రేయాకు తమ వెబ్ సిరీస్ లో అవకాశాలు కల్పించారు. శ్రేయా ఇటీవల ముంబైలో పాపులర్ అవ్వడానికి వరుస అవకాశాలు అందుకోవడానికి అవసరమైన సాయం చేసింది రాజ్ అండ్ డీకే.
శ్రేయా ధన్వంతరి గ్లామర్ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపుతో ఎదగాలనుకుంటున్న తెలుగమ్మాయి. మధురా శ్రీధర్ `స్నేహగీతం` చిత్రంతో నటిగా కెరీర్ ప్రారంభించింది. మోడల్ గా, రచయిత్రిగా శ్రేయా రాణించారు. ముఖ్యంగా ఓటీటీ రంగంలో రాణించిన శ్రేయా, ఎంపిక చేసుకున్న పాత్రలు స్టార్‌గా నిలబెట్టాయి.
శ్రేయా నేపథ్యం పరిశీలిస్తే 29 ఆగస్టు 1988న హైదరాబాద్‌లో జన్మించారు. తన తల్లి తెలుగు వారు.. తండ్రి హిందీ భాష మాట్లాడే వ్యక్తి. ఏవియేషన్ రంగంలో పని చేస్తున్నారు. దీంతో శ్రేయా పుట్టిన రెండు నెలలకే తండ్రి ఉద్యోగ రీత్యా వారి కుటుంబం మిడిల్ ఈస్ట్ కి వెళ్లిపోయింది. శ్రేయా తన బాల్యాన్ని దుబాయ్, బహ్రెయిన్, ఖతార్‌లలో గడిపారు. దాదాపు 17దేశాలలో తన తండ్రి ఉద్యోగం చేసారని వెల్లడించారు.
ఆ తర్వాత ఉన్నత చదువుల కోసం తిరిగి భారత్‌కు వచ్చిన శ్రేయా వరంగల్‌లోని ప్రతిష్టాత్మకమైన ఎన్.ఐ.టి-ఓరుగల్లు నుండి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్‌లో పట్టా పొందారు. ఇంజనీరింగ్ మూడవ సంవత్సరం చదువుతుండగానే `ఫెమినా మిస్ ఇండియా సౌత్ 2008` పోటీలలో పాల్గొని ఫస్ట్ రన్నరప్‌గా నిలిచారు. అనంతరం మిస్ ఇండియా 2008 ఫైనలిస్ట్‌గా నిలిచారు. 2009లో అక్కినేని నాగచైతన్య మొదటి సినిమా `జోష్` చిత్రంతో తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఆ తర్వాత 2010లో `స్నేహగీతం` సినిమాలో శైలు అనే ప్రధాన పాత్రలో నటించి మెప్పించారు.
2019లో ఇమ్రాన్ హష్మీ సరసన `వై చీట్ ఇండియా` చిత్రంతో బాలీవుడ్‌లోకి ప్రవేశించారు. కానీ శ్రేయాకు అసలైన బ్రేక్ ఇచ్చింది మాత్రం వెబ్ సిరీస్‌లే. రాజ్ అండ్ డీకే తెరకెక్కించిన 'ద ఫ్యామిలీ మ్యాన్' సిరీస్ లో జోయా అనే గూఢచారి పాత్రలో తన నటనకు మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత హర్షద్ మెహతా బయోపిక్‌గా వచ్చిన `స్కామ్ 1992` వెబ్ సిరీస్‌లో జర్నలిస్ట్ సుచేతా దలాల్ పాత్రలో ఆమె అద్భుతంగా నటించి దేశవ్యాప్త ప్రశంసలు అందుకున్నారు. ముంబై డైరీస్ 26/11లో కూడా జర్నలిస్ట్ పాత్రలో తన ప్రతిభను చాటుకున్నారు.
శ్రేయా కేవలం నటి మాత్రమే కాదు, రచయిత్రి కూడా. 2016లో `ఫేడ్ టు వైట్` అనే పుస్తకాన్ని రాశారు. లాక్‌డౌన్ సమయంలో `ఎ వైరల్ వెడ్డింగ్` అనే వెబ్ సిరీస్‌ను స్వయంగా రాసి, దర్శకత్వం వహించి.. అందులో నటించారు.
బాలీవుడ్‌లో స్థిరపడటానికి సుమారు 10 ఏళ్ల పాటు శ్రేయా కష్టపడ్డారు. ఒకానొక సమయంలో ఆర్థిక ఇబ్బందులను కూడా ఎదుర్కొన్నట్లు ఆమె ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు. కానీ ఇప్పుడు నటిగా ఫుల్ బిజీగా ఉన్నారు. బాగానే ఆర్జిస్తున్నారు.
ప్రస్తుత ప్రాజెక్టులు....
ఇటీవల శ్రేయా దుల్కర్ సల్మాన్‌తో కలిసి `చుప్, `గన్స్ అండ్ గులాబ్స్` వంటి ప్రాజెక్టులలో కనిపించారు. ప్రస్తుతం పలు హిందీ సినిమాలు, వెబ్ సిరీస్‌లతో బిజీగా ఉన్నారు.
ఈ రంగం ప్రభావం..
ప్రస్తుతం తెలుగమ్మాయి శ్రేయా ధన్వంతరి కొన్ని వెబ్ సిరీస్‌లు, గ్లామరస్ ఫోటోషూట్‌లతో బిజీగా ఉంది శర్మాగాళ్. శ్రేయా తాజా ఫోటోషూట్ ఇంటర్నెట్ లో గుబులు రేపుతోంది. గ్లామర్ షో విషయంలో తగ్గేదేలే! అంటూ మతులు చెడగొడుతోంది. శ్రేయాకు దేశవ్యాప్తంగా ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ దృష్ట్యా ఇటీవలి కాలంలో గ్లామరస్ ఫోటోషూట్లతో జోరు పెంచిందని అర్థమవుతోంది.