సింపుల్ స్మైల్‌తో గుండె గిల్లుతున్న శ్రద్ధ
సాహో, ఆషిఖి 2 లాంటి చిత్రాలతో దక్షిణాదినా భారీ ఫాలోయింగ్ తెచ్చుకుంది శ్రద్ధా కపూర్. నటుడు శక్తికపూర్ నటవారసురాలిగా తండ్రి గర్వించదగిన స్థానానికి ఎదిగింది ఈ భామ.;
సాహో, ఆషిఖి 2 లాంటి చిత్రాలతో దక్షిణాదినా భారీ ఫాలోయింగ్ తెచ్చుకుంది శ్రద్ధా కపూర్. నటుడు శక్తికపూర్ నటవారసురాలిగా తండ్రి గర్వించదగిన స్థానానికి ఎదిగింది ఈ భామ. తనదైన నటన, అందం, చిరు నవ్వుతో మనసులు గెలుచుకోవడం శ్రద్ధా ప్రత్యేకత.
అయితే శ్రద్ధా వృత్తిగత జీవితం కంటే, వ్యక్తిగత జీవితం కారణంగా ఎక్కువగా మీడియాలో చర్చగా మారుతోంది. ఈ బ్యూటీ ఇటీవల స్త్రీ 2 లాంటి బ్లాక్ బస్టర్ లో నటించింది. వరుసగా భారీ చిత్రాల్లో నటించనుంది. తదుపరి హృతిక్ రోషన్ సరసన ఓ భారీ చిత్రంలో నటించనుందని కథనాలొస్తున్నాయి. కెరీర్ పరంగా జర్నీ ఎలా ఉన్నా, శ్రద్ధా లవ్ లైఫ్ ప్రతిసారీ చర్చగా మారుతోంది. ఈ భామ ఇంతకుముందు సహనటుడు ఆదిత్య రాయ్ కపూర్ తో ప్రేమాయణం సాగించిందని గుసగుసలు వినిపించాయి. కానీ ఆ ఇద్దరి దారులు వేరయ్యాయి. ఆ తర్వాత దర్శకనిర్మాత ఫర్హాన్ అక్తర్ తో కొన్నాళ్ల పాటు ప్రేమలో ఉన్న శ్రద్ధా అతడితోను బ్రేకప్ అయింది. ఇటీవల కొంతకాలంగా స్త్రీ ఫ్రాంఛైజీ స్క్రీన్ ప్లే రచయిత రాహుల్ మోడీతో ప్రేమలో ఉందని ప్రచారం సాగుతోంది. కానీ దీనిని ఇప్పటివరకూ శ్రద్ధా అధికారికంగా ఖాయం చేయలేదు.
మరోవైపు శ్రద్ధా సోషల్ మీడియాల్లో తన ఫాలోవర్స్ ని యంగేజ్ చేసేందుకు నిరంతర ఫోటోషూట్లను షేర్ చేస్తోంది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోషూట్ ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. ఇందులో ఈ భామ సింపుల్ గా స్మైలిస్తూ హృదయాలను కొల్లగొట్టింది. శ్రద్ధా ఛామ్, గ్లో ఈ ఫోటోగ్రాఫ్ లో ఎంతో అందంగా ఒదిగిపోయి కనిపిస్తున్నాయి. ఒకే ఒక్క స్మైల్ తో గేమ్ ఛేంజర్ గా మారిందంటూ అభిమానులు కాంప్లిమెంట్లు ఇస్తున్నారు. అన్నట్టు శ్రద్ధా తదుపరి టాలీవుడ్ లోకి రీఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈసారి ప్రభాస్ కాకుండా ఏ పెద్ద హీరో ఈ భామకు అవకాశం కల్పిస్తారో వేచి చూడాలి.