సానియా మాజీ భర్త... మూడోసారి విడాకులు?
పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ మాలిక్ మళ్లీ విడాకుల వార్తల కారణంగా మీడియాలో చర్చనీయాంశం అయ్యాడు.;
పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ మాలిక్ మళ్లీ విడాకుల వార్తల కారణంగా మీడియాలో చర్చనీయాంశం అయ్యాడు. చాలా మంది ఈయనకు సానియా మీర్జా మొదటి భార్య అనుకుంటారు. కానీ షోయబ్ మాలిక్ మొదటి భార్య అయేషా సయీద్‌తో దాదాపుగా 8 ఏళ్లు వైవాహిక జీవితంను సాగించాడు. అయేషాతో 8 ఏళ్ల తర్వాత విభేదాల కారణంగా సోయబ్ మాలిక్ ఆమెకు విడాకులు ఇచ్చాడు. విడాకులు ఇచ్చిన వెంటనే సానియా మీర్జాను సోయబ్ మాలిక్ వివాహం చేసుకున్నాడు. 2010లో సానియా మీర్జా, షోయబ్ మాలిక్‌ల వివాహం జరిగింది. ఆ వివాహ బంధం మొదట బాగానే ఉన్నా కొన్నాళ్ల తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు మొదలు అయ్యాయి. ఆ విభేదాలు తారా స్థాయికి చేరడంతో షోయబ్ మాలిక్ తో కలిసి జీవితాన్ని సాగించడం సాధ్యం కాదని సానియా మీర్జా నిర్ణయానికి వచ్చి విడాకులు తీసుకున్న విషయం తెల్సిందే.
సానియా మీర్జా మాజీ భర్త విడాకులు..!
సానియా మీర్జా విడాకుల సమయంలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. షోయబ్ మాలిక్ ఆ సమయంలో సానియా మీర్జా గురించి తప్పుడు ప్రచారం చేశాడు అంటూ పుకార్లు షికార్లు చేశాయి. సానియా అతడి నుంచి సైలెంట్‌గా బయట పడింది. బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత కూడా సోయబ్ మాలిక్ ను సానియా మీర్జా వదిలింది అంటే అతడి తీరు ఏంటో అర్థం చేసుకోవచ్చు. సానియా మీర్జా ప్రస్తుతం తన జీవితాన్ని సాఫీగా సాగిస్తోంది. సానియా మీర్జాతో విడాకుల తర్వాత షోయబ్ ఏమాత్రం గ్యాప్ ఇవ్వకుండా కొత్త జంటను వెతుక్కున్నాడు. ఆమెతో గత కొన్నాళ్లుగా జీవితంను సాగిస్తున్నాడు. అయితే సానియా మీర్జాతో విడాకులు కాకముందు నుంచే షోయబ్ మాలిక్ కి సనా జావేద్ తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, విడాకులకు ఆమె ఒక కారణం అనే ప్రచారం ఆ మధ్య జరిగిన విషయం తెల్సిందే.
షోయబ్ మాలిక్, సనా జావేద్ విడాకులు
ఇటీవల ఒక కార్యక్రమంలో షోయబ్ మాలిక్, సనా జావేద్‌లు కలిసి పాల్గొన్నారు. సమయంలో షోయబ్ మాలిక్‌తో అంటీ ముట్టనట్లుగా సనా జావేద్ కనిపించింది. అంతే కాకుండా అతడు చేయి పట్టుకునేందుకు ప్రయత్నించిన పలు సార్లు ఆమె విడిపించుకునేందుకు ప్రయత్నించింది. దాంతో ఇద్దరి మధ్య వ్యవహారం సరిగా లేదని, ఇద్దరూ ఏ క్షణంలో అయినా విడాకులు తీసుకునే అవకాశం ఉంది అంటూ సోషల్ మీడియాలో ముఖ్యంగా పాకిస్తాన్ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో షోయబ్ మాలిక్ సన్నిహితుల నుంచి ఇద్దరి మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. భార్య భర్తలు అన్నప్పుడు చిన్నా చితకా గొడవలు ఉండటం చాలా సహజం, వాటిని మరీ ఇంత పెద్దగా చేసి చూడాల్సిన అవసరం లేదు అంటూ వారు సున్నితంగా పాక్ సోషల్ మీడియా రాతలకు సమాధానం ఇస్తున్నారు.
పాకిస్తాన్ క్రికెటర్ పై విమర్శలు
పెళ్లి అయి కనీసం రెండు ఏళ్లు కూడా కాకుండానే అప్పుడే వీరు విడిపోతారు అంటూ వస్తున్న వార్తలు షోయబ్ మాలిక్ అభిమానులను కలవరానికి గురి చేస్తున్నాయి. ఇదే సమయంలో ఇండియాలోనూ అతడి గురించి తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ముఖ్యంగా సానియా మీర్జాను అమితంగా ఇష్టపడే వారు, ఆమె ఆటను ఆరాధించే వారు చాలా మంది షోయెబ్ మాలిక్ తీరును తీవ్రంగా తప్పుబడుతున్నారు. ఒక వ్యక్తి మూడు సార్లు విడాకులు తీసుకున్నాడు అంటే ఖచ్చితంగా అది అతని జీవిత భాగస్వామ్యుల తప్పు కాదని, తప్పు అతని వద్ద ఉందని అంటున్నారు. ఒకరు కాకుంటే ఒకరు అయినా మంచి భార్య ఉండే ఉంటారు. అయన మంచోడు కాకపోవడం వల్లే ఇలా విడాకుల మీద విడాకులు అంటున్నారు. అయితే మూడో విడాకుల గురించి మరింత క్లారిటీ మరికొన్ని నెలల్లో వచ్చే అవకాశం ఉంది.