మూడు రోజులు స్నానం చేయ‌ని న‌టుడు!

శాండిల్ వుడ్ లో శివ‌రాజ్ కుమార్ ఎంత పెద్ద స్టార్ అన్న‌ది చెప్పాల్సిన ప‌నిలేదు. కొంత కాలంగా ప‌రిశ్ర‌మ‌ని ఏల్తోన్న న‌టుడు;

Update: 2025-05-25 10:59 GMT

శాండిల్ వుడ్ లో శివ‌రాజ్ కుమార్ ఎంత పెద్ద స్టార్ అన్న‌ది చెప్పాల్సిన ప‌నిలేదు. కొంత కాలంగా ప‌రిశ్ర‌మ‌ని ఏల్తోన్న న‌టుడు. హీరోగా క‌న్న‌డ లో త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన ఇమేజ్ ఉంది. అక్క‌డ ద‌ర్శ‌కులంతా శివ‌న్న‌తో ఒక్క సినిమా అయినా చేయాల‌ని క్యూ క‌డుతుంటారు. ఎంతో గొప్ప వ్య‌క్తిత్వం ఉన్న న‌టుడు. ఎంతో డౌన్ టూ ఎర్త్ ఉంటాడు. తానో పెద్ద స్టార్ కొడుకైనా...తాను పెద్ద స్టార్ అయినా ఆ భావ‌న ఎక్కడా చూపించరు.

సామాజిక కార్య‌క్ర‌మాల్లోనూ ముందుంటారు. `జైల‌ర్` సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల్ని అల‌రించారు. అందులో సీరియ‌స్ లుక్ అండ్ రోల్ శివ‌న్న‌కు ఇక్క‌డా మంచి క్రేజ్ ను తీసుకొచ్చింది. తాజాగా జ‌రిగిన `థ‌గ్ లైఫ్` ఈవెంట్ కు శివ‌న్న అతిధిగా హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా క‌మ‌ల్ హాస‌న్ పై త‌న‌కున్న అభిమానాన్ని మ‌రోసారి చాటుకున్నారు. `నా చిన్న త‌నంలో నాన్న‌ను క‌ల‌వ‌డానికి క‌మ‌ల్ హాస‌న్ గారు ఓసారి మా ఇంటి కొచ్చారు.

అప్పుడు నాన్న ప‌రిచ‌యం చేసారు. అప్పుడే క‌మ‌ల్ స‌ర్ ని హ‌త్తుకున్నా. అది జ్ఞాప‌కంగా మిగిలిపోవాల‌ని మూడు రోజుల పాటు స్నానం చేయ‌డం మానేసాను. చేస్తే ఆయ‌న నా నుంచి దూరమ‌వుతారు అన్న‌ ఫీలింగ్ తో. ఆయ‌న అంటే అంత ఇష్టం` అన్నారు. అంత‌కు ముందు మ‌రో స‌మావేశంలో కూడా క‌మ‌ల్ పై ఇంత‌కు మించిన అభిమానం చాటుకున్నారు. `క‌మ‌ల్ హాస‌న్ అంటే అందం. అమ్మాయిగా పుట్టి ఉంటే ఆయ‌న్నే పెళ్లి చేసుకునే వాడిని.

ఇప్ప‌టి వ‌ర‌కూ క‌మ‌ల్ హాస‌న్ న‌టించిన ఏ సినిమా మిస్ కాలేదు. అదీ తొలి షో త‌ప్ప‌కుండా చూస్తాను. అయ‌న ఇప్ప‌టికీ ఎంతో పిట్ గా యంగ్ గా క‌నిపిస్తారు. అలా క‌నిపించాల‌ని నేను ట్రై చేసాను . కానీ నా వ‌ల్ల కాలేదు. ఆయ‌న చాలా డిసిప్లెన్ గా ఉంటారు. అందుకే అలా మెయింటెన్ చేయగ‌ల్గుతున్నారన్నారు.

Tags:    

Similar News