శివనామస్మరణ తో ఇండియా మోతెక్కాల్సిందే!
శివయ్యపై సినిమాలు కొత్తేం కాదు. శివుడిపై నాటి రోజుల్లో ఎన్నోహిట్ చిత్రాలున్నాయి.;
శివయ్యపై సినిమాలు కొత్తేం కాదు. శివుడిపై నాటి రోజుల్లో ఎన్నోహిట్ చిత్రాలున్నాయి. ఆ తర్వాత కాలంలో ట్రెండ్ కు తగ్గట్టు శివయ్యపై సినిమాలొచ్చాయి. అయితే ఇప్పుడు మరింత అడ్వాన్స్ గా శివనాస్మరణను టాలీవుడ్ ఎన్ క్యాష్ చేసుకుంటుంది. పౌరాణిక-ఫాంటసీ చిత్రాలు ట్రెండ్ గా మారడంతో? శివయ్యను ఎక్కువగా హైలైట్ చేస్తున్నారు. ఇటీవలే తమన్నా నటించిన `ఓదెల2` అలాంటి కాన్సెప్ట్ తోనే తెరకెక్కింది.
అలాగే `శివం భజే` శివుడు కీలకంగా రూపొందింది. ఈ రెండు ఈ మధ్య కాలంలో రిలీజ్ అయి మంచి ఫలితాలు సాధించాయి. తాజాగా పాన్ ఇండియాలో శివ నామస్మరణకు రంగం సిద్దమవుతోంది. మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా `కన్నప్ప` ప్రాజెక్ట్ ను పట్టాలెక్కించిన సంగతి తెలిసిందే. మంచు ఫ్యామిలీకి ఈ సినిమా ఓ డ్రీమ్ ప్రాజెక్ట్. ఎంతో కాలంగా కన్నప్ప తీయాలని ప్లాన్ చేసుకుని చిరవిగా ఈ ఏడాది రిలీజ్ కి రెడీ అవుతోంది.
ఇందులో శివును భక్తుడు కన్నప్ప కథ ఆధారంగా తెరకెక్కింది. భారీ కాన్సాస్ పై రూపొందుతున్న చిత్ర మిది. ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, మోహన్ బాబు, మధు ప్రీతి ముకుందన్ లాంటి స్టార్లు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలతో సినిమాకు పాజిటివ్ బజ్ మొదలైంది. సిజీ పనులు ఆలస్యమవుతోన్న నేపథ్యంలో రిలీజ్ డిలే అవుతోంది. జూన్ 27న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.
అలాగే పాన్ ఇండియాలో నటసింహ బాలకృష్ణ నటిస్తోన్న `అఖండ2` మరింత ప్రతిష్టాత్మకంగా రిలీజ్ అవుతుంది. బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తోన్న చిత్రంలో బాలయ్య అఘోరిపాత్రలో విశ్వరూపం చూపించబోతున్నారు. ప్రత్యేకంగా కుంభమేళా కూడా కలిసి రావడంతో? అక్కడ సన్నివేశాలు సినిమాకు హైలైట్ గా ఉంటాయని యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. అఘోర పాత్రలో బాలయ్య నట విశ్వరూపం చూపిస్తారని అంచనాలు భారీగా ఉన్నాయి. అలాగే సుధీర్ బాబు హీరోగా నటించిన జఠాధర కూడా శివుడి కాన్సెప్ట్ ని ఆధారంగా చేసుకునే తెరకెక్కించారు. ఇంకా యంగ్ హీరోలు సాయి శ్రీనివాస్ నటిస్తోన్న `హైంధవ`, అరవింద్ కృష్ణ నటిస్తోన్న `ఎ మాస్టర్ పీస్` శివుడి కథ ఆధారంగా తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.