నాగ్ 'శివ' 4k కంటెస్ట్.. గెలిస్తే ఏం చేస్తారో తెలుసా?

టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున, డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కాంబినేషన్ లో వచ్చిన శివ మూవీ ఎలాంటి విజయం సాధించిందో తెలిసిందే.;

Update: 2025-09-23 12:03 GMT

టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున, డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కాంబినేషన్ లో వచ్చిన శివ మూవీ ఎలాంటి విజయం సాధించిందో తెలిసిందే. 1989లో రిలీజ్ అయిన ఆ సినిమా ఐకానిక్ కల్ట్ క్లాసిక్ స్టేటస్ ను సొంతం చేసుకుంది. ఇప్పుడు 36 ఏళ్ల తర్వాత 2025 నవంబర్ 14వ తేదీన 4K డాల్బీ అట్మాస్ క్వాలిటీతో రీ రిలీజ్ కానుంది.

కొన్ని రోజుల క్రితం శివ మూవీ రీ రిలీజ్ కు సంబంధించిన టీజర్ ను రిలీజ్ చేసిన నాగార్జున.. రీసెంట్ గా విడుదల తేదీని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు సినిమా నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్ స్పెషల్ కాంపిటీషన్ నిర్వహిస్తుంది. ఈ మేరకు తాజాగా ఇన్విటేషన్ అందించగా.. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

శివ మూవీకి సంబంధించిన వీడియోలు, పోస్టర్లలను తమ సొంత వెర్షన్‌ లతో క్రియేట్ చేయండంటూ ఒక ప్రత్యేక పోటీని ప్రకటించింది అన్నపూర్ణ స్డూడియోస్ సంస్థ. ఆ తర్వాత వీడియో ఎడిట్‌లు, పోస్టర్ డిజైన్లతోపాటు కాన్సెప్ట్ ఆర్ట్‌ వర్క్‌ లను Shiva 4K Contest ద్వారా ఎక్స్ లేదా ఇన్ స్టాగ్రామ్ లో అప్లోడ్ చేయమని పిలుపునిచ్చింది.

ఆ సమయంలో అన్నపూర్ణ స్టూడియోస్‌ ను ట్యాగ్ చేయాలని తెలిపింది. అదే సమయంలో పోటీలో గెలిచిన మొదటి ముగ్గురు విజేతలకు స్పెషల్ ఆఫర్ ను ప్రకటించింది. విన్నర్స్ కు నాగార్జున, ఆర్జీవీను కలిసే ప్రత్యేక అవకాశం కల్పించనున్నామని తెలిపింది. ఎంట్రీలను వచ్చే నెల అక్టోబర్ 20వ తేదీ వరకు పంపగలరని కూడా చెప్పింది.

అయితే ఆలస్యం చేయకుండా క్రియేటివిటీకి పదును పెట్టండని కూడా అన్నపూర్ణ స్టూడియోస్ కోరింది. ఇప్పుడు సోషల్ మీడియాలో నెటిజన్లు స్పందిస్తున్నారు. క్రియేటర్స్ కు మంచి అవకాశమని చెబుతున్నారు. వాటిపై ఇంట్రెస్ట్ ఉన్నవారు సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు. మరి కాంపిటేషన్ లో ఎవరు విజేతలుగా నిలుస్తారన్నది ఆసక్తికరం.

కాగా, సినిమా విషయానికొస్తే.. నాగార్జున సరసన అమల హీరోయిన్ గా నటించారు. రఘువరన్ విలన్ పాత్రలో యాక్ట్ చేశారు. రామ్ గోపాల్ వర్మ దర్శకుడిగా పరిచయమైన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే హిట్ గా నిలిచింది. మూవీలోని నాగార్జున సైకిల్ చైన్ లాగే సన్నివేశానిక స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇప్పటికీ అది ఎవర్ గ్రీనే. మరి 4K ఫార్మాట్ లో సరికొత్తగా ప్రేక్షకుల ముందుకు రానున్న శివ మూవీ ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి.

Tags:    

Similar News