మరదలకి బావ సినిమాలో ఛాన్స్ ఎప్పుడు?
సూపర్ స్టార్ మహేష్ సతీమణి నమ్రతా శిరోద్కర్ చెల్లెలు శిల్పా శిరోద్కర్ టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇస్తోన్న సంగతి తెలిసిందే.;
సూపర్ స్టార్ మహేష్ సతీమణి నమ్రతా శిరోద్కర్ చెల్లెలు శిల్పా శిరోద్కర్ టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇస్తోన్న సంగతి తెలిసిందే. సుధీర్ బాబు హీరోగా నటిస్తోన్న `జఠాధర` సినిమాతో శిల్ప కంబ్యాక్ అవుతున్నారు. మూడు దశాబ్దాల క్రితం `బ్రహ్మ` అనే తెలుగు సినిమాలో నటించిన శిల్పా ఆ తర్వాత మళ్లీ తెలుగు సినిమాల్లో నటించలేదు. అవకాశాలు రాకపోవడంతో నటించలేదని శిల్పా రివీల్ చేయడం జరిగింది. తాజాగా సుధీర్ బాబు సినిమా వెనుకాల ప్రత్యక్షంగానో...పరోక్షంగానో మహేష్ అండ్ కో ఉండే ఉంటారు? అనే సందేహం ఉంది. ప్రత్యేకించి సుదీర్ బాబు కి స్వయానా మహేష్ బావమరిది.
సొంత సంస్థలో ఛాన్స్ ఛాన్స్ చేతిలోనే:
ఈ నేపథ్యంలో ఛాన్స్ మహేష్ రిఫరెన్స్ తోనే అనే సందేహం ఉంది. లేదంటే 30 ఏళ్ల క్రితం నటిని ఇప్పుడెందుకు మళ్లీ తెరపైకి తెస్తారు? ఈ సినిమా ప్రచార కార్యక్రమాల్లోనూ మహేష్ భాగమైన సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ చిత్రం విడుదల కానుంది. ఆ సంగతి పక్కన బెడితే బావ మహేష్ తన సినిమాలో మరదలకి ఛాన్స్ ఎప్పుడు? ఇస్తారు? అన్నది ఇంట్రెస్టింగ్. బావ టాలీవుడ్ లో పెద్ద హీరో. నమ్రతా శిరోద్కర్ సొంతంగా ఓ బ్యానర్ కూడా స్థాపించి అందులో సినిమాలు చేస్తున్నారు. ఎంతో మందికి సొంత సంస్థలో అవకాశాలు కల్పి స్తున్నారు.
బావ ఇస్తే మంచి ఛాన్సే:
అలాంటింది ఇంట్లో నటికి అవకాశాలు ఇవ్వకపోతే ఎలా? ఈరోజు కాకపోతే రేపైనా రాకపోదుగా. కానీ మహేష్ సినిమాలో అవకాశం అంత సులభం కాదు. బావ సినిమాలో ఛాన్స్ ఇస్తే ఆ రోల్ కాస్త పెద్దదై ఉండాలి. ప్రత్యేకంగా గుర్తించదగినదై ఉండాలి. చిన్న చితకా రోల్ ఇస్తే బావ సినిమాలో చిన్న పాత్ర ఏంటి? అనే విమర్శలు ఎదుర్కోవాలి. అలాగని పెద్ద పాత్రకు ఛాన్స్ అంత సులభం కాదు. పైగా మహేష్ ఇప్పుడు పాన్ ఇండియాలో సినిమాలు చేస్తున్నారు. వాటిలో అవకాశం అంటే ఎన్నో విషయాలు పరిగణలోకి తీసుకుంటారు.
అలా అవకాశాలు కల్పించినా సంతోషమే:
మహేష్ కూడా తొందరగా చొరవ తీసుకుని రిఫరెన్స్ ఇవ్వలేరు. ఈ విషయంలో మహేష్ తో పనిచేసే దర్శకులు ఆలోచిస్తేనే పనవుతుంది. ప్రస్తుతం శిల్పా శిరోద్కర్ కి బాలీవుడ్ లో కూడా ఛాన్సులు రాలేదు. అక్కడ అవకాశాలు రాకపోవడంతోనే రకరకాల షోలు చేస్తుంది. ఈ నేపథ్యంలోనే `జఠాధర`లో ఛాన్స్ అందుకుంది. ఈ విజయం తర్వాత నటిగా బిజీ అవ్వాలని ఆశపడుతుంది. మరి ఆమె కోరిక నేపథ్యంలో మహేష్ తన సినిమాలో కాకపోయినా? సొంత బ్యానర్లో నిర్మించే చిన్న సినిమాల్లో అవకాశం ఇచ్చినా సంతృప్తికరమే.