బ్రెస్ట్ ఇంప్లాంట్స్‌తో నటికి సైడ్ ఎఫెక్ట్స్
తనకు బ్రెస్ట్ ఇంప్లాంట్స్ ని తొలగించే వైద్యులకు శక్తినివ్వాలని కూడా షెర్లిన్ దేవుడిని ప్రార్థించింది. 2023లో నా నిజ రూపంతో కనిపించడానికి నా ముఖం నుండి అన్ని ఫిల్లర్లను తొలగించాను.;
షెర్లిన్ చోప్రా బోల్డ్ పెర్ఫామెన్సెస్, దూకుడైన నిర్ణయాలు ఎప్పుడూ వివాదాలను మోసుకొస్తుంటాయి. ఇప్పుడు షెర్లిన్ ఒక పెద్ద నిర్ణయం తీసుకుంది. గతంలో బ్రెస్ట్ ఇంప్లాంట్ సర్జరీ చేయించుకున్న ఈ బ్యూటీ, ఇప్పుడు వాటిని పూర్తిగా తొలగించుకున్నట్టు వెల్లడించింది. తాజా చాటింగ్ సెషన్ లో తన కఠిన నిర్ణయం వెనుక ఉన్న కారణాన్ని వివరిస్తూ ఇన్‌స్టాలో ఒక వీడియోను పోస్ట్ చేసింది. దీనిలో షెర్లిన్ చోప్రా ఆసుపత్రిలో తన శారీరక ఆరోగ్య సమస్యల గురించి మాట్లాడుతూ కనిపించింది.
వైద్య పరీక్షలు, నిపుణుల సంప్రదింపుల తర్వాత తన అనారోగ్యాల వెనక `భారీ బ్రెస్ట్ ఇంప్లాంట్లు` ప్రధాన కారణమని గ్రహించినట్టు తెలిపింది. గత రెండు నెలలుగా, నేను దీర్ఘకాలిక వెన్ను, మెడ, ఛాతీ, భుజం నొప్పిని ఎదుర్కొన్నాను. నా ఛాతీ ప్రాంతంలో నిరంతర ఒత్తిడిని ఫేస్ చేసాను. వైద్య నిపుణులతో సంప్రదింపుల తర్వాత నా దీర్ఘకాలిక నొప్పికి కారణం ..నా భారీ బ్రెస్ట్ ఇంప్లాంట్లు అని గ్రహించానని తెలిపింది. కాబట్టి ఉత్తమ ప్రయోజనాల దృష్ట్యా నా జీవితంలో చురుకుదనం, తేజస్సు, శక్తిని పునరుద్ధరించడానికి, నా బ్రెస్ట్ ఇంప్లాంట్‌లను ఒకేసారి తొలగించాలని నిర్ణయించుకున్నాను! అని తెలిపింది.
తనకు బ్రెస్ట్ ఇంప్లాంట్స్ ని తొలగించే వైద్యులకు శక్తినివ్వాలని కూడా షెర్లిన్ దేవుడిని ప్రార్థించింది. 2023లో నా నిజ రూపంతో కనిపించడానికి నా ముఖం నుండి అన్ని ఫిల్లర్లను తొలగించాను. ఈరోజు అదనపు లగేజ్ లేకుండా జీవితాన్ని గడపడానికి బ్రెస్ట్ ఇంప్లాంట్ తొలగింపు శస్త్రచికిత్స చేయించుకుంటున్నాను. ఈ పోస్ట్ ఫిల్లర్లు లేదా సిలికాన్ ఇంప్లాంట్లు వేసుకునే వారిని విమర్శించను. నేను నాలా ఉండాలనే ఉద్దేశంతోనే ఇదంతా చెబుతున్నాను అని చెప్పింది షెర్లిన్.
గత ఏడాది కాస్మోటిక్స్ సర్జరీ కారణంగా తన గడ్డం అసమానంగా పొడవుగా మారిందని ఆవేదన వ్యక్తం చేసింది. తన పెదవులు ట్రిపుల్ ఎక్స్ ఎల్ సైజుకి పెరిగాయని, దవడలు అసహజంగా మారాయని, బుగ్గలు భారీగా ఉబ్బిపోయాయని కూడా షెర్లిన్ ఆవేదన చెందింది. షెర్లిన్ డీటెయిలింగ్ ని బట్టి సౌందర్య శస్త్ర చికిత్సలతో చాలా సమస్యలు ఉంటాయని అర్థం చేసుకోవచ్చు. షెర్లిన్ చోప్రా `ఏ ఫిలిం బై అరవింద్` అనే బ్లాక్ బస్టర్ చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. తెలుగు పరిశ్రమతో పాటు హిందీలోను నటనలో కొనసాగింది. అయితే ఇటీవల పూర్తిగా డీగ్రేడ్ సినిమాల్లో నటిస్తూ మనుగడను కొనసాగిస్తోంది. ఇంతకుముందు రాజ్ కుంద్రా నీలిచిత్రాల యాప్ ల వ్యవహారంలోను షెర్లిన్ పేరు ప్రముఖంగా వినిపించింది.