కమ్ముల సర్‌ మరోసారి ఆ జోనర్ టచ్ చేస్తున్నాడా ?

శేఖర్‌ కమ్ముల తాజా చిత్రం కుబేర సినిమాను నిర్మించిన నిర్మాతలతోనే మరో సినిమా ఉంటుందట. ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.;

Update: 2025-07-19 16:30 GMT

శేఖర్ కమ్ముల సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టి ఇటీవల పాతిక సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. 2000 సంవత్సరంలో ఆయన దర్శకత్వంలో రూపొందిన 'డాలర్‌ డ్రీమ్స్‌' సినిమా వచ్చింది. ఈ పాతికేళ్ల సినీ కెరీర్‌లో కమ్ముల నుంచి వచ్చిన సినిమాలు కేవలం 11 మాత్రమే. రెండో సినిమాను చేయడానికి దాదాపుగా నాలుగు ఏళ్ల సమయం తీసుకున్న శేఖర్‌ కమ్ముల ఆ తర్వాత కాస్త స్పీడ్‌ పెంచాడు. ప్రతి సినిమాకు యావరేజ్‌గా రెండేళ్లకు మించి సమయం తీసుకుంటున్నాడు. కానీ ఆయన చివరి మూడు సినిమాలకు ఏకంగా మూడు ఏళ్ల గ్యాప్‌ తీసుకుని మరీ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. 2014లో అనామిక సినిమాతో శేఖర్‌ కమ్ముల ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే.

అనామిక తర్వాత ఫిదా ను తీసుకు వచ్చేందుకు ఏకంగా మూడు ఏళ్లకు పైగానే సమయం తీసుకున్నాడు. 2017లో ఫిదా మూవీ వచ్చింది, ఫిదా సూపర్‌ హిట్‌ అయినప్పటికీ లవ్‌ స్టోరీని తీసుకు రావడానికి మళ్లీ మూడు ఏళ్ల సమయం పట్టింది. 2021లో నాగ చైతన్య, సాయి పల్లవిల లవ్‌ స్టోరీ వచ్చింది. ఆ సినిమా సైతం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ వెంటనే ధనుష్‌తో సినిమాను అనౌన్స్‌ చేశాడు. కానీ మేకింగ్‌కు చాలా సమయం పట్టడంతో ఆలస్యం అయింది. లవ్‌ స్టోరీ వచ్చిన మూడు ఏళ్ల తర్వాత 'కుబేర' సినిమాతో శేఖర్‌ కమ్ముల వచ్చాడు. మొత్తంగా గత పదేళ్లలో ఆయన నుంచి వచ్చిన సినిమాలు కేవలం మూడు మాత్రమే.

కుబేర సూపర్‌ హిట్‌ కావడంతో వెంటనే ఆయన నుంచి సినిమాను ప్రేక్షకులు, అభిమానులు ఆశిస్తున్నారు. కానీ ఆయన మాత్రం ఇప్పటి వరకు తదుపరి సినిమా గురించి లీడ్‌ ఇవ్వలేదు. అధికారికంగా ప్రకటన చేయలేదు, కానీ లవ్‌ స్టోరీతో ఆయన తదుపరి సినిమా రాబోతుందనే వార్తలు వస్తున్నాయి. శేఖర్ కమ్ముల ఏ స్టోరీతో వచ్చినా ఖచ్చితంగా బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షం ఖాయం. కానీ ఆయన ప్రతి సినిమాకు మూడు ఏళ్ల సమయం తీసుకుంటున్న నేపథ్యంలో ఆయన తదుపరి సినిమాను చూడాలంటే 2028 వరకు వెయిట్‌ చేయాల్సి రావచ్చు అంటున్నారు. శేఖర్‌ కమ్ముల వెంటనే లవ్‌ స్టోరీ సినిమాను మొదలు పెట్టి వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని ఫ్యాన్స్ రిక్వెస్ట్‌ చేస్తున్నారు.

శేఖర్‌ కమ్ముల తాజా చిత్రం కుబేర సినిమాను నిర్మించిన నిర్మాతలతోనే మరో సినిమా ఉంటుందట. ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఇప్పటికే కథ రెడీ అయిందని, స్క్రిప్ట్‌ వర్క్‌ జరుగుతుందని అంటున్నారు. కానీ అధికారికంగా మాత్రం ఎలాంటి సమాచారం లేదు. దాంతో ఇండస్ట్రీ బయట వారు శేఖర్‌ కమ్ముల మళ్లీ సినిమా మొదలు పెట్టడానికి కనీసం ఏడాది సమయం తీసుకుంటాడు, విడుదల చేయడానికి కనీసం రెండేళ్ల సమయం తీసుకుంటాడు. కనుక మొత్తంగా మూడు ఏళ్ల పాటు కమ్ముల సినిమా కోసం వెయిట్ చేయాల్సిందే అని అంటున్నారు. ప్రతిభావంతులు అయిన దర్శకులు ఇలా ఒక్క సినిమాకి ఏళ్లకు ఏళ్లు సమయం తీసుకుంటే ఇండస్ట్రీ మనుగడ ఎలా అంటూ కొందరు విమర్శిస్తున్నారు. శేఖర్‌ కమ్ముల నిజంగానే మళ్లీ మూడేళ్లు తీసుకుంటాడా అనేది చూడాలి. 

Tags:    

Similar News