శేఖర్ కమ్ముల సినిమాలోని హీరోల్లో ఉండే కామన్ పాయింట్స్ ఇవేనా...

ఆయన సినిమాల్లోని హీరోలు మన పక్కింటి కుర్రాడిలా ఉంటారు. మనం మన నిజ జీవితంలో ఎలా ఉంటామో ఆయన సినిమాల్లోని హీరోలు కూడా అలానే ఉంటారు.

Update: 2026-10-01 03:58 GMT

కొన్ని సినిమాలు చూసినప్పుడు ప్రేక్షకుడిలో తెలియని ఒక అనుభూతి కలుగుతుంది. అలాంటి సినిమాలను రిపీటెడ్ గా చూడటానికి ప్రేక్షకులు ఇష్టపడుతుంటారు. అందులో శేఖర్ కమ్ముల మూవీస్ కూడా ఒకటి కావడం విశేషం... 'ఆనంద్' సినిమాతో దర్శకుడిగా తన మార్కు చూపించిన శేఖర్ కమ్ముల ఆ తర్వాత 'గోదావరి', 'హ్యాపీడేస్' లాంటి సినిమాలతో హ్యాట్రిక్ విజయాలను తన ఖాతాలో వేసుకున్నాడు. తన సినిమాల్లోని హీరోల పాత్రలు చాలా సాఫ్ట్ గా ఉంటాయి. అలాగే ఆ హీరోల పాత్రల్లో మనకు కొన్ని కామన్ పాయింట్స్ అయితే కనిపిస్తుంటాయి.

చూడగానే నచ్చేస్తారు

ఆయన సినిమాల్లోని హీరోలు మన పక్కింటి కుర్రాడిలా ఉంటారు. మనం మన నిజ జీవితంలో ఎలా ఉంటామో ఆయన సినిమాల్లోని హీరోలు కూడా అలానే ఉంటారు. వాళ్ళ బిహేవియర్ కూడా చాలా సున్నితంగా ఉంటుంది. ఎవ్వరిని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళకి ఏం కావాలో దానిని దక్కించుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఆయన సినిమాల్లోని పాత్రలు మనకు ఆల్ టైం ఫేవరేట్ గా నిలిచిపోతాయి...ఇక 'హ్యాపీ డేస్' మూవీలో 'వరుణ్ సందేశ్' పోషించిన చందు పాత్ర యంగ్ ఏజ్ లో ఉన్న కుర్రాడు ఎలా ఆలోచిస్తాడో పర్ఫెక్ట్ గా ఆయన క్యారెక్టర్ తెలియజేస్తుంది. ఒకరకంగా పర్ఫెక్ట్ స్టూడెంట్ ఎలా ఉంటాడో ఆయన క్యారెక్టర్ లో చూపించారు. నిఖిల్ పోషించిన రాజేష్ పాత్ర స్టూడెంట్స్ లో ఉండే ఆ దూకుడు తనాన్ని చూపిస్తుంది. ఇలా ఆయన పాత్రలను మలుచుకున్న తీరు కూడా బాగుంటుంది.

ఆడవాళ్ళ ఇష్టాలను గౌరవించడం

శేఖర్ కమ్ముల అన్ని సినిమాల్లో హీరోలు ఆడవాళ్ళకు ఎక్కువ గౌరవాన్ని ఇస్తారు. ఇక హీరోయిన్లు సైతం ఒకరి మీద డిపెండ్ అవ్వడానికి ఇష్టపడరు వాళ్ళు ఇండిపెండెట్ గా బతకడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు... ఉదాహరణకు ఫిదా సినిమాలో భానుమతి క్యారెక్టర్ తను బాగా చదువుకుని వాళ్ల నాన్న ను బాగా చూసుకోవాలనుకుంటుంది. అలాగే హీరో సైతం ఆమె ఇష్టాలను గౌరవించే వ్యక్తిగా కనిపిస్తాడు... శేఖర్ కమ్ముల హీరోలు అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తించరు...

అలాగే వాళ్లు రియాలిటికి చాలా దగ్గరగా ఉంటారు. కోపం వస్తే అరుస్తారు మళ్ళీ కామ్ అయిపోతారు. ఇక వాళ్ళు ఎదుర్కొంటున్న పరిస్థితులను బట్టి ఏదైనా బాధ వస్తే ఏడుస్తారు. వాళ్ళ తప్పు ఉంటే హీరోయిన్ కి సైతం ఒకటికి పది సార్లు సారీ చెప్తారు. ఆయన సినిమాల్లో హీరో అంటే చాలా గొప్ప వ్యక్తి లాగా ఏమి చూపించడు తను కూడా సినిమాలో ఒక పాత్ర మాత్రమే అనేలా ఆయన తీర్చిదిద్దుతాడు... అలాగే హీరో చాలా బాగా చదువుకొని సమాజం పట్ల సామాజిక స్పృహతో ఉంటాడు. ఎంతటి పెద్ద సమస్య అయినా సరే చాలా క్లియర్ గా పరిష్కరిస్తారు... కుటుంబం పట్ల చాలా బాధ్యత కలిగి ఉంటారు...ఇవన్నీ ఆయన సినిమాలో హీరో క్యారెక్టర్లకు ఉండే లక్షణాలు...

Tags:    

Similar News