ముక్కుపుడక మింగేసిన నటి.. ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందంటే?

ప్రత్యేకించి గత రెండు మూడు నెలలుగా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో హీరోలు, హీరోయిన్లు వరుసగా ప్రమాదాలకు గురవుతూ అభిమానులను ఆందోళనలకు గురి చేస్తున్నారు.

Update: 2026-08-11 18:14 GMT

ప్రత్యేకించి గత రెండు మూడు నెలలుగా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో హీరోలు, హీరోయిన్లు వరుసగా ప్రమాదాలకు గురవుతూ అభిమానులను ఆందోళనలకు గురి చేస్తున్నారు. ఇప్పటికే బాలకృష్ణ, రామ్ చరణ్ , వరుణ్ తేజ్ , ఎన్టీఆర్ ఇలా వరుస పెట్టి హీరోలు ఒకరి తర్వాత ఒకరు షూటింగ్ సెట్లో గాయాల పాలవుతున్న విషయం తెలిసిందే. మరొకవైపు ప్రముఖ హీరోయిన్ రష్మిక మందన్న కూడా ఇలా గాయాలపాలవడంతో ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు.

ముఖ్యంగా సినిమాల్లో తమ పాత్రను సహజంగా చూపించేందుకు చేసే ప్రయత్నాలలో అనుకోని ఘటనలు వారిని ఇబ్బందుల్లోకి నెట్టేస్తున్నాయి. అయితే ఇప్పుడు మరో ప్రముఖ నటికి చేదు అనుభవం ఎదురయ్యింది. పొరపాటున ముక్కుపుడక మింగేసింది. ఇందుకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అసలు ఆమె ఎవరు? ఎలా మింగింది? అసలేం జరిగింది? అంటూ సోషల్ మీడియా వేదికగా ఆరా తీస్తున్నారు.

ఆమె ఎవరో కాదు ప్రముఖ నటి, గాయని షెహ్నాజ్ గిల్. ప్రస్తుతం ఆమె నటిస్తున్న పంజాబీ చిత్రం ఇష్క్ నామా.. అరవింద్ ఖైర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమా షూటింగ్లో భాగంగా ఒక సీన్ కోసం ఆమె వేగంగా పరిగెత్తుతుండగా.. ముక్కుకున్న పుడక అనుకోకుండా ఊడి నోట్లోకి జారిపోయింది. ఈ ఘటనతో ఆమె ఒక్కసారిగా ఉక్కిరిబిక్కిరి అయ్యారు. తీవ్రమైన దగ్గుతో ఇబ్బంది పడుతున్న ఆమె.. పక్కనే ఉన్న సహ నటుడు సౌరభ్ సచ్ దేవా వెంటనే స్పందించారు. వీపుపై కొట్టి సహాయం చేశారు.. ప్రస్తుతం ఆమె సేఫ్ గా ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియోని ఆమె తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేయడంతో ఈ ఘటన కాస్త వెలుగులోకి వచ్చింది.

ఇది చూసిన అభిమానులు షెహ్నాజ్ ఆరోగ్యం పై ఆందోళన వ్యక్తం చేస్తూ.. నటన పట్ల ఆమె చూపిస్తున్న నిబద్ధతకు ప్రశంసిస్తూనే.. షూటింగ్ సమయంలో జరిగే అనుకోని పొరపాట్ల వల్ల ఇబ్బందులు జరగడం సహజమే. నటీనటులు చాలా జాగ్రత్తగా ఉండాలి అంటూ సలహా ఇస్తున్నారు. ఇక ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

ఇష్క్ నామా సినిమా విషయానికొస్తే..భారత్ లోని పంజాబ్ కి చెందిన నిమ్మ అనే సిక్కు కవి, పాకిస్తాన్ పంజాబ్ కు చెందిన నసీం అనే ముస్లిం యువతి మధ్య సరిహద్దుల అతీతమైన ప్రేమ కథగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇందులో షెహ్నాజ్ గిల్, జై రంధావ ప్రధాన పాత్రలు పోషిస్తుండగా.. మహన్ బీర్ భుల్లర్, అంజుమ్ బత్రా, సౌరబ్ సచ్ దేవా తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు.



Tags:    

Similar News