కాంటాలాగా గర్ల్.. 15 ఏళ్లుగా వ్యాధితో పోరాటం..

'కాంటాలాగా...' గ‌ర్ల్ షెఫాలి జ‌రివాలా ఆక‌స్మిక మ‌ర‌ణం అభిమానుల హృద‌యాల‌ను క‌ల‌చివేసిన సంగ‌తి తెలిసిందే.;

Update: 2025-06-28 17:30 GMT

'కాంటాలాగా...' గ‌ర్ల్ షెఫాలి జ‌రివాలా ఆక‌స్మిక మ‌ర‌ణం అభిమానుల హృద‌యాల‌ను క‌ల‌చివేసిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం షెఫాలి పోస్ట్ మార్ట‌మ్ రిపోర్ట్ గురించి పోలీసులు వేచి చూస్తున్నారు. దీనిని వారు అనుమానాస్ప‌ద మ‌ర‌ణంగా భావించి విచారిస్తున్నారు. దీనిపై షెఫాలి భ‌ర్త త్యాగీని పోలీసులు ప్ర‌శ్నించార‌ని తెలుస్తోంది.

అయితే షెఫాలి కుటుంబ స‌భ్యుల స‌మాచారం మేర‌కు..షెఫాలి దాదాపు 15 సంవత్సరాలుగా మూర్ఛ వ్యాధితో పోరాడుతోందని తెలిసింది. త‌న‌ మరణానికి క‌చ్చితమైన కారణం ఇంకా వెల్ల‌డి కాలేదు.. కానీ ఈ సమయంలో ఆమె వైద్య చికిత్స పొందుతున్నట్లు కుటుంబీకులు తెలిపారు. పోలీసు వర్గాల సమాచారం ప్రకారం.. ఈరోజు విచారణ తర్వాత, పోలీసులు షెఫాలి వైద్య చరిత్ర, సంబంధిత పత్రాలను ఆమె కుటుంబం నుండి తీసుకున్నారు. కుటుంబం ఇచ్చిన ప్రకటనలో షెఫాలి సుదీర్ఘ కాలంగా వైద్య చికిత్స పొందుతోంది. ఇది గుండెకు సంబంధించినది కాకపోయినా, ఈ చికిత్స చర్మానికి సంబంధించినదని తెలిసింది.

ఇప్పటికే ఈ అందాల న‌టి చర్మానికి చికిత్స కోసం కొన్ని మందులు తీసుకుంటున్నట్లు చెబుతున్నారు. పోస్ట్‌మార్టం నివేదిక త‌ర్వాత‌ ప్రాథమిక సమాచారం వెల్లడి అవుతుందని, ఆ తర్వాత మరణానికి కారణం ఏమిటో స్పష్టంగా తెలుస్తుందని పోలీసులు చెబుతున్నారు. ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్టుల గురించి వివ‌రాలు వెల్ల‌డి కావాల్సి ఉంటుంది.

గాయ‌నీ గాయ‌కులు మికా సింగ్, రషమి దేశాయ్, కికు శారదా, హిమాన్షి ఖురానా, అలీ గోని త‌దిత‌రులు ఈ నష్టంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. వారి సోషల్ మీడియా ఖాతాలలో కొన్ని ఫోటోల‌ను కూడా షేర్ చేసారు.

Tags:    

Similar News