బాలీవుడ్ విషాదం.. యంగ్ ఏజ్ లో నటి షఫాలీ ఆకస్మిక మరణం
బాలీవుడ్ లో చోటు చేసుకున్న ఒక మరణం ఇండస్ట్రీ వర్గాల్ని విషాదంలో ముంచెత్తుతోంది.;
బాలీవుడ్ లో చోటు చేసుకున్న ఒక మరణం ఇండస్ట్రీ వర్గాల్ని విషాదంలో ముంచెత్తుతోంది. 42 ఏళ్ల యంగ్ ఏజ్ లో నటి షఫాలీ జరివాలా (42) గుండెపోటుతో మరణించారు. శుక్రవారం రాత్రి ఆమె అస్వస్థతకు గురి కావటంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె మరణించినట్లుగా వైద్యులు వెల్లడించారు. కాంటా లగా సాంగ్ ఫేమ్ షఫాలీ జరివాలా ఇక లేరన్న విషయాన్ని జీర్ణించుకోలేని పరిస్థితి. ఆమెకు వివాహమైన భర్త ఉన్నారు.
2005లో వచ్చిన కాంటా లగా రీమిక్స్ సాంగ్ తో కుర్రకారు మనసుల్ని దోచేసిన ఆమె.. ఒక్కసారిగా ఫేమస్ అయ్యారు. అప్పటి నుంచి ఆమెను కాంటా లాగా గర్ల్ గా పిలుస్తుంటారు. సల్మాన్ ఖాన్ సినిమా ముజ్సే షాదీ కరోగా చిత్రంలో ఒక పాత్రను సొంతం చేసుకున్నారు.ఆ తర్వాత ఆమె పలు టీవీ రియాల్టీ షోలలో మెరిసారు.వెబ్ సీరిస్ లోనూ నటించారు. హిందీ బిగ్ బాస్ సీజన్ 13లోనూ ఆమె ఎంట్రీ ఇచ్చారు.2015లో ఆమె పెళ్లి చేసుకున్నారు.
సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే ఆమెకు ఇన్ స్టాలో ఏకంగా 33 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. శుక్రవారం రాత్రి అకస్మాత్తుగా అస్వస్థతకు గురి కావటంతో ఆమె భర్త పరాగ్ త్యాగి ఆమెను అంధేరిలోని బెల్లేవ్యూ ఆసుపత్రికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. ఆమె ఆకస్మిక మరణాన్ని అభిమానులు.. ఇండస్ట్రీ వర్గాలు జీర్ణించుకోలేకపోతున్నాయి. ఆమె మరణంపై సింగర్ మికా సింగ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె మరణం తనను షాక్ కు గురి చేసినట్లుగా పేర్కొన్నారు.