కాంటాలాగా గర్ల్ డెత్ కేసు: 5గం.ల ముందు భర్త ఇలా!
'కాంటాలాగా' ఫేం, నటి షెఫాలి జరివాలా ఆకస్మిక మృతి కలకలం రేపిన సంగతి తెలిసిందే.;
'కాంటాలాగా' ఫేం, నటి షెఫాలి జరివాలా ఆకస్మిక మృతి కలకలం రేపిన సంగతి తెలిసిందే. గుండెపోటుతో షెఫాలి మరణించిందని వార్తలు వచ్చాయి. కానీ ఆ తర్వాత దీనిని పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారని జాతీయ మీడియాల్లో కథనాలొచ్చాయి. షెఫాలి మరణించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వకపోవడం, కుటుంబ సభ్యులు ఆలస్యంగా స్పందించడంతో ఈ కేసులో దర్యాప్తు మొదలైంది.
ప్రస్తుతం ఆమె మృతదేహాన్ని ముంబైలోని కూపర్ ఆసుపత్రికి పోస్ట్‌మార్టం నిర్వహిస్తున్నారు. ఇంతకుముందే భర్త పరాగ్ త్యాగి, ఆమె రాఖీ సోదరుడు హిందూస్థానీ భావు ఆసుపత్రికి వెళుతూ కనిపించారు. వారిద్దరూ అక్కడ ఉన్న ఫోటోగ్రాఫర్లను తప్పించుకుని లోనికి వెళ్లారు.
కాంటాలగా గర్ల్ శుక్రవారం రాత్రి మరణించారు. మృతదేహం అంథేరిలోని తన అపార్ట్మెంట్‌లో లభించింది. ప్రస్తుతం పోస్ట్‌మార్టం జరుగుతోందని ముంబై పోలీసులు తెలిపారు. షెఫాలి మరణించిన కొన్ని గంటల తర్వాత, ఆమె భర్త పరాగ్ త్యాగి మొదటిసారిగా బహిరంగంగా కనిపించాడు.. బాధతో ఉన్నాడు. అయితే అతడి చివరి ఇన్‌స్టా పోస్ట్ .. తన భార్య చనిపోవడానికి కొన్ని గంటల ముందు జిమ్‌లో ఉన్నాడని ధృవీకరించింది. షెఫాలి జరివాలా మరణ వార్త శుక్రవారం రాత్రి ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ వార్త ధృవీకరించబడటానికి ఐదు గంటల ముందు భర్త పరాగ్ త్యాగి జిమ్ నుండి ఒక ఫోటోను పోస్ట్ చేశాడు. నటుడు కం మోడల్ త్యాగి మిర్రర్ సెల్ఫీని షేర్ చేసాడు.
షెఫాలి అస్వస్థతకు గురి కాగానే, భర్త పరాగ్ త్యాగి , ముగ్గురు సన్నిహితులు ముంబైలోని బెల్లేవ్ మల్టీస్పెషాలిటీ ఆసుపత్రికి తరలించారని... అయితే అక్కడికి చేరుకునేలోపే మరణించినట్లు వైద్యులు ధృవీకరించినట్టు కథనాలొచ్చాయి. ఈ మరణానికి కచ్చితమైన కారణం ఇంకా తెలియదు. కుటుంబం లేదా ఆమె ప్రతినిధుల నుండి అధికారిక ప్రకటనలు కూడా రాకపోవడం ఆశ్చర్యపరిచింది.
షెఫాలి ఇంటి వద్ద సెక్యూరిటీ నుంచి కొన్ని వివరాలు తెలిసాయి. ఆ రాత్రి జరిగిన సంఘటనలను నివాస సంఘం వాచ్‌మెన్ శత్రుఘన్ వివరించారు. శుక్రవారం రాత్రి 10:30 గంటల ప్రాంతంలో షెఫాలిని ఆసుపత్రికి తీసుకెళ్లారని ఆయన తెలిపాడు. అయితే షాక్‌లో ఉన్న ఆయన షెఫాలి జరివాలా, తన భర్త పరాగ్ త్యాగిని, కాంపౌండ్‌లో తమ కుక్కను నిర్లక్ష్యంగా వదిలేసి నడుచుకుంటూ వెళుతున్నట్లు ముందు రోజు ఘటనను గుర్తు చేసుకున్నారు. ఇది ఎప్పటిలాగే ఉంది అని ఆయన అన్నారు. శుక్రవారం రాత్రి ఆమె మరణించిందనే వార్త విన్నప్పుడు నమ్మలేకపోయానని అన్నాడు.
అయితే రాత్రి 9 గంటలకు షెఫాలి భర్త పరాగ్ త్యాగి మోటార్ సైకిల్‌పై సొసైటీకి వచ్చారు.. గేటు తెరిచింది నేనే అని డ్యూటీ సెక్యూరిటీ శత్రుఘ్న పేర్కొన్నట్టు ఎన్డీటీవీ వెబ్ సైట్ తన కథనంలో పేర్కొంది. రాత్రి 10:30 గంటల ప్రాంతంలో షెఫాలి జీని ఆసుపత్రికి తరలించారని అతడు చెప్పాడు...షెఫాలిని ఆసుపత్రికి తీసుకెళ్లిన కొద్దిసేపటికే, పోలీసు బృందాలు, ఫోరెన్సిక్ యూనిట్లు ఘటనా స్థలానికి చేరుకున్నాయని శత్రుఘ్న తెలిపారు. నిన్న రాత్రి నుండి పోలీసులు లోపల ఉన్నారు. రెండు మొబైల్ ఫోరెన్సిక్ యూనిట్ వాహనాలు ఉన్నాయి ..అని వెల్లడించాడు. ప్రస్తుతం ఫోరెన్సిక్ నిపుణులు ఈ మరణానికి కారణాలపై దర్యాప్తు సాగిస్తున్నట్టు తెలిసింది. ప్రస్తుతానికి ఈ కేసులో దేనినీ అధికారులు నిర్థారించలేదు. షెఫాలి భర్తపై వస్తున్నవన్నీ ప్రస్తుతానికి నిరాధారమైనవి అని గమనించాలి. ఈ కేసులో పోస్ట్ మార్టమ్ నివేదిక, వేలి ముద్రల నిపుణుల నివేదిక చాలా కీలకం కానుంది.