శర్వా 'టర్నింగ్ పాయింట్'.. రాజశేఖర్‌కు 'అవార్డు' ఫీలింగ్!
ఇక ఈసారి అతని కెరీర్ లో మరో టర్నింగ్ పాయింట్ లాంటి సినిమా రానున్నట్లు క్లారిటీ ఇచ్చాడు. రొటీన్ ఫ్యామిలీ కథలను పక్కనపెట్టి, తెలుగు స్క్రీన్‌కు 'డర్ట్ బైక్ రేసింగ్' అనే కొత్త జానర్‌ను పరిచయం చేస్తూ 'బైకర్'గా రాబోతున్నాడు.;
టాలీవుడ్ లో రాముడు మంచి బాలుడు అనే ట్యాగ్ కు పర్ఫెక్ట్ గా సెట్టయ్యే వారిలో శర్వానంద్ ఒకరు. పెద్దగా కాంట్రావర్సిలు లేకుండా చాలా కూల్ గా కనిపించే ఈ హీరో సెలెక్ట్ చేసుకునే కథలు కూడా భిన్నంగా ఉంటాయి. ఇక ఈసారి అతని కెరీర్ లో మరో టర్నింగ్ పాయింట్ లాంటి సినిమా రానున్నట్లు క్లారిటీ ఇచ్చాడు. రొటీన్ ఫ్యామిలీ కథలను పక్కనపెట్టి, తెలుగు స్క్రీన్‌కు 'డర్ట్ బైక్ రేసింగ్' అనే కొత్త జానర్‌ను పరిచయం చేస్తూ 'బైకర్'గా రాబోతున్నాడు.
డిసెంబర్ 6న రిలీజ్ కానున్న ఈ సినిమా గ్లింప్స్ లాంచ్ ఈవెంట్‌లో, శర్వా చాలా కాన్ఫిడెంట్‌గా మాట్లాడాడు. ఈ సినిమా తన కెరీర్‌లోనే ఒక "టర్నింగ్ పాయింట్" అవుతుందని గట్టిగా నమ్ముతున్నాడు. "ఇది ఇండియాస్ ఫస్ట్ మోటార్‌సైకిల్ క్రాస్ రేసింగ్ ఫిల్మ్. దీన్ని తీయడం అంత ఈజీ కాదు. దీనికోసం స్పెషల్‌గా ఇండోనేషియా వెళ్లి అక్కడి బైకర్లతో షూట్ చేశాం. ఈ ప్రాజెక్ట్ నా ఆలోచనా విధానాన్నే మార్చేసింది" అని శర్వా అన్నాడు.
డైరెక్టర్ అభిలాష్ రెడ్డి ఈ స్క్రిప్ట్ చెప్పినప్పుడే తను అవాక్కయ్యానని, ఇంత డెడికేషన్‌తో చేసిన ఈ సినిమా కచ్చితంగా తన కెరీర్‌ను మలుపు తిప్పుతుందని భావిస్తున్నట్లు చెప్పాడు. ఈ సినిమా కేవలం శర్వానంద్‌కే కాదు, సీనియర్ యాక్టర్ రాజశేఖర్‌కు కూడా చాలా స్పెషల్. చాలా కాలంగా మంచి కమ్‌బ్యాక్ కోసం వెయిట్ చేస్తున్న ఆయన, ఎన్నో ప్రాజెక్టులను కాదనుకుని 'బైకర్'ను సెలెక్ట్ చేసుకున్నారు.
ఆయన మాట్లాడుతూ "ప్రతీరోజూ షూటింగ్ అయిపోయాక, ఏదో సాధించాననే సంతృప్తి కలిగేది. అంత మంచి స్క్రిప్ట్ ఇది" అని రాజశేఖర్ అన్నారు. ఈ ఇద్దరు హీరోల మధ్య ఉన్న రెస్పెక్ట్ ఈవెంట్‌లో హైలైట్‌గా నిలిచింది. "శర్వా చాలా రెస్పెక్ట్ ఇచ్చాడు, బాగా కోఆపరేట్ చేశాడు" అని రాజశేఖర్ చెబితే.. "డబ్బింగ్‌లో రాజశేఖర్ గారి పెర్ఫార్మెన్స్ చూసి నాకు నిజంగా గూస్‌బంప్స్ వచ్చాయి. ఆయన ఈ సినిమా ఒప్పుకున్నందుకు థాంక్స్" అని శర్వా అన్నారు.
రాజశేఖర్ తన క్యారెక్టర్ ఎంత బాగా వచ్చిందో చెప్పడానికి ఒక ఎమోషనల్ మూమెంట్‌ను షేర్ చేసుకున్నారు. "ఫస్ట్ హాఫ్ డబ్బింగ్ చూశాక, శర్వా నా దగ్గరికి వచ్చి నా పెర్ఫార్మెన్స్ గురించి చాలా థ్రిల్ ఫీల్ అవుతూ చెప్పాడు. ఆ మాట విన్నప్పుడు, నాకెవరో పెద్ద అవార్డు ఇచ్చినంత సంతోషం కలిగింది" అని రాజశేఖర్ అన్నారు. మొత్తానికి, 'బైకర్' గ్లింప్స్‌కు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. యూవీ క్రియేషన్స్ లాంటి పెద్ద బ్యానర్, శర్వానంద్ డెడికేషన్, రాజశేఖర్ కమ్‌బ్యాక్.. అన్నీ కలిసి సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేశాయి. ఇండియాస్ ఫస్ట్ మోటార్‌సైకిల్ క్రాస్ రేసింగ్ ఫిల్మ్‌గా వస్తున్న ఈ 'బైకర్', డిసెంబర్ 6న శర్వాకు నిజంగానే "టర్నింగ్ పాయింట్" ఇస్తుందేమో చూడాలి.