శర్వానంద్ స్పీడ్ పెంచాల్సిందే..!

మనమే సినిమా తర్వాత శర్వానంద్ నుంచి రెండు ఇంట్రెస్టింగ్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.;

Update: 2025-12-30 08:03 GMT

మనమే సినిమా తర్వాత శర్వానంద్ నుంచి రెండు ఇంట్రెస్టింగ్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. అందులో ఒకటి బైకర్ నేపథ్యంతో వస్తున్న సినిమా కాగా మరొకటి నారి నారి నడుమ మురారి అంటూ ఇద్దరు భామల మధ్య నలిగిపోయే ఒక వ్యక్తి కథతో సినిమా వస్తుంది. శర్వానంద్ బైకర్ అసలైతే డిసెంబర్ ఫస్ట్ వీక్ రిలీజ్ అనుకున్నారు కానీ కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. ఇక ఈ సినిమా రిలీజ్ ఎప్పుడన్నది క్లారిటీ రాలేదు.

2026 సంక్రాంతికి రిలీజ్..

ఐతే నారి నారి నడుమ మురారి సినిమా మాత్రం 2026 సంక్రాంతికి రిలీజ్ ఫిక్స్ చేశారు. ఈసారి సంక్రాంతికి చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. దాదాపు ఐదు సినిమాలు రిలీజ్ అవుతుండగా అన్నీ కూడా ఎంటర్టైన్మెంట్ కథలతోనే వస్తున్నాయి. మెగాస్టార్ చిరంజీవి మన శంకర వరప్రసాద్, ప్రభాస్ రాజా సాబ్, రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి, నవీన్ పొలిశెట్టి అనగనగా ఒక రాజు సినిమాలు సంక్రాంతికి రిలీజ్ షెడ్యూల్ అయ్యాయి.

వాటితో పాటు శర్వానంద్ నారి నారి నడుమ మురారి కూడా రిలీజ్ కాబోతుంది. ఐతే మిగతా సినిమాలు ఆల్రెడీ సాంగ్స్, టీజర్స్ తో ప్రమోషన్స్ మొదలు పెట్టాయి. కానీ శర్వానంద్ సినిమా ప్రమోషన్స్ జోరు పెంచలేదు. ఈమధ్యనే సినిమా నుంచి టీజర్ వచ్చి ఆడియన్స్ ని ఇంప్రెస్ చేసింది. సంక్రాంతి ఫైట్ లో దాదాపు ఐదారు సినిమాల మధ్య వస్తుంది కాబట్టి ఎంత ఎక్కువ ప్రమోషన్స్ చేస్తే అంత ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది.

నారి నారి నడుమ మురారి ప్రమోషన్స్ స్పీడ్..

ఐతే రిలీజ్ అవుతున్న సినిమాలకు ఒకటి రెండు రోజుల గ్యాప్ ఉంది కాబట్టి ఏ సినిమా చూసినా మళ్లీ మరో సినిమా చూసే ఛాన్స్ ఉంటుంది. 13, 14 తేదీల్లో మాత్రమే ఒకే రోజు సినిమాలు వస్తున్నాయి. నారి నారి నడుమ మురారి ప్రమోషన్స్ స్పీడ్ పెంచాలి. ముఖ్యంగా వరుస ఫ్లాపులతో కెరీర్ కాస్త అటు ఇటుగా ఉన్న శర్వానంద్ నారి నారి నడుమ మురారి విషయంలో తప్పకుండా జాగ్రత్త పడాలి.

నారి నారి నడుమ మురారి సినిమాతో పాటు రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాకు కాస్త దగ్గర పోలికలు ఉన్నాయి. అందులో ఇద్దరు హీరోయిన్స్, ఇందులో కూడా ఇద్దరు హీరోయిన్స్. ఐతే భర్త మహాశయులకు సినిమాలో రవితేజ ఆల్రెడీ డింపుల్ తో పెళ్లి అయ్యి ఉంటుంది. కానీ నారి నడుమ మురారి లో శర్వానంద్ సాక్షి వైద్యతో కేవలం ఎంగేజ్ అవుతుంది. సో మొత్తానికి ఈ రెండు కథల ఆలోచన వేరైనా రవితేజ, శర్వానంద్ ఇద్దరు తమ ఎంటర్టైనింగ్ స్క్రీన్ ప్లే తో ప్రేక్షకులను మెప్పించాలని వస్తున్నారు. మరి ఈ సినిమాలతో పాటు సంక్రాంతికి వస్తున్న సినిమాల్లో ఏది విజయ పతాకం ఎగురవేస్తుంది అన్నది చూడాలి.

Tags:    

Similar News