2026పై బోలెడు ఆశ‌లు పెట్టుకున్న టాలెంటెడ్ హీరో

చిన్న హీరోలకు ఒక్కో సినిమాకు సంవ‌త్స‌రం ప‌డితే, స్టార్ హీరోల సినిమాలు, భారీ బ‌డ్జెట్ సినిమాలైతే రెండేళ్ల‌కు పైగానే ప‌డుతుంది.;

Update: 2025-10-23 06:04 GMT

తెలుగు సినిమా స్థాయి గ్లోబ‌ల్ లెవెల్ లో విప‌రీతంగా పెరిగిన నేప‌థ్యంలో చిన్న సినిమా నుంచి పెద్ద సినిమా వ‌ర‌కు ప్ర‌తీ దాన్నీ ఎంతో జాగ్ర‌త్త‌గా తెర‌కెక్కిస్తున్నారు మేక‌ర్స్. ఎక్క‌డా ఎలాంటి త‌ప్పులు జ‌ర‌క్కుండా చూసుకోవ‌డంతో పాటూ ప్ర‌తీ ఒక్క‌రికీ సినిమా న‌చ్చేలా తీయాల‌ని చూస్తున్నారు. అందుకే సినిమాల షూటింగ్ కు చాలా కాలం ప‌డుతుంది. చిన్న హీరోలకు ఒక్కో సినిమాకు సంవ‌త్స‌రం ప‌డితే, స్టార్ హీరోల సినిమాలు, భారీ బ‌డ్జెట్ సినిమాలైతే రెండేళ్ల‌కు పైగానే ప‌డుతుంది.

 

గ‌త కొన్నాళ్లుగా హిట్ చూడ‌ని యంగ్ హీరో

ఇలాంటి టైమ్ లో ఓ యంగ్ హీరో మాత్రం ఒకే ఏడాది మూడు సినిమాల‌ను రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నార‌ని తెలుస్తోంది. ఆ హీరో మ‌రెవ‌రో కాదు, శ‌ర్వానంద్. టాలీవుడ్ లోని టాలెంటెడ్ న‌టుల్లో శ‌ర్వానంద్ కూడా ఒక‌రు. కెరీర్ స్టార్టింగ్ నుంచి డిఫ‌రెంట్ క‌థ‌ల‌ను ఎంచుకుని సినిమాలు చేస్తూ, త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్నారు శ‌ర్వా. అయితే కొంత కాలంగా శ‌ర్వా కెరీర్ ఏమంత ఆశాజ‌న‌కంగా లేదు. దీంతో ఎలాగైనా త‌ర్వాతి సినిమాల‌తో వ‌రుస హిట్లు అందుకోవాల‌ని బాగా క‌సిగా ఉన్న శ‌ర్వా, దాని కోసం ఎంతో క‌ష్ట‌ప‌డుతున్నారు.

ఎప్పుడో రిలీజవాల్సిన సినిమాలు ఆల‌స్యం

శ‌ర్వానంద్ హీరోగా నారీ నారీ న‌డుమ మురారి మ‌రియు బైక‌ర్ అనే రెండు సినిమాలు ఎప్ప‌ట్నుంచో షూటింగ్ ద‌శ‌లో ఉన్నాయి. వాస్త‌వానికి ఈ రెండు సినిమాలు ఎప్పుడో పూర్తై రిలీజ‌వాల్సింది కానీ కొన్ని అనివార్య కార‌ణాల వ‌ల్ల లేట‌వుతూ వ‌చ్చింది. అయితే కాస్త గ్యాప్ తీసుకున్న శ‌ర్వా బాగా స్లిమ్ గా మారి తిరిగి ఆ సినిమాల‌ను పూర్తి చేసే ప‌నిలో ప‌డ్డారు.

సంప‌త్ నంది, శ్రీను వైట్ల ద‌ర్శ‌కత్వంలో..

ఆల్రెడీ చేతిలో ఉన్న సినిమాల‌ను పూర్తి చేయ‌డంతో పాటూ రీసెంట్ గా సంప‌త్ నంది ద‌ర్శ‌క‌త్వంలో మాస్ ఎంటర్టైనర్ అయిన భోగి సినిమాను కూడా సెట్స్ పైకి తీసుకెళ్లి, ఆ సినిమా కోసం బల్క్ లో డేట్స్ ను కేటాయించారు శ‌ర్వా. ఇవి కాకుండా శ్రీను వైట్ల డైరెక్ష‌న్ లో ఓ మూవీ చేయ‌డానికి కూడా శ‌ర్వానంద్ క‌మిట్ అయ్యారు. ఆల్రెడీ మొద‌లైన మూడు సినిమాల‌ను పూర్తి చేసి, నెక్ట్స్ ఇయ‌ర్ స్టార్టింగ్ లో శ్రీను వైట్ల సినిమాను మొద‌లుపెట్టాల‌ని భావిస్తున్నార‌ట శ‌ర్వానంద్.

ఒకే ఏడాదిలో శ‌ర్వా నుంచి నాలుగు సినిమాలు

అంతేకాదు, త‌న చేతిలో ఉన్న ప్రాజెక్టుల‌ను వీలైనంత త్వ‌ర‌గా పూర్తి చేసి వాట‌న్నింటినీ 2026లోనే రిలీజ్ చేయాల‌ని శ‌ర్వా టార్గెట్ గా పెట్టుకున్నార‌ట‌. ఆల్రెడీ నారీ నారీ న‌డుమ మురారి సినిమాను వ‌చ్చే ఏడాది సంక్రాంతికి షెడ్యూల్ చేసిన శ‌ర్వా, బైక‌ర్ ను స‌మ్మ‌ర్ లో రిలీజ్ చేయాల‌ని చూస్తున్నార‌ట‌. భోగి మూవీని 2026 సెకండాఫ్ లో రిలీజ్ చేసి, ఆఖ‌రిగా శ్రీను వైట్ల సినిమాతో ఇయ‌ర్ ను ఎండ్ చేయాల‌ని అనుకుంటున్నార‌ట శ‌ర్వానంద్. ఏదేమైనా 2026 లో నాలుగు సినిమాలు రిలీజ్ చేయాల‌ని, ఒక‌వేళ ఏదైనా కుద‌రని ప‌క్షంలో మూడు సినిమాల‌నైనా రిలీజ్ చేసి వ‌రుస హిట్లు అందుకుని స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వాల‌ని చూస్తున్నారట. ఈ నేప‌థ్యంలోనే 2026 శ‌ర్వానంద్ కు ఎంతో కీల‌కంగా మారింది. చూస్తుంటే శ‌ర్వా 2026పై ఎన్నో ఆశ‌లు పెట్టుకున్న‌ట్టు క‌నిపిస్తోంది. మరి నెక్ట్స్ ఇయ‌ర్ అయినా అత‌నికి క‌లిసొస్తుందేమో చూడాలి.

Tags:    

Similar News