బైకర్.. ఎవరా ప్రెట్టీ బేబీ?
చార్మింగ్ స్టార్ శర్వానంద్ ఈసారి ఫుల్ స్పీడ్‌తో రాబోతున్నాడు. తన కొత్త సినిమా 'బైకర్'తో బాక్సాఫీస్‌ను షేక్ చేయడానికి రెడీ అయ్యాడు.;
చార్మింగ్ స్టార్ శర్వానంద్ ఈసారి ఫుల్ స్పీడ్‌తో రాబోతున్నాడు. తన కొత్త సినిమా 'బైకర్'తో బాక్సాఫీస్‌ను షేక్ చేయడానికి రెడీ అయ్యాడు. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ లాంటి టాప్ బ్యానర్ నిర్మిస్తుండటంతో, ప్రాజెక్ట్‌పై మొదటి నుంచి మంచి బజ్ ఉంది. లేటెస్ట్ గా, మేకర్స్ ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయనున్నట్లు అప్‌డేట్ ఇచ్చారు. ఇక 'బైకర్' సినిమాను డిసెంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నట్లు మరోసారి పోస్టర్ ద్వారా క్లారిటీ ఇచ్చారు.
ఈ అనౌన్స్‌మెంట్ కోసం వదిలిన పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఇది రెగ్యులర్ యాక్షన్ పోస్టర్‌లా కాకుండా, ఫుల్ రొమాంటిక్ వైబ్‌తో ఉంది. ఒక వింటేజ్ యమహా బైక్‌పై శర్వానంద్, ఒక అమ్మాయిని చాలా ఇంటెన్స్‌గా హగ్ చేసుకుని కనిపిస్తున్నాడు. శర్వా రఫ్ లుక్‌లో, బైకర్ జాకెట్‌తో స్టైలిష్‌గా ఉన్నాడు. ఆమె కూడా బైకర్ జాకెట్‌లో ఉన్నా, తన ఫేస్‌ను మాత్రం ఒక రెడ్ హెల్మెట్‌తో కవర్ చేసేసింది.
ఈ పోస్టర్ ఫ్యాన్స్‌లో కొంత క్యూరియాసిటీని పెంచింది. "అసలు ఎవరా ప్రెట్టీ బేబీ?" అంటూ నెటిజన్లు డిస్కషన్ మొదలుపెట్టారు. దానికి తగ్గట్టే, ఫస్ట్ సింగిల్ పేరును కూడా "ప్రెట్టీ బేబీ" (Pretty Baby) అని అనౌన్స్ చేశారు. ఈ "ప్రెట్టీ బేబీ" సాంగ్ ప్రోమోను నవంబర్ 11న రిలీజ్ చేయనున్నారు. ఆ పోస్టర్‌లోని హెల్మెట్ బేబీ ఎవరో తెలియాలంటే ఆ రోజు వరకు ఆగాల్సిందే.
నిజానికి, ఈ సినిమాలో మాల్వికా నాయర్ హీరోయిన్‌గా నటిస్తోందని సమాచారం. మరి, ఆ హెల్మెట్ కింద ఉన్నది మాల్వికానేనా లేక సినిమాలో మరో సర్ప్రైజ్ హీరోయిన్ ఎవరైనా ఉన్నారా అనేది సస్పెన్స్‌గా మారింది. ఈ మిస్టరీ పోస్టర్‌తో 'బైకర్' టీమ్ ప్రమోషన్స్‌కు మంచి కిక్ ఇచ్చింది. ఫస్ట్ సింగిల్ ప్రోమోతో ఈ సస్పెన్స్‌కు తెర దించుతారేమో చూడాలి.
సినిమాలో హై యాక్షన్‌తో పాటు, ఒక సాలిడ్ రొమాంటిక్ ట్రాక్ కూడా ఉండబోతోందని క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ జీబ్రాన్. గతంలో రన్ రాజా రన్, జిల్ వంటి సినిమాలకు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. ఇక ఈ సినిమాకు జిబ్రాన్ ఇచ్చే ఫ్రెష్ ట్యూన్స్, బీజీఎం సరికొత్తగా ఉండనున్నట్లు మేకర్స్ చెబుతున్నారు. శర్వాకు ఒక మంచి మ్యూజికల్ ఆల్బమ్ పడి చాలా కాలమైంది, ఈసారి జిబ్రాన్ ఆ లోటును తీరుస్తాడేమో చూడాలి. అభిలాష్ రెడ్డి కంకర డైరెక్షన్‌లో రూపొందుతున్న ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ గ్రాండ్ గా నిర్మిస్తోంది. శర్వానంద్‌కు ఈ సినిమాతో సాలిడ్ కంబ్యాక్ గ్యారెంటీ అని ఫ్యాన్స్ ఫిక్స్ అవుతున్నారు. ఇక సినిమాకు రాబోయే సాంగ్స్ ఏ స్థాయిలో హైప్ క్రియేట్ చేస్తాయో చూడాలి.