శర్వానంద్.. సినిమాలో కూడా షర్ట్ లెస్ గా కనిపిస్తాడా?

ఇప్పటి వరకు ఎన్నడూ కనిపించని రీతిలో సందడి చేశారు. షర్ట్‌ లెస్‌ గా కనిపిస్తూ, తన ఫిట్‌ నెస్‌ ను మరో స్థాయికి తీసుకెళ్లారు.;

Update: 2025-10-25 11:30 GMT

టాలీవుడ్ ఛార్మింగ్ స్టార్ శర్వానంద్ లేటెస్ట్ ఫోటోషూట్ కొన్ని గంటలుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది. ఎక్కడ చూసినా శర్వా ట్రాన్స్ఫర్మేషన్ గురించే మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే ఎప్పుడూ చాక్లెట్ బాయ్ లా కనిపించే యంగ్ హీరోను ఇలా ఎప్పుడూ చూసి ఉండరు. పూర్తిగా గుర్తుపట్టలేని విధంగా మారిపోయారు.

ఇప్పటి వరకు ఎన్నడూ కనిపించని రీతిలో సందడి చేశారు. షర్ట్‌ లెస్‌ గా కనిపిస్తూ, తన ఫిట్‌ నెస్‌ ను మరో స్థాయికి తీసుకెళ్లారు. స్పష్టంగా కనిపించే సిక్స్‌ ప్యాక్‌ యాబ్స్‌ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. అయితే లీన్‌, అథ్లెటిక్‌ బాడీ కోసం శర్వానంద్‌ కొన్ని నెలల తరబడి కఠినమైన జిమ్ వర్కౌట్స్ చేసి కంట్రోల్డ్‌ డైట్‌ పాటించారని టాక్.

కష్టానికి తగ్గ ఫలితం అందుకున్నారని చెప్పాలి. అయితే స్పోర్ట్స్‌ డ్రామా బైకర్ మూవీలో ఇప్పుడు శర్వా నటిస్తున్న సంగతి విదితమే. అభిలాష్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమాలో రేసర్ గా కనిపించనున్నారు. ఇప్పటికే మేకర్స్ రిలీజ్ చేసిన అప్డేట్స్ ద్వారా క్లారిటీ వచ్చేసింది. బైకర్‌ లా శర్వా కనిపించిన తీరు ఆసక్తి రేపింది.

ఇప్పుడు ఆ సినిమా కోసమే శర్వానంద్ ఫుల్ మేకోవర్ అయ్యారు. అయితే మూవీలో కూడా షర్ట్ లెస్ గా కనిపిస్తారా అని నెటిజన్లు, సినీ ప్రియులు, అభిమానులు డిస్కస్ చేసుకుంటున్నారు. కెరీర్ లో ఫస్ట్ టైమ్ సిక్స్ ప్యాక్ చేసిన శర్వానంద్.. ఇప్పుడు బైకర్ లోని ఓ సన్నివేశంలో తన ట్రాన్స్ఫర్మేషన్ ను చూపించనున్నారని అంటున్నారు.

అయితే ఇప్పటి వరకు యువత, కుటుంబ ప్రేక్షకులు మెచ్చిన చిత్రాల్లో నటించారు శర్వా. ఇప్పుడు భిన్నంగా బైకర్ చేస్తున్నారు. అదే సమయంలో తన సినిమాల్లో ఫ్యామిలీ కమ్ డీసెంట్ హీరోగా కనిపించారు. చెప్పాలంటే.. ఓ పక్కింటి అబ్బాయిలా సందడి చేశారు. కానీ తొలిసారి బైకర్ లో షర్ట్ లెస్ గా కనిపించనున్నారని చెప్పాలి.

ఇక సినిమా విషయానికొస్తే.. యూవీ క్రియేషన్స్ పై వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. మాళవిక నాయర్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా, ప్రముఖ నటులు బ్రహ్మాజీ, అతుల్‌ కులకర్ణి కీలక పాత్రల్లో యాక్ట్ చేస్తున్నారు. సినిమాటోగ్రఫీని జి యువరాజ్‌ నిర్వహిస్తుండగా, మ్యూజిక్ ను ఘిబ్రాన్‌ అందిస్తున్నారు. ఎడిటింగ్‌ బాధ్యతలు అనిల్‌ కుమార్‌ పి చేపడుతుండగా.. వచ్చే ఏడాది సినిమా రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. మరి బైకర్ మూవీతో శర్వానంద్ ఎలాంటి హిట్ అందుకుంటారో వేచి చూడాలి.

Tags:    

Similar News