శర్వానంద్ సినిమా ఎక్కడిదాకా వచ్చింది..?
టాలెంటెడ్ హీరో శర్వానంద్ చివరి సినిమా మనమే కూడా బాక్సాఫీస్ దగ్గర అంత బాగా పర్ఫార్మ్ చేయలేదు.;
టాలెంటెడ్ హీరో శర్వానంద్ చివరి సినిమా మనమే కూడా బాక్సాఫీస్ దగ్గర అంత బాగా పర్ఫార్మ్ చేయలేదు. తను ఎంచుకునే కథలు డిఫరెంట్ గా ఉంటున్నా కూడా ఎందుకో శర్వానంద్ ఆడియన్స్ ని ఇంప్రెస్ చేయలేకపోతున్నాడు. ప్రస్తుతం శర్వానంద్ 3 సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈ 3 సినిమాలతో అయినా తిరిగి హిట్ ట్రాక్ ఎక్కాలని చూస్తున్నాడు. శర్వానంద్ చేస్తున్న సినిమాకు నారి నారి నడుమమురారి అనే టైటిల్ పెట్టారు. ఆ సినిమాలో శర్వానంద్ కి జోడీగా సం యుక్త మీనన్, సాక్షి వైద్య నటిస్తున్నారు. రాం అబ్బరాజు డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కుతుంది.
సంపత్ నంది ఒక క్రేజీ సినిమా..
శర్వానంద్ నెక్స్ట్ ఒక రేసింగ్ బ్యాక్ డ్రాప్ మూవీ చేస్తున్నాడు. ఆ సినిమాను అభిలాష్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఐతే ఆ సినిమా షూటింగ్ ఎక్కడిదాకా వచ్చింది అన్న అప్డేట్ అయితే బయటకు రాలేదు. ఇక శర్వానంద్న్ తో సంపత్ నంది ఒక క్రేజీ సినిమా చేస్తున్నాడు. పీరియాడిక మూవీగా రాబోతున్న ఈ సినిమాకు బోగి అనే టైటిల్ లాక్ చేశారు. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా రాబోతుంది.
శర్వానంద్ కెరీర్ లో ఒక సూపర్ హిట్ సినిమా కోసం ఎదురుచూస్తున్నాడు. అందుకే రాబోతున్న 3 సినిమాల్లో 3 కూడా డిఫరెంట్ స్టోరీస్ తో డిఫరెంట్ జోనర్స్ ట్రై చేస్తున్నాడు. శర్వానంద్ ఫ్యామిలీ ఆడియన్స్ కోసం నారి నారి నడుమ మురారి వస్తుంది. ఇక రేసింగ్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న సినిమా తో అడ్వెంచర్ సినిమాలను ఇష్టపడే ఆడియన్స్ ని టార్గెట్ చేస్తున్నాడు.
బోగి సినిమాతో మాస్ యాక్షన్..
సంపత్ నంది బోగి సినిమాతో మాస్ యాక్షన్ అది కూడా పీరియాడికల్ కథ కాబట్టి సంథింగ్ స్పెషల్ గా ఉండబోతుంది. తప్పకుండా ఈ సినిమాలు శర్వానంద్ కోరుకుంటున్న సూపర్ హిట్ అందిస్తాయనే అనిపిస్తుంది. యువ హీరోల్లో మాస్ స్టామినా ఉండి సరైన సక్సెస్ లు లేక కెరీర్ లో వెనకపడ్డాడు శర్వానంద్. అతనికి ఒక మంచి జోష్ ఇచ్చే హిట్ వస్తే తప్పకుండా శర్వా కెరీర్ ట్రాక్ ఎక్కే ఛాన్స్ ఉంటుంది.
కథల ఎంపికలో కొత్తదనం కోరుకునే శర్వానంద్ రాబోతున్న సినిమాలతో కూడా తన మార్క్ స్పెషాలిటీ చూపించాలని ఫిక్స్ అయ్యాడు. అంతేకాదు శర్వానంద్ మాస్ క్యాలిబర్ ఏంటో చూపించేలా బోగిని అంచనాలకు మించి ఉండేలా చేస్తున్నారట. సంపత్ నంది కూడా ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ మెగా ఫోన్ పట్టుకుంటున్నాడు కాబట్టి సినిమా నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని అంటున్నారు. శర్వానంద్ ఈ 3 సినిమాలు నెక్స్ట్ ఇయర్ రిలీజ్ ప్లానింగ్ ఉంది. 2026 శర్వానంద్ కి బిగ్ ఇయర్ అని చెప్పొచ్చు. రాబోతున్న 3 సినిమాల్లో రెండు హిట్ అయినా కూడా శర్వా కెరీర్ మళ్లీ ఊపందుకున్నట్టే లెక్క.