నేను ప‌క్క‌న ఉండ‌గానే ఐదుగురు అమ్మాయిల‌తో.. న‌టి ఆందోళ‌న‌!

రంగుల పరిశ్ర‌మ‌లో బోయ్ ఫ్రెండ్‌తో షికార్లు, డేటింగ్ వ్య‌వ‌హారాలు రెగ్యుల‌ర్ గా చూసేవే. అయితే చివ‌రి వ‌ర‌కూ నిల‌బ‌డే డేటింగ్ ఏది? అంటే జ‌వాబు దొర‌క‌దు.;

Update: 2026-02-14 06:46 GMT

రంగుల పరిశ్ర‌మ‌లో బోయ్ ఫ్రెండ్‌తో షికార్లు, డేటింగ్ వ్య‌వ‌హారాలు రెగ్యుల‌ర్ గా చూసేవే. అయితే చివ‌రి వ‌ర‌కూ నిల‌బ‌డే డేటింగ్ ఏది? అంటే జ‌వాబు దొర‌క‌దు. కొద్దిరోజులు లేదా నెల‌లు డేటింగ్ చేసిన‌ త‌ర్వాత ఎవ‌రి దారి వారు చూసుకునేవారే ఎక్కువ‌. దీపిక ప‌దుకొనే, క‌రీనా క‌పూర్, ఆలియాభ‌ట్, త‌మ‌న్నా, అన‌న్య పాండే, సారా అలీఖాన్.. ఇలా చాలామందికి ఇది అనుభ‌వం. కుర్ర‌భామ‌, సీనియ‌ర్ న‌టి అనే విభేధం లేదిక్క‌డ‌. అంద‌రికీ ఇలాంటి అనుభ‌వాలున్నాయి. ల‌వ్ బ్రేకప్ అనేది కామ‌న్ థింగ్.

ఇప్పుడు ఇదే జాబితాలో చేరింది యువ‌న‌టి షనాయా కపూర్. త‌న డెబ్యూ న‌టి సినిమా రిలీజ్ కాక ముందే ప్రేమ‌లో బ్రేక‌ప్ అంటూ పెద్ద షాకిచ్చే విష‌య‌మే చెప్పింది. జాన్వీ, ఖుషీ, అన‌న్య‌, సారా లాంటి గొప్ప అనుభ‌వాలున్న‌ బెస్ట్ ఫ్రెండ్స్ ఈ బ్యూటీకి ఉన్న‌ప్ప‌టికీ ఈ అనుభ‌వం ఊహించ‌నిది. తాజాగా షాన‌య‌ తన వ్యక్తిగత జీవితం గురించి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ఒక పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ.. ల‌వ్ బ్రేక‌ప్ అనే చేదు అనుభవం గురించి ఓపెనైంది ఈ భామ‌.

షనాయా తన బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి విదేశీ విహారయాత్రలో ఉన్న సమయంలోనే అతడు తనను మోసం చేస్తున్నాడని తెలుసుకుంది. ర‌హస్యంగా బోయ్ ఫ్రెండ్ ఫోన్ తనిఖీ చేసినప్పుడు అతడు ఒకే సమయంలో ఐదుగురు వేరే అమ్మాయిలతో మెసేజ్‌లు చేస్తున్నాడని తెలిసి నిర్ఘాంతపోయింది. విహారయాత్రలో తన పక్కన ఉంటూనే అతడు ఇలా చేయడం తీవ్రంగా కలిచివేసింది.

ఈ విషయం తెలిసిన వెంటనే షనాయా తన ప్రాణ స్నేహితురాలు, నటి అనన్య పాండేకు కాల్ చేసింది. ఆ సమయంలో అనన్య ఎంతో పరిణతితో వ్యవహరించి ''వెంటనే అక్కడి నుంచి తిరిగి వచ్చేయ్'' అని ధైర్యం చెప్పిందని షనాయా పేర్కొంది. ఆ బాధాకరమైన సమయంలో తన స్నేహితులు అయిన అనన్య పాండే, సుహానా ఖాన్ తనకు అండగా నిలబడ్డారని, ఆ చేదు జ్ఞాపకం నుండి బయటపడటానికి వారు ఎంతో సహాయం చేశారని ఆమె వివరించింది.

సాధారణంగా గ్లామర్ ప్రపంచంలో అంతా బాగుంటుందని అనుకుంటాము కానీ షనాయా, అన‌న్య‌ లాంటి యువ నటీమణులు తమ బ్రేక్ అప్, మోసం గురించి బహిరంగంగా మాట్లాడుతుంటే షాక్ తిన‌కుండా ఉండ‌లేం. యువ‌న‌టీమ‌ణుల‌కు ఇలాంటి స‌మ‌యాల్లో సోషల్ మీడియాలో మద్దతు లభిస్తోంది. ముఖ్యంగా అనన్య పాండే ఒక మంచి స్నేహితురాలిగా ఆమెకు అండగా నిలవడంపై నెటిజనులు ప్రశంసలు కురిపిస్తున్నారు. నిజం చెప్పాలంటే ఈరోజుల్లో 1శాతం మాత్ర‌మే మోసం లేకుండా నిల‌బ‌డే బంధం మిగిలి ఉంద‌నేది ఒక స‌ర్వే.

షనాయా కపూర్ కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే .. కరణ్ జోహార్ నిర్మాణంలో ఈ సినిమా `బేధ‌డక్` తోనే ఆమె పరిచయం కావాల్సింది. కానీ కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ నిలిచిపోయింది. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 3లోను షాన‌య న‌టించ‌నుందని క‌థ‌నాలొచ్చాయి. ఇది సినిమాగా కాకుండా వెబ్ సిరీస్‌గా వచ్చే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఇందులో షనాయా నటిస్తున్నట్లు సమాచారం ఉన్నా.. దీని విడుదల తేదీపై ఇంకా స్పష్టత లేదు.

మొస‌లి వేట నేప‌థ్యంలో రూపొందించిన యు యా మైన్ అనే స‌ర్వైవ‌ల్ థ్రిల్ల‌ర్ లో న‌టించింది. ఈ చిత్రం విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. అలాగే ఇప్ప‌టికే 'వృషభ' అనే పాన్-ఇండియా సినిమాలో న‌టించింది.

Tags:    

Similar News