పిక్‌టాక్ : బ్లాక్‌ చీర కట్టులో సికిందర్‌ అందాలు

టీవీ సిరీస్‌తో ప్రేక్షకులకు పరిచయం అయిన షామా సికిందర్‌ అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించింది.;

Update: 2025-08-01 19:30 GMT

టీవీ సిరీస్‌తో ప్రేక్షకులకు పరిచయం అయిన షామా సికిందర్‌ అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించింది. బుల్లి తెరకు వెండి తెర స్థాయిలో అందాలు అద్దిన నటీమణుల్లో షామా సికిందర్ ఒకరు అనడంలో సందేహం లేదు. హీరోయిన్‌గా వచ్చిన చిన్నా చితకా ఆఫర్ల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తూ వెండి తెరపైనా తనదైన సత్తా చాటేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేసింది. ఆకట్టుకునే అందంతో పాటు మంచి ఫిజిక్ ఈమె సొంతం కావడంతో సుదీర్ఘ కాలం పాటు ఇండస్ట్రీలో కొనసాగింది. 16 ఏళ్ల వయసులోనే ఇండస్ట్రీలో అడుగు పెట్టిన షామా సికిందర్‌ ఇప్పటికీ బిజీ బిజీగా ఉంది. బుల్లితెర, వెండి తెర పై తనదైన ముద్ర వేయడం కోసం చాలా కష్టపడ్డ షామా సికిందర్‌ సోషల్‌ మీడియాలో రెగ్యులర్‌గా అందమైన ఫోటోలతో అలరిస్తూ ఉంటుంది.

ఇన్‌స్టాగ్రామ్‌లో 3 మిలియన్‌ల ఫాలోవర్స్‌

ఇన్‌స్టాగ్రామ్‌లో ఏకంగా మూడు మిలియన్‌లకు ఎక్కువగా ఫాలోవర్స్‌ను కలిగి ఉన్న షామా సికిందర్‌ రెగ్యులర్‌గా తన అభిమానుల కోసం అందమైన ఫోటోలను షేర్‌ చేస్తూనే ఉంటుంది. తాజాగా మరోసారి తన అందమైన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. ఈసారి చీర కట్టు ఫోటోలను షేర్‌ చేయడం ద్వారా చూపు తిప్పనివ్వడం లేదు. సహజంగానే ముద్దుగుమ్మలు చీర కట్టులో చాలా అందంగా ఉంటారు. అలాంటిది షామా సికిందర్‌ తన అందమైన హొయలతో చీర కట్టులో అందాలను చూపిస్తే నెటిజన్స్‌ తట్టుకోగలరా.. ఖచ్చితంగా ఈ స్థాయి అందంను మునుపెన్నడూ చూడలేదు అంటూ తెగ కామెంట్స్ చేస్తూ ఫోటోలకు కామెంట్స్ చేస్తూ మిలియన్స్‌ లో లైక్స్‌, షేర్స్ ఇస్తున్నారు.

చీర కట్టులో షామా సికిందర్‌ అందం

బ్లాక్‌ చీర కట్టులో నడుము అందం చూపిస్తూ, క్లీ వేజ్ షో చేస్తూ ముద్దుగుమ్మ షామా సికిందర్‌ చేసిన ఈ షో కు నెటిజన్స్‌ ఫిదా అవుతున్నారు. ఇంత అందంగా ఉన్న షామా సికిందర్‌ ఎందుకు బాలీవుడ్‌ స్టార్‌ ఫిల్మ్‌ మేకర్స్ కి కనిపించడం లేదడు అంటూ చాలా మంది విచారం వ్యక్తం చేస్తున్నారు. ఇకపై అయినా ఈ అందాల ముద్దుగుమ్మకు అవకాశాలు రావాలని అభిమానులు కోరుకుంటున్నారు. సోషల్‌ మీడియాకే ఈమె అందం పరిమితం కాకుండా ముందు ముందు మరింతగా విస్తరించాలని, ముఖ్యంగా వెండి తెరపై ఈమె స్టార్‌గా వెలుగు వెలగాలని నెటిజన్స్ ఆకాంక్షిస్తున్నారు. మరి ముద్దుగుమ్మ వెండి తెర రీ ఎంట్రీలో అయినా సక్సెస్‌లు దక్కి, స్టార్‌డం దక్కనేనా చూడాలి. బుల్లి తెరపై చూసిన సక్సెస్‌ ఈమెకు వెండి తెరపై కలగాలని అంతా కోరుకుంటున్నారు.

బాలీవుడ్‌ సినిమాల్లో..

బాలీవుడ్‌ సినిమాల్లో నటించడంతో పాటు ఈమె సౌత్‌ సినిమా ఇండస్ట్రీలోనూ నటించాలని చాలా మంది కోరుకుంటున్నారు. ఈమె హీరోయిన్‌గానే కాకుండా ఐటెం సాంగ్స్‌ లోనూ నటించే అవకాశాలు దక్కించుకోవడం అవసరం అని కొందరు అంటున్నారు. మొత్తానికి షామా సికిందర్‌ అందాల చీర కట్టు ఫోటోలకు చాలా పెద్ద ఎత్తున కామెంట్స్ వస్తున్నాయి. ప్రస్తుతం ఈ అమ్మడి యొక్క అందాల ఆరబోత ఫోటోల గురించి సోషల్‌ మీడియాలో ప్రముఖంగా చర్చ జరుగుతోంది. పెద్ద హీరోల సినిమాల్లో నటించేందుకు ఈ మధ్య సీనియర్‌ హీరోయిన్స్‌కి ముఖ్య పాత్రల్లో నటించే అవకాశాలు దక్కుతున్నాయి. అందుకే షామా సికిందర్‌ గట్టిగా ట్రై చేస్తే ఆ సినిమాల్లో ఆఫర్లు రావడం ఖాయం, అంతే కాకుండా వెబ్‌ సిరీస్‌ల్లోనూ ఈమె నటించే అవకాశాలు దక్కించుకోవచ్చు.

Tags:    

Similar News