వ‌డ దెబ్బ‌కు ఆస్ప‌త్రిలో షారూఖ్‌.. గౌరీలో ఆందోళ‌న‌

ఎప్పుడూ న‌వ్వుతూ న‌వ్విస్తూ సంద‌డిగా, ఎమోష‌న‌ల్ గా క‌నిపిస్తున్నాడు కింగ్ ఖాన్ షారూఖ్‌.

Update: 2024-05-23 04:12 GMT

ఎప్పుడూ న‌వ్వుతూ న‌వ్విస్తూ సంద‌డిగా, ఎమోష‌న‌ల్ గా క‌నిపిస్తున్నాడు కింగ్ ఖాన్ షారూఖ్‌. ఐపీఎల్ 2024 టోర్నీలో త‌న టీమ్ కేకేఆర్ ఆట‌తీరుకు ఫిదా అయిపోతున్నాడు. ఓడిన‌ప్పుడు కూడా టీమ్ స‌భ్యుల్లో ఉత్సాహం నింపేందుకు అత‌డు అందుబాటులో ఉంటున్నాడు. స్టేడియంలో ఒక్క మ్యాచ్ ని కూడా ఖాన్ మిస్స‌వ్వ‌డం లేదు. అయితే ఇదంతా ఒకెత్తు అనుకుంటే, ఇప్పుడు ఊహించ‌ని విధంగా డీహైడ్రేషన్ - వ‌డ దెబ్బ ప్ర‌భావానికి గురైన‌ షారుఖ్ ఖాన్ బుధవారం అహ్మదాబాద్‌లోని కెడి ఆసుపత్రిలో చేరారు. ఈ వార్త విన్న ఆయ‌న‌ భార్య గౌరీ ఖాన్ .. సన్నిహితురాలైన‌ నటి జూహీ చావ్లా ఆసుపత్రికి చేరుకున్నారు.

సెక్యూరిటీ గార్డుతో కలిసి ఆసుపత్రికి వచ్చేప్పుడు గౌరి ఆందోళనగా కనిపించింది. జూహీ చావ్లా త‌న‌ భర్త జే మెహతాతో కలిసి షారూఖ్‌ని సందర్శించి అతడి పరిస్థితిని తనిఖీ చేశారు. తాజా క‌థ‌నాల ప్రకారం.. SRK ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యార‌ని తెలిసింది.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో మంగళవారం తన జట్టు కోల్‌కతా నైట్ రైడర్స్ (కెకెఆర్) - సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగిన మ్యాచ్‌ని చూడటానికి షారూఖ్ అహ్మదాబాద్ లో ఉన్నారు. ఖాన్‌తో పాటు అతడి కుమార్తె సుహానా ఖాన్, చిన్న కుమారుడు అబ్రామ్ .. అతడి మేనేజర్ పూజా దడ్లానీ ఉన్నారు. స్టేడియంలో సుహానా సన్నిహితులు అనన్య పాండే, షానయ కపూర్, నవ్య నంద, అగస్త్య నందలతో పాటు KKR సహ-యజమానులు జూహీ చావ్లా - జే మెహతా కూడా ఉన్నారు.

Read more!

ముందు రోజు సాయంత్రం ఒక ఎగ్జ‌యిటింగ్ మ్యాచ్ తర్వాత SRK, సుహానా, అబ్‌రామ్ వీక్షకులను పలకరిస్తూ నరేంద్ర మోడీ స్టేడియం చుట్టూ వేడుకగా తిరుగుతూ సంద‌డిగా క‌నిపించారు. అలాగే SRK కూడా ప్రేక్షకులను పలకరించడం ఆక‌ర్షించింది. షారూఖ్ త‌న సిగ్నేచ‌ర్ భంగిమతో ప్రేక్షకులను థ్రిల్ చేసాడు. ఇది అభిమానులకు చిరస్మరణీయమైన రాత్రి. కానీ అనారోగ్యంతో ఖాన్ ఆస్ప‌త్రిలో చేరార‌నేది అంద‌రినీ క‌ల‌త‌కు గురి చేసింది. ప్రస్తుతానికి షారుఖ్ ఖాన్ పరిస్థితిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. అభిమానులు, శ్రేయోభిలాషులు ఖాన్ వేగంగా కోలుకోవాల‌ని ప్రార్థిస్తున్నారు.

Tags:    

Similar News