షారుఖ్ ఖాన్ మేనేజర్ పూజా నెల జీతం తెలిస్తే ఫ్యూజులు ఔట్.. ఆమె నికర ఆదాయం ఎంతంటే?

ఇకపోతే ఈయన ఇన్ని రంగాలలో సక్సెస్ కావడానికి కారణం ఈయన మేనేజర్ పూజా దద్లానీ పాత్ర చాలా ఉందని ఎప్పుడు చెబుతూ ఉంటారు.;

Update: 2025-10-15 10:11 GMT

బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో బాద్ షాగా పేరు సొంతం చేసుకున్నారు షారుఖ్ ఖాన్.. నటుడు గానే కాకుండా అత్యంత ధనవంతుడిగా కూడా పేరు సొంతం చేసుకున్నారు. ఇకపోతే ఒకవైపు హీరోగా.. మరొకవైపు నిర్మాతగా.. బ్రాండ్ అంబాసిడర్ గా.. వ్యాపారవేత్తగా తనకంటూ ఒక మంచి ఇమేజ్ సొంతం చేసుకున్నారు షారుక్ ఖాన్. ఇకపోతే ఈయన ఇన్ని రంగాలలో సక్సెస్ కావడానికి కారణం ఈయన మేనేజర్ పూజా దద్లానీ పాత్ర చాలా ఉందని ఎప్పుడు చెబుతూ ఉంటారు. ఈ క్రమంలోనే షారుఖ్ ఖాన్ దగ్గర మేనేజర్ గా పని చేస్తున్న ఈమె.. నెల జీతం ఎంత? ఇప్పటివరకు ఈమె ఎంత ఆస్తి కూడబెట్టింది? ఈమె వ్యక్తిగత జీవిత విషయాలు ఏంటి ? ఇలా కొన్ని విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

ముంబైకి చెందిన పూజా దద్లానీ 12 సంవత్సరాలకు పైగా షారుఖ్ ఖాన్ దగ్గర వ్యూహాత్మక సలహాదారురాలిగా పనిచేస్తోంది. ముంబైకి చెందిన ఈమె 2012 నుండి షారుఖ్ ఖాన్ దగ్గర మేనేజర్ గా పనిచేస్తూ ఉండడం గమనార్హం. కాలక్రమేనా ఈమె షారుక్ ఖాన్ కుటుంబ సభ్యులలో ఒకరిగా పేరు తెచ్చుకుంది. ఈయన సినీ కెరియర్, ఎండార్స్ మెంట్ లు , వ్యాపార లావాదేవీలు అలాగే షారుక్ ఖాన్ నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ కంపెనీని నిర్వహించడంలో ఈమె విస్తృత బాధ్యతలను నిర్వహిస్తోంది.

ఇకపోతే ఈమె సంపాదన విషయానికి వస్తే.. నెలకు సుమారుగా 70 లక్షల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటున్న ఈమె ఏడాదికి రూ.7 నుండి రూ.9 కోట్లు వసూలు చేస్తున్నట్లు సమాచారం. ఇకపోతే ఇప్పటివరకు పూజా రూ.50 నుండి రూ.60 కోట్ల వరకు ఆస్తులు కూడబెట్టినట్లు సమాచారం.

పూజా దద్లానీ విషయానికి వస్తే షారుక్ ఖాన్, పూజా ఇద్దరూ కూడా మాస్ కమ్యూనికేషన్ లో గ్రాడ్యుయేట్లు. ఈమె హితేష్ గుర్నానిని 2008లో వివాహం చేసుకుంది. 2016 లో రేనా అనే కూతురికి జన్మనిచ్చారు. మొత్తానికైతే షారుక్ ఖాన్ దగ్గర గత 12 ఏళ్లుగా కొనసాగుతూ భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది పూజా దద్లానీ. అంతేకాదు ఇండియన్ సెలబ్రిటీల దగ్గర ఉన్న మేనేజర్లలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న మేనేజర్ గా కూడా పూజా రికార్డ్ సృష్టించారు.

Tags:    

Similar News