భారీ బడ్జెట్ తో ఆ రికార్డులను తిరగరాయాలని చూస్తున్న హిట్ కాంబో
రీసెంట్ గా షారుఖ్ బర్త్ డే సందర్భంగా కింగ్ టీజర్ రిలీజవగా, ఆ టీజర్ ఫ్యాన్స్ ను ఆకట్టుకోవడమే కాకుండా సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అయింది.;
బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ ఫుల్ జోష్ లో ఉన్నారు. పఠాన్, జవాన్ లాంటి సినిమాలతో బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్లను అందుకోవడంతో పాటూ ఆ సినిమాలతో భారీ కలెక్షన్లు అందుకున్న షారుఖ్, డంకీ మూవీతో కొంచెం సైలెంట్ అయ్యారు. కానీ ఇప్పుడు షారుఖ్ మళ్లీ తన పూర్వ వైభవాన్ని తెచ్చుకోవడానికి చాలా గట్టిగా ప్రయత్నిస్తున్నారు.
కింగ్ టీజర్ కు మంచి రెస్పాన్స్
అందులో భాగంగానే షారుఖ్ తన నెక్ట్స్ మూవీ కోసం బాగా కష్టపడటమే కాకుండా ఈసారి సినిమాతో భారీగా సక్సెస్ అందుకోవాలని చూస్తున్నారు. షారుఖ్ తన తర్వాతి సినిమాగా కింగ్ ను చేస్తున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా షారుఖ్ బర్త్ డే సందర్భంగా కింగ్ టీజర్ రిలీజవగా, ఆ టీజర్ ఫ్యాన్స్ ను ఆకట్టుకోవడమే కాకుండా సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అయింది.
భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న కింగ్
సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కింగ్ మూవీ చాలా భారీగా రూపొందుతుందని సమాచారం. సిద్ధార్థ్ ఆలోచనలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అసాధారణంగా అనిపించే యాక్షన్ సీన్స్ ను కూడా ఆయన నెక్ట్స్ లెవెల్ లో తెరకెక్కించగలరు. బాలీవుడ్ లో వినిపిస్తున్న టాక్ ప్రకారమైతే, కింగ్ బడ్జెట్ రూ.400 కోట్లు దాటిందట.
రంగంలోకి హాలీవుడ్ టెక్నీషియన్లు
రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో గౌరీ ఖాన్ ఈ సినిమాను నిర్మిస్తుండగా, ఈ మూవీ యాక్షన్ సీన్స్ కోసం హాలీవుడ్ టెక్నీషియన్లను కూడా రంగంలోకి దింపారని తెలుస్తోంది. సినిమాలోని ఫుటేజ్ ను చూసిన వారు కింగ్ మూవీ చాలా వైల్డ్ గా, భారీ ఛేజింగ్ సీన్స్ తో పాటూ షారుఖ్ మూవీలో చాలా స్టైలిష్ గా కనిపించారని చెప్తున్నారు. ఆల్రెడీ షారుఖ్, సిద్ధార్థ్ ఆనంద్ కాంబినేషన్ లో గతంలో వచ్చిన పఠాన్ సినిమా రికార్డులు బద్దలు కొట్టగా, ఇప్పుడు ఆ రికార్డులను కింగ్ తో తిరగరాయాలని ఈ కాంబో ప్రయత్నిస్తోందట. మరి రిలీజ్ తర్వాత కింగ్ ఎలాంటి రికార్డులను బ్రేక్ చేస్తుందో చూడాలి.